Sawai Mansingh Stadium remain special for me Said MS Dhoni: జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియంకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ అన్నాడు. తన కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ ఇదే మైదానం అని తెలిపాడు. లక్ష్య ఛేదనకు ఇది పెద్ద స్కోరని, రాజస్థాన్‌ తొలి ఆరు ఓవర్లలో భారీగా పరుగులు చేయడమే చెన్నై ఓటమికి కారణమని ధోనీ తెలిపాడు. యశస్వి జైశ్వాల్‌, ద్రువ్‌ జురేల్‌ లాంటి కుర్రాళ్లు అద్బుతంగా ఆడారు అని మహీ ప్రశంసించాడు. ఐపీఎల్ 2023లో చెన్నై వరుస విజయాలకు రాజస్థాన్‌ రాయల్స్‌ బ్రేక్ వేసింది. గురువారం జైపుర్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ... 'జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌ సింగ్‌ మైదానం నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. నా అంతర్జాతీయ కెరీర్‌లో తొలి వన్డే సెంచరీని వైజాగ్‌లో చేశాను. అయినప్పటికీ జైపూర్‌ స్టేడియంలో చేసిన183 పరుగుల ఇన్నింగ్స్‌ నా కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌. అందుకే జైపూర్‌ స్టేడియానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. మాకు మద్దతు ఇచ్చిన అభిమానులందరికి ప్రత్యక కృతజ్థతలు' అని అన్నాడు. ఎంఎస్ ధోనీ వన్డే కెరీర్‌లో 183 పరుగులే అత్యధికం అన్న విషయం తెలిసిందే. టీమిండియా మాజీ కెప్టెన్ వన్డేలో 10, టెస్టుల్లో 6 సెంచరీలు బాదాడు. 


ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపై స్పందిస్తూ... 'లక్ష్యం ఎక్కువగానే ఉంది. ఈ పిచ్‌పై ఇంత టార్గెట్‌ కష్టం. మొదటి ఆరు ఓవర్లలలో మేం ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాం. పిచ్‌ కూడా బ్యాటర్లకు పూర్తిగా సహకరించింది. మిడిల్‌ ఓవర్లలో మా బౌలర్లు బాగా బౌలింగ్‌ చేశారు. అయితే  మిస్‌ ఫీల్డ్‌ల వల్ల పరుగులు వచ్చాయి. ఇక చివరి ఓవర్లలో ఇచ్చిన ఐదారు బౌండరీలు స్కోర్‌ పెరిగేలా చేశాయి. బౌండరీలు మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపాయి. రాజస్థాన్ జట్టుకు భారీ స్కోరు వచ్చింది. ఇక చేజింగ్ సమయంలో మాకు మంచి ఆరంభం లభించలేదు. రాజస్తాన్‌ అద్బుతంగా బ్యాటింగ్‌ చేసింది. యశస్వి జైశ్వాల్‌, ద్రువ్‌ జురేల్‌ బాగా ఆడారు. మ్యాచులో గెలుపు ఒక్కరికే దక్కుతుంది’ అని చెప్పుకొచ్చాడు.


ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 స్కోరు చేసింది. యశస్వి జైస్వాల్‌ (77; 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా.. ధృవ్‌ జురెల్‌ (34; 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), దేవదత్‌ పడిక్కల్‌ (27 నాటౌట్‌; 13 బంతుల్లో 5 ఫోర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. తుషార్‌ దేశ్‌పాండే (2/42) రెండు వికెట్లు పడగొట్టగా.. మహేష్ తీక్షణ, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్‌ తీశారు. లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేసింది. శివమ్‌ దూబే (52), రుతురాజ్ గైక్వాడ్‌ (47) రాణించారు. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో టాప్‌ స్థానంలో ఉన్న చెన్నై మూడో స్థానానికి పడిపోయింది. తొలి స్థానంలోకి రాజస్థాన్‌ చేరుకుంది.


Also Read: Fake IPL Tickets: హైదరాబాద్‌లో నకిలీ ఐపీఎల్ టికెట్లు.. ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్! జాగ్రత్త సుమీ  


Also Read: Rashmika Mandanna Hot Pics: పొట్టి డ్రెస్‌లో రష్మిక మందన్న.. కిర్రాక్ పోజులు ఇచ్చిన శ్రీవల్లి! వైరల్ పిక్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.