Mohammed Siraj House: మొహ్మద్ సిరాజ్ కొత్త ఇంటికెళ్లిన కోహ్లీ, డుప్లెసిస్.. ఫొటోలు, వీడియో వైరల్!
Mohammed Siraj invited RCB teammates for dinner at his home in Hyderabad. సోమవారం రాత్రి బెంగళూరు జట్టు సభ్యులు లోకల్ బాయ్ మొహ్మద్ సిరాజ్ కొత్త ఇంట్లో విందుకు వెళ్లారు.
Mohammed Siraj invited RCB teammates for dinner at his home in Hyderabad: టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ గల్లీ బాయ్ మహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో సిరాజ్ మంచి ఫామ్ కనబర్చుతున్నాడు. బెంగుళూరు తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా ఉన్నాడు. ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడిన సిరాజ్.. 16 వికెట్స్ పడగొట్టాడు. బెంగుళూరు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచులలో గెలవాల్సి ఉంది. సిరాజ్ సత్తాచాటితే బెంగళూరుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తన తదుపరి మ్యాచును గురువారం (మే 18) ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం బెంగళూరు జట్టు సోమవారమే హైదరాబాద్ చేరుకుంది. సోమవారం రాత్రి బెంగళూరు జట్టు సభ్యులు లోకల్ బాయ్ మొహ్మద్ సిరాజ్ కొత్త ఇంట్లో విందుకు వెళ్లారు. బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు మరికొందరు ప్లేయర్లు ఫిల్మ్ నగర్‌లో ఉన్న సిరాజ్ కొత్త ఇంటికెళ్లారు. సిరాజ్ ఇంట్లో అందరూ విందు ఆరగించారు. బెంగళూరు ఆటగాళ్ల రాకతో ఆ ప్రాంతమంతా సందడి సందడిగా మారింది.
విరాట్ కోహ్లీతో పాటు అతని భార్య అనుష్క శర్మ కూడా మొహ్మద్ సిరాజ్ ఇంటికి వెళ్లారు. సిరాజ్ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సిరాజ్ నూతన నివాసం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు క్రికెటర్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఐదవ స్థానంలో ఉంది. ఐపీఎల్ 2023లో బెంగళూరు జట్టు 12 మ్యాచులు ఆడి 6 విజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే.. బెంగళూరుకి ప్లేఆఫ్ వెళ్లే అవకాశాలు ఉంటాయి. చివరి మ్యాచులో గెలిస్తే బెంగళూరు ఖాతాలో 16 పాయింట్స్ ఉంటాయి. అప్పుడు మిగతా జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
Also Read: Samyuktha Menon Navel Pics: లంగా వోణిలో సంయుక్త మీనన్.. నాభి అందాలతో కైపెక్కిస్తున్న కేరళ కుట్టి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.