RCB vs CSK Cricket Score Online Today Match in Telugu: ఐపీఎల్ 2023 ఆసక్తికరంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ ను క్రికెట్ అభిమానులు ఎంతో ఆదరిస్తూ వీక్షిస్తున్నారు. ఇక ఈరోజు ఒక ఆసక్తికరమైన మ్యాచ్ చోటు చేసుకుంది. ఐపీఎల్ 2023లోని ఐపీఎల్ 24వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. నిజానికి ముందుగా టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బెంగళూరు జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా చెన్నై జట్టులో మాత్రం ఒక మార్పు చోటు చేసుకుంది. అదేమంటే జట్టులో మగలా స్థానంలో మతిష పతిరనను తీసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్


తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టుకు చెందిన డెవాన్ కాన్వే 83, శివమ్ దూబే 52 పరుగులతో విరుచుకు పడ్డారు. ఇక ఈ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోరుగా చెబుతున్నారు. టాస్ ఓడిన సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే ప్రారంభించారు. కానీ మొహమ్మద్ సిరాజ్ తన జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. 3 పరుగుల వద్ద రుతురాజ్ గైక్వాడ్‌కి వేన్ పార్నెల్ క్యాచ్ ఇచ్చాడు. డెవాన్ కాన్వే, శివమ్ దూబే మూడో వికెట్‌కు కేవలం 37 బంతుల్లోనే 80 పరుగుల పార్ట్నర్ షిప్ ను నెలకొల్పారు. కాన్వాయ్ 83 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హర్షల్ పటేల్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. 


Also Read: IPL Records: ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే..!


రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్
ఈ సీజన్‌లో 227 పరుగుల అత్యధిక లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన RCBకి మంచి ఆరంభం లభించలేదు. దురదృష్టవశాత్తూ విరాట్ కోహ్లీ మొదటి ఓవర్ నాలుగో బంతికి 6 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత మహిపాల్ లోమ్రోర్ రూపంలో RCBకి మరో దెబ్బ తగిలింది. ఖాతా కూడా తెరవలేకపోయిన మహిపాల్ తుషార్ దేశ్‌పాండే వేసిన బంతికి గైక్వాడ్‌కి క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత, ఫాఫ్ డుప్లెసీ, గ్లెన్ మాక్స్‌వెల్ చెన్నై బౌలర్లను తమ బ్యాట్ తో విరుచుకుపడ్డారు. కేవలం 61 బంతుల్లో 126 పరుగుల షాకింగ్ పార్టనర్ షిప్ నమోదు చేశారు. మ్యాక్స్‌వెల్ 36 బంతుల్లో 76, ఫాఫ్ డుప్లెసీ 33 బంతుల్లో 62 పరుగుల వద్ద ఔటయ్యారు. అయితే మొత్తం మీద బెంగళూరుపై చెన్నై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో చెన్నై జట్టు విజయోత్సవ సంబరాలు చేసుకుంది.  


రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్-
RCB  ప్లేయింగ్ ఎలెవన్-

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హర్షల్ పటేల్, వనిందు హసరంగా, వేన్ పార్నెల్, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్
CSK  ప్లేయింగ్ ఎలెవన్-
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్/వికెట్ కీపర్), మతిషా పతిరనా, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తిక్ష్ణ
Also Read: IPL 2023: లేటు వయసులో గర్జిస్తున్న ఆటగాళ్లు.. ఈ ముగ్గురు ప్లేయర్ల బౌలింగ్ చూశారా..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook