Karnataka Assembly Elections 2023: కర్ణాటక ఎన్నికల బరిలో ఫ్యామిలీ మెంబర్స్.. ఏ పార్టీ నుంచి ఎవరంటే..?

Karnataka Assembly Elections Candidates List: కర్ణాటక ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కొంతమంది తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. మరి కొంతమంది ఇప్పటికే రాజకీయాల్లో ఆరితేరారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 24, 2023, 09:00 PM IST
Karnataka Assembly Elections 2023: కర్ణాటక ఎన్నికల బరిలో ఫ్యామిలీ మెంబర్స్.. ఏ పార్టీ నుంచి ఎవరంటే..?

Karnataka Assembly Elections Candidates List: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్నకొద్ది అభ్యర్థులు మాటల తుటాలు పేలుస్తున్నారు. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తూ.. ప్రత్యర్థులపై విమర్శలతో రెచ్చిపోతున్నారు. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఒకరికి మించి మరొకరు ప్రచార రేసులో దూసుకుపోతున్నారు. నిత్యం ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ.. తమనే గెలిపించాలని కోరుతున్నారు. మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి ఒకే కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ చేస్తున్నారు. ఎన్నికల రేసులో ఉన్న ఫ్యామిటీ మెంబర్స్‌ను ఓసారి పరిశీలిద్దాం.. 

బీజేపీ నుంచి పోటీ చేస్తోంది వీళ్లే..

==> అధికార బీజేపీ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ జాబితా చాలా పెద్దగానే ఉంది. ఒకే కుంటుంబ నుంచి ఒక్కరి కంటే ఎక్కువమంది టికెట్లు దక్కించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత సోమప్ప రాయప్ప బొమ్మై కుమారుడు ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై హవేరి జిల్లాలోని షిగ్గావ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

==> మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు బీఎస్‌ యడ్యూరప్ప ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. ఆయన కుమారుడు బీవై విజయేంద్ర శివమొగ్గ జిల్లాలోని శికారిపుర స్థానం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. బళ్లారి, హరపనహళ్లి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి సోదరులు సోమశేఖరరెడ్డి, కరుణాకర్‌రెడ్డి పోటీలో ఉన్నారు.

==> బెలగావి జిల్లాకు చెందిన దివంగత లింగాయత్ నేత ఉమేష్‌ కత్తి ఫ్యామిలీలో ఇద్దరు టికెట్లు దక్కించుకున్నారు. ఉమేష్ కత్తి కొడుకు నిఖిల్‌ కత్తిని హుక్కేరి నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన సోదరుడు రమేష్‌ కత్తి చిక్కోడి-సదలగా స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ పడుతున్నారు.
 
==> బీజేపీ ఎంపీ సంగ్మా కోడలు మంజుల అమ్రీస్‌కు కూడా బీజేపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. కొప్పల్ అసెంబ్లీ స్థానం ఆమె పోటీ చేస్తున్నారు. మంత్రి శశికళ జాటీ నిప్పాణి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె భర్త సాహెబ్ జాలీ చిక్కోడి ఎంపీగా ఉన్నారు.

==> ప్రస్తుత రవాణా శాఖ మంత్రి ఆనంద్‌ సింగ్‌ ఎన్నికల బరిలో నిలవగా.. ఆయన మేనల్లుడు టీహెచ్‌ సురేష్‌ బాబుకు బీజేపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. 

కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న నాయకులు..

==> మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు వరుణ స్థానం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా యతీంద్ర ఈ స్థానం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ ఎస్సీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. 
 
==> కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ బెంగళూరు రూరల్ స్థానం నుంచి బరిలో నిలబడ్డారు. శివకుమార్ నామినేషన్ తిరస్కరణకు గురవుతుందనే అనుమానంతో ఆయనతో కూడా నామినేషన్ వేయించారు. 
 
==> దావణగెరె నార్త్ నియోజకవర్గం నుంచి శామనూరు శివశంకరప్ప తనయుడు ఎస్‌ఎస్‌ మల్లికార్జునకు కాంగ్రెస్ తరుఫున బరిలో ఉన్నారు. దేవనహళ్లి ఎస్సీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేహెచ్ మునియప్ప కుమార్తె రూపకళ ఎం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఎస్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 

==> మాజీ మంత్రి రామలింగారెడ్డి, ఆయన ఎమ్మెల్యే కుమార్తె సౌమ్యారెడ్డి కూడా పోటీలో ఉన్నారు. విజయనగర్‌ నుంచి ఎం.కృష్ణప్పకు, గోవిందరాజ్‌ నగర్‌ నుంచి ఆయన కుమారుడు ప్రియకృష్ణ కాంగ్రెస్‌ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.

Also Read: Karnataka Elections: సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు హ్యాండిచ్చిన బీజేపీ.. అసలు కారణం చెప్పిన అమిత్ షా

జేడీఎస్ నుంచి..

==> మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుటుంబం నుంచి చాలామంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దేవెగౌడ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి చన్నపట్న అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కుమారస్వామి తనయుడు నిఖిల్ దేవెగౌడ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దేవెగౌడ రెండో కుమారుడు హెచ్‌డీ రేవణ్ణ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. రేవణ్ణ భార్యకు హాసన్‌కు కూడా ఎమ్మెల్యే టికెట్ అడిగారు. అయితే ఆమె స్థానంలో స్వరూప్‌ ప్రకాశ్‌కు టికెట్‌ కేటాయించారు.

==> చాముండేశ్వరి స్థానం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా జీటీ దేవెగౌడ పోటీ చేస్తున్నారు. ఆయన తనయుడు హరీష్ గౌడ్‌కు జేడీఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

Also Read: Ajinkya Rahane IPL: రఫ్పాడిస్తున్న అజింక్యా రహానే.. ఆ టైమింగే వేరప్పా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News