RCB vs MI Playing 11: ఐపీఎల్‌లో మరో బిగ్‌ఫైట్‌కు సమయం ఆసన్నమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, ముంబై ఇండియన్స్ జట్లు ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రత్యర్థులుగా మైదానంలోకి దిగుతుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండడంతో పోరు ఇంట్రెస్టింగ్‌గా సాగనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించగా.. ఆర్‌సీబీ ప్లేఆఫ్‌కు చేరింది. పాయింట్ల పట్టికలో ముంబై చివరి స్థానంలో నిలవగా.. ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలని బరిలోకి దిగుతోంది. అయితే జస్ప్రీత్ బుమ్రా లేని స్పష్టంగా కనిపించనుంది. గాయం కారణంగా బుమ్రా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే జోఫ్ర అర్చర్ పూర్తి ఫిట్‌నెస్‌తో జట్టులో చేరడం కలిసి వచ్చే అంశం. అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లు ఆడట్లేదు. అతని స్థానంలో టోప్లీని తుదిజట్టులోకి తీసుకున్నారు. 


ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల గణాంకాలను పరిశీలిస్తే.. ముంబైదే పైచేయిగా ఉంది. ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో ముంబై 19 విజయాలు సాధించగా.. ఆర్‌సీబీ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ గణంకాలను పక్కనపెడితే రెండు జట్ల మధ్య పోరు మాత్రం హోరాహోరీగానే ఉండనుంది.


 



తుది జట్లు  ఇలా..


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, రీస్ టాప్లీ, మహ్మద్ సిరాజ్


ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్


Also Read: తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ ఓటమి.. రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ  


Also Read: Samantha Saree Photo: ప్రియుడితో శకుంతల.. ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గని సమంత!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook