Uppal Police Caught Fake IPL Tickets Selling Gang: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మూడేళ్ల తర్వాత సొంత గడ్డపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ మ్యాచులు జరుగుతున్నాయి. కొరోనా కారణంగా ఇన్ని రోజులు ఇంట్లో టివిలో చూసిన ఫాన్స్.. ఇప్పుడు సొంత మైదానాల్లో మ్యాచులు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో ఐపీఎల్ 2023 టిక్కెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా కొందరు డబ్బును సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. మెగా టోర్నీ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఫేక్ టికెట్స్ దందా (Fake IPL 2023 Tickets in Hyderabad) నడుస్తోంది.
నకిలీ ఐపీఎల్ టికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపోని ఈవెంట్స్ అండ్ ఎంట్టైన్మెంట్ వెండర్ ఏజెన్సీలో సబ్ కాంట్రాక్టర్ కోమట్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి పని చేస్తున్నారు. గోవర్ధన్ రెడ్డి ఐపీఎల్ 2023 మ్యాచులకు అఖిల్ అహ్మద్, పెగ్గిది మృదుల్ వంశీ, మహమ్మద్ ఫాహీం, శ్రావణ్ కుమార్, మహమ్మద్ అజార్‌లను వ్యాలిడేటర్లుగా నియమించుకున్నాడు.
వ్యాలిడేటర్లకు జారీ చేసిన అక్రెడిటేషన్ కార్డులలోని బార్ కోడ్‌ని కాపీ చేసి నకిలీ టిక్కెట్లను తయారు చేస్తున్నారు. ఆ టిక్కెట్లను కేటుగాళ్లు అమ్ముతున్నారు. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచుకు ఏకంగా 200 అక్రమ నకిలీ టిక్కెట్స్ సృష్టించి క్రికెట్ అభిమానులకు కేటుగాళ్లు విక్రయించారు.
పక్కా సమాచారంతో నిఘా వేసిన ఉప్పల్ పోలీసులు నిందుతులను పట్టుకున్నారు. ఫేక్ టికెట్స్ అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద ఉన్న 68 నకిలీ ఐపీఎల్ టిక్కెట్స్, మూడు ఐపీఎల్ అక్రెడిటేషన్ కార్డులు, మూడు సెల్ ఫోన్లు, ఒక సీపీయు, హార్డ్ డిస్క్, మానిటర్ స్వాధీనం చేసుకున్నారు. నిందులను పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. ఈ ఫేక్ దందా ఎప్పటి నుంచి జరుగుతుంది, ఇంకా ఎవరి హస్తం ఉంది, ఇప్పటివరకు ఎన్ని టికెట్స్ అమ్మారు అనే సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు చాలా ఫేక్ టికెట్స్ అమ్మినట్టు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.