Top Cricketers who Never played in IPL: ఐపీఎల్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్. ఈ లీగ్‌లో ఆడాలని ప్రతి క్రికెటర్ కలగంటాడు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్.. 16 ఏళ్లుగా క్రికెట్ అభిమానులను అలరిస్తూనే ఉంది. అయితే క్రికెట్ చరిత్రలో దిగ్గజాలుగా పేరు పొందిన గొప్ప క్రికెటర్లకు ఐపీఎల్లో ఆడే అవకాశం లభించలేదు. ఐపీఎల్లో ఆడని ఆ ఐదుగురు ప్లేయర్లు ఎవరంటే..?
వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్, మాజీ కెప్టెన్ బ్రియన్ లారా అద్భుతమైన బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెస్టుల్లో 401 రన్స్ చేసిన ఆటగాడిగా ఇప్పటికి ఆ రికార్డు లారా పేరుపైనే ఉంది. అయితే లారా ఐపీఎల్లో ఆడలేదు.
వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ ముష్పీకర్ రహీమ్ బంగ్లాదేశ్‌కు ఒంటిచెత్తో ఎన్నో విజయాలు అందించాడు. బంగ్లా క్రికెట్ ఎదుగుదలలో కచ్చితంగా ముష్ఫీకర్ పేరు ఉంటుంది. అయితే ఈ దిగ్గజ ప్లేయర్ కూడా ఐపీఎల్లో పాల్గొనలేదు.
ఇంగ్లాండ్ స్పీడ్ స్టార్ స్టువర్ట్ బ్రాడ్ కూడా ఐపీఎల్లో ఆడలేదు. ఇంగ్లాండ్‌కు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నా.. ఈ స్టార్ ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వలేదు.
మరో ఇంగ్లాండ్ పేసర్, టెస్ట్ క్రికెట్లో ఆల్ టైమ్ గ్రేట్ బౌలర్లలో ఒకరు జేమ్స్ అండర్సన్. అయితే ఈ దిగ్గజ ప్లేయర్ కూడా ఐపీఎల్లో ఆడలేదు.
బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ దూకుడు బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. క్రీజ్‌లో ఉన్నంతసేపు ప్రతి బంతిని బౌండరీకి తరలించేందుకు ప్రయత్నిస్తాడు. తమీమ్ కూడా ఐపీఎల్లో పాల్గొనలేదు.