Kavya Maran Video: అబ్దుల్ సమాద్ సిక్సర్.. కావ్య పాప రియాక్షన్ చూశారా..! వీడియో వైరల్
RR vs SRH Highlights IPL 2023: రాజస్థాన్ రాయల్స్‌పై అద్భుత విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి. అబ్దుల్ సమాద్ చివరి బంతికి సిక్సర్ బాది జట్టును గెలిపించాడు. హైదరాబాద్ విజయం తరువాత కావ్య మారన్ రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది.
RR vs SRH Highlights IPL 2023: ఆదివారం రాత్రి ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరమైన దశలో సందీప్ శర్మ వేసిన నోబాల్ మ్యాచ్‌ను మలుపుతిప్పింది. కలిసివచ్చిన అదృష్టాన్ని వినియోగించుకున్న అబ్దుల్ సమాద్.. సిక్సర్‌గా మలిచి జట్టును గెలిపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేయగా.. హైదరాబాద్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అబ్దుల్ సమాద్ సిక్సర్ బాదిన వెంటనే.. ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ తెగ సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ విన్ అవ్వగానే.. ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సంబరంతో తెగ గంతులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కావ్య మారన్ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 రన్స్ చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (95, 59 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ సంజూ శాంసన్ (66, 38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది. యశస్వి జైశాల్ 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.
అభిషేక్ శర్మ (55, 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి (47, 29 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. అన్మోల్‌ప్రీత్ 25 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఆఖరి రెండు ఓవర్లలో 41 పరుగులు చేయాల్సిన దశలో గ్లెన్ ఫిలిప్స్ రెచ్చిపోయి ఆడాడు. కుల్దీప్ వేసిన 19 ఓవర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాదడంతో 22 పరుగులు రాబట్టాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.
ఇక చివరి ఓవర్‌లో అబ్దుల్ సమాద్ మెరుపులు మెరిపించి జట్టును గెలిపించాడు. ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరమైన దశలో అబ్దుల్ సమాద్ భారీ షాట్‌కు యత్నించాడు. బౌండరీ లైన్ వద్ద బట్లర్ క్యాచ్ అందుకున్నాడు. కానీ అంపైర్ నోబాల్‌గా ప్రకటించడంతో చివరి బంతిని సిక్సర్‌గా మలిచాడు సమాద్. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఇది నాలుగో విజయం. 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి చేరుకుంది. ఈ గెలుపుతో హైదరాబాద్ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి