IPL Records: ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే..!

Fastest To 100 Wickets In IPL: ఐపీఎల్ అంటే కేవలం బ్యాట్స్‌మెన్ల ఆటే కాదు.. బౌలర్లు కూడా బ్యాట్స్‌మెన్లకు ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు పర్ఫామ్ చేస్తున్నారు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లపై ఓ లుక్కేయండి.. 
 

  • Apr 14, 2023, 22:38 PM IST
1 /5

పంజాబ్ కింగ్స్ పేసర్ కగిసో రబడా ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. గురువారం గుజరాత్ టైటాన్స్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వికెట్‌తో తీసి ఈ మైలురాయిని చేరుకున్నాడు. 64 మ్యాచ్‌లలోనే 100 వికెట్లు తీసిన ఫస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు.   

2 /5

ఇంతకుముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ మాజీ పేసర్ లసిత్ మలింగ పేరు మీద ఉండేది. మలింగ కేవలం 70 మ్యాచ్‌ల్లోనే 100 వికెట్లు తీశాడు. అత్యంత వేగంగా ఈ మార్క్ చేరుకున్న ప్లేయర్‌గా రెండో స్థానంలో నిలిచాడు. 2013 సీజన్‌లో మలింగ ఈ ఘనత సాధించాడు.   

3 /5

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పేసర్ భువనేశ్వర్ కుమార్ 81 మ్యాచ్‌ల్లో 100 వికెట్లు తీశాడు. 2017 సీజన్‌లో భువీ ఈ ఫీట్ పూర్తి చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్ కూడా 81 మ్యాచ్‌ల్లోనే 100 వికెట్లు పడగొట్టాడు.   

4 /5

గుజరాత్ టైటాన్స్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 83 మ్యాచ్‌ల్లో 100 వికెట్లు తీశాడు. 2022 సీజన్‌లో రషీద్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.   

5 /5

లక్నో సూపర్ జెయింట్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా కూడా 83 మ్యాచ్‌ల్లోనే 100 మైలురాయిని చేరుకున్నారు. అమిత్ మిశ్రా 2014 సీజన్‌లో ఈ మార్క్ చేరుకోగా.. నెహ్రా 2017లో 100 వికెట్ల క్లబ్‌లో చేరాడు.