Tilak Varma Biography: ఐపీఎల్‌ నుంచి ఎందరో స్టార్లు వెలుగులోకి వచ్చారు. ఈ క్యాష్‌ లీగ్‌లో సత్తాచాటితే.. టీమిండియాలో చోటు దక్కించుకోవడం చాలా ఈజీ. ఎందరో యంగ్ క్రికెటర్లు తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకునేందుకు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ నుంచి సరికొత్త స్టార్‌ బ్యాట్స్‌మెన్ పుట్టుకొచ్చాడు. అతనే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. గత సీజన్‌లోనే సత్తా చాటిన పెద్దగా పేరు రాలేదు. కానీ ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఆడిన ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్‌ను ఒంటి చెత్తో ఒడ్డుకు చేర్చాడు. విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ చెలరేగి ఆడడంతో ఆర్‌సీబీ సునయాసంగా విజయం సాధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్‌సీబీపై సంచలన ఇన్నింగ్స్‌ ఆడిన తిలక్ వర్మ ఓ ఎలక్ట్రీషియన్ కొడుకు. నిరుపేద కుటుంబం నుంచి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చే వరకు అతని చిన్ననాటి కోచ్ సలామ్ బయాష్ కృషి ఎంతో ఉంది. తిలక్ వర్మ 11 ఏళ్ల వయసులో బార్కాస్ గ్రౌండ్‌లో టెన్నిస్ బాల్‌ క్రికెట్ ఆడుతుండగా.. దూరం నుంచి గమనించాడు సలామ్ బయాష్‌. తిలక్ బ్యాటింగ్‌ స్టైల్ చూసి.. ఏ అకాడమీలో క్రికెట్ నేర్చుకున్నావంటూ అడిగాడు. అయితే తాను ఎక్కడ నేర్చుకోవట్లేదని.. రోజూ ఈ గ్రౌండ్‌లోనే క్రికెట్ ఆడుతున్నానంటూ తిలక్ చెప్పాడు. దీంతో వెంటనే తిలక్ తండ్రికి ఫోన్‌ చేసిన బయాష్.. క్రికెట్ అకాడమీలో చేర్పించాలని కోరాడు. అయితే అకాడమీలో చేర్చించే డబ్బు లేకపోవడంతో నిరాకరించాడు.  


దీంతో కోచ్ సలామ్ బయాష్‌ తిలక్ వర్మ ఖర్చులన్నీ భరించాడు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాడు. తిలక్ వర్మను తన ఇంటికి తీసుకెళ్లి ఫుడ్, వసతి కల్పించిఆ క్రికెట్ నేర్పించి అత్యుత్తమంగా తీర్చిదిద్దాడు. తిలక్ వర్మ శిక్షణ పొందిన క్రికెట్ అకాడమీ హైదరాబాద్‌లోని లింగంపల్లిలో ఉంది. ఇది అతని 40 కిలోమీటర్ల దూరంలో ఓల్డ్ సిటీ చంద్రాయణ్ గుట్టలో ఉంది. సలామ్ బయాష్‌ తన బైక్‌పై రోజు బైక్‌పై తీసుకువెళ్లి.. మళ్లీ తీసుకుని వచ్చేవాడు. రోజూ తెల్లవారుజామున 5 గంటలకు వర్మను బయష్‌ ఎక్కించుకుని అకాడమీకి తీసుకెళ్లేవాడు. నిద్ర సరిపోకపోవడంతో తిలక్ వర్మ ఒక్కోసారి బైక్‌పై నిద్రపోయేవాడని సలామ్ బయాష్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 


ఆయన కృషి ఫలించి.. నేడు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు. త్వరలో టీమిండియా జెర్సీలో కూడా తిలక్ వర్మను చూసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో 20 ఏళ్ల తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రూ.1.7 కోట్లకు కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు కూడా రూ.20 లక్షల బేస్ ప్రైస్‌తో వర్మను కొనుగోలు చేసేందుకు వేలం వేశాయి. గతేడాది సీజన్‌లో 131.02 స్ట్రైక్ రేట్‌తో 397 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ముంబై మిడిల్ ఆర్డర్‌లో కీలక బ్యాట్స్‌మెన్‌గా మారిపోయాడు.  


Also Read: UPI Payment Charges: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. ప్రభుత్వానికి రూ.5 వేల కోట్ల ఆదాయం.. ఐఐటీ బాంబే  సంచలన నివేదిక


Also Read: IPL Points Table: టాప్‌లేపిన రాజస్థాన్.. హైదరాబాద్ పరిస్థితి దారుణం.. మిగిలిన జట్లు ఇలా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి