Shreyas Iyer IPL 2023: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2023 నుంచి భారత స్టార్ ప్లేయర్ ఔట్!
Shreyas Iyer Out From IPL 2023 and WTC Final 2023. వెన్ను గాయంతో కేకేఆర్ కెప్టెన్, టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 2023కి దూరం అయ్యాడు.
Shreyas Iyer Out From IPL 2023 and WTC Final 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023కి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. వెన్ను గాయంతో కేకేఆర్ కెప్టెన్, టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 2023కి దూరం అయ్యాడు. అయ్యర్‌కు శస్త్రచికిత్స జరగాల్సి ఉన్న కారణంగా ఐపీఎల్ ఆడడం లేదు. అంతేకాదు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023కి కూడా దూరం కానున్నాడు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.
వెన్ను సమస్య కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ ఆడలేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో అయ్యర్ ఆడలేదు. అయితే 2, 3 టెస్టులో బ్యాటింగ్ చేశాడు. ఇక వెన్ను నొప్పి బాదిస్తుండడంతో నాలుగో టెస్టులో బ్యాటింగ్ చేయలేదు. ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3 మ్యాచ్‌ల సిరీస్‌కు భారత వన్డే జట్టులో అయ్యర్‌కు చోటు దక్కింది. కానీ వెన్నులో గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్నాడు. అయితే సూర్యకుమార్ ఆశించిన మేర ఆడడం లేదు.
ప్రస్తుతం బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు. అతడి వెన్ను గాయానికి శస్త్రచికిత్స అవసరం అయింది. శస్త్రచికిత్స అనంతరం అయ్యర్ 4-5 మైదానానికి దూరం కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2023, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023కి అయ్యర్ దూరం కావాల్సి వచ్చింది. అంతేకాదు ఈ ఏడాది భారత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్ 2023కి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక అయ్యర్ శస్త్రచికిత్సపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాంచైజీ రూ. 12.25 కోట్లకు శ్రేయాస్ అయ్యర్‌ను దక్కించుకుంది. సారథిగా కూడా నియమించింది. అయ్యర్ వెన్ను గాయం కారణంగా కేకేఆర్‌కు కొత్త సారథిని నిమించుకోవాల్సి వస్తుంది. ఆండ్రీ రస్సెల్ కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ విషయానికొస్తే.. అయ్యర్ స్థానంలో దేశవాళీ క్రికెట్ హీరో సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం దక్కనుంది.
Also Read: Virat Kohli Dance: విరాట్ కోహ్లీకి ఏమైంది.. మూడో వన్డేలో వింత ప్రవర్తన! వీడియో వైరల్
Also Read: Rohit Sharma-Virat Kohli: కేవలం 2 రన్స్ మాత్రమే.. ప్రపంచ రికార్డు నెలకొల్పనున్న రోహిత్-కోహ్లీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.