SRH Vs DC Highlights: ఇంట్రెస్టింగ్ సీన్.. భువనేశ్వర్ కాళ్లు పట్టుకున్న డేవిడ్ వార్నర్..!
David Warner Touches Bhuvneshwar Kumars Feet: ఎస్ఆర్హెచ్, ఢిల్లీ జట్ల మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. నాలుగేళ్ల తరువాత ఉప్పల్ స్టేడియానికి వచ్చిన డేవిడ్ వార్నర్.. తన పాత సహచరులతో ముచ్చటించాడు. ఈ సందర్బంగా తన స్నేహితుడు భువనేశ్వర్ కాళ్లు పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
David Warner Touches Bhuvneshwar Kumars Feet: సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటిల్స్‌తో జరిగిన పోరులో 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఢిల్లీ విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ కేవలం 137 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీకి ఇది వరుసగా రెండో విజయం కాగా.. ఎస్‌ఆర్‌హెచ్‌కు ఓవరాల్‌గా ఐదో ఓటమి. హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన ఏడింటిలో ఆరు మ్యాచ్‌లు నెగ్గాల్సి ఉంటుంది. అటు ఢిల్లీ పరిస్థితి కూడా సేమ్ అలానే ఉంది. తన మాజీ టీమ్‌పై విజయంతో డేవిడ్ వార్నర్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు.
ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఢిల్లీ బౌలర్ ఇషాంత్ శర్మ, హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ ఇద్దరు మాట్లాడుకుంటుండగా.. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పరిగెత్తుకుంటూ వెళ్లి.. భువనేశ్వర్ కాళ్లు పట్టుకున్నాడు. అనంతరం ఒకరినొకరు హాగ్ చేసుకుని.. నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
చాలాకాలం పాటు డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్ కలిసి సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరుఫున ఆడారు. వార్నర్ కెప్టెన్సీలో భువీ అద్భుతంగా బౌలంగ్ చేసి జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ప్రస్తుతం ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్.. నాలుగేళ్ల తరువాత ఉప్పల్ స్టేడియానికి రావడంతో కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. తన సొంత మైదానంగా భావించే ఉప్పల్ స్టేడియంలో తన పాత టీమ్‌మేట్స్‌ను ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. అందరితోనూ సరదాగా మాట్లాడాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ఢిల్లీ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై హైదరాబాద్ బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేశారు. భువనేశ్వర్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ సాల్ట్‌ను డకౌట్ చేశాడు. ఇక్కడి మొదలైన వికెట్ల పతనం చివరి వరకు కంటిన్యూ అయింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (21) రన్స్ చేసి ఔట్ అయ్యాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లలో మనీష్ పాండే 27 బంతుల్లో 34 పరుగులు చేయగా.. అక్షర్ పటేల్ 34 బంతుల్లో 34 రన్స్ చేశాడు. మిచెల్ మార్ష్ (25) పర్వాలేదనిపించాడు. చివరకు 9 వికెట్ల నష్టానికి 144 రన్స్‌కు పరిమితమైంది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ నాలుగు ఓవర్లు వేసి కేవలం 11 పరగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా.. నటరాజన్ ఒక వికెట్ పడగొట్టాడు. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ముగ్గురు రనౌట్ అయ్యారు.
Also Read: IPL 2023: ఐపీఎల్ ఆడని దిగ్గజ క్రికెటర్లు.. ఆ ఐదుగురు ఎవరంటే..?
20 ఓవర్లు.. 145 పరుగుల లక్ష్యం.. పైగా సొంతం మైదానం.. హైదరాబాద్ ఈజీగా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఢిల్లీ బౌలర్లు స్వల్ప లక్ష్యాన్ని అద్భుతంగా కాపాడుకున్నారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (39 బంతుల్లో 49), హెన్రీ క్లాసెన్ (19 బంతుల్లో 31), వాషింగ్టన్ సుందర్ (15 బంతుల్లో 24) మినహా ఎవరు రాణించలేదు. చివరి ఓవర్‌లో హైదరాబాద్ విజయానికి 13 పరుగులు అవసరం అవ్వగా.. ఢిల్లీ బౌలర్ ముఖేష్ కుమార్ సూపర్‌గా బౌలింగ్ చేశాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చి ఢిల్లీని గెలిపించాడు. ఢిల్లీ`బౌలర్లలో నోకియా, అక్షర్ పటేల్ చెరో వికెట్లు, ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా అక్షట్ పటేల్ ఎంపికయ్యాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook