RCB Player Rajat Patidar out from IPL 2023: ఐపీఎల్‌ 2023లో మొదటి మ్యాచ్‌లోనే విజయాన్ని అందుకుని మంచి జోరుమీదున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)కి భారీ షాక్‌ తగిలింది. ఆర్‌సీబీ స్టార్‌ బ్యాటర్ రజత్‌ పటిదార్‌ కాలి మడమ గాయం కారణంగా 16వ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ ట్విట్టర్ వేదికగా అధికారికంగా వెల్లడించింది. మడమ గాయంతో బాధపడుతున్న పటిదార్‌ పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 2 నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'దురదృష్టవశాత్తు కాలి మడమ గాయం కారణంగా రజత్ పటిదార్‌ ఐపీఎల్ 2023కు దూరమయ్యాడు. అతడు త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము. పటిదార్‌కు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తూనే ఉంటాం. ఇప్పటివరకైతే అతడి స్థానంలో మరో ఆటగాడిని జట్టులోకి తీసుకోవద్దని కోచ్‌లు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయించింది' అని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం తెలిసిన ఆర్‌సీబీ ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


మధ్యప్రదేశ్‌కు చెందిన రజత్‌ పటిదార్‌.. ఐపీఎల్‌ 2021లో అరంగేట్రం చేశాడు. ఆ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతడు 71 పరుగులే చేశాడు. అయితే ఐపీఎల్ 2022లో మాత్రం చెలరేగాడు. 8 మ్యాచ్‌ల్లో 55.50 సగటుతో 333 రన్స్ చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. లక్నోతో జరిగిన  ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పటిదార్‌ (112 నాటౌట్; 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీ చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 



గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన రజత్‌ పాటిదార్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులోకి తీసుకుంది. అయితే ఐపీఎల్ 2023లో ఆడకుండానే ఇంటిదారి పట్టాడు. ఇక ఐపీఎల్ 2023లో బెంగళూరు శుభారంభం చేసింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఏప్రిల్‌ 6న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో బెంగళూరు తలపడనుంది.


Also Read: Best Jio Recharge 2023: చౌకైన జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌.. 149కే అద్భుత ప్రయోజనాలు! ప్రతిరోజూ 1 GB డేటా


Also Read: OnePlus Nord CE 3 Lite: వన్‌ప్లస్ నుంచి చౌకైన 5G స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి