Today Match in IPL 2023: SRH బోణీ కొట్టేనా..? PBKSతో ఢీ.. డ్రీమ్ 11 టీమ్ కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్
SRH Vs PBKS Dream11 Team Prediction: ఈ సీజన్‌లో తొలి విజయం కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ నిరీక్షణ కొనసాగుతోంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ఎస్‌ఆర్‌హెచ్.. సొంతగడ్డపై అయినా బోణీ కొట్టాలని చూస్తోంది. నేడు పంజాబ్ కింగ్స్‌ను ఢీకొట్టబోతుంది.
IPL 2023 SRH Vs PBKS Dream11 Team Prediction: సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో మూడో మ్యాచ్‌కు రెడీ అయింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఎస్‌ఆర్‌హెచ్.. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో అయినా విజయం సాధించి పాయింట్ల ఖాతా ఓపెన్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన పంజాబ్ బలంగా కనిపిస్తోంది. శిఖర్ ధావన్ నాయకత్వంలోని పంజాబ్.. ఈ సీజన్‌లో కోల్‌కతా, రాజస్థాన్‌లను పంజాబ్ ఓడింంచి. మరోవైపు రాజస్థాన్, లక్నో చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది.
పిచ్ రిపోర్ట్ ఇలా..
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం పిచ్ ఎక్కువగా బ్యాట్స్‌మెన్‌కు సహకరిస్తుంది. ఫాస్ట్ బౌలర్లకు కూడా అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపించలేరు. అయితే ఇక్కడ ఛేజింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపవచ్చు. పంజాబ్, హైదరాబాద్ జట్ల మధ్య ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఎస్‌ఆర్‌హెచ్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. పంజాబ్ 7 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. హెడ్ టు హెడ్ రికార్డులో హైదరాబాద్ జట్టుదే పై చేయిగా కనిపిస్తున్నా.. నేటి మ్యాచ్‌లో ఎలా ఆడుతుందనే విషయం ఆసక్తిగా మారింది.
ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ విషయానికి వస్తే.. ఈ సీజన్‌లో ఒక్కరు కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఎన్నో ఆశలతో కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మయాంక్ అగర్వాల్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. ఓపెనర్‌గా అభిషేక్ శర్మను తిరిగిజట్టులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. రాహుల్ త్రిపాఠి ఫామ్‌ను అందుకోవాల్సి ఉంది. కెప్టెన్ మార్క్‌రమ్ గత మ్యాచ్‌లో తొలి బంతికే డకౌట్ అయ్యాడు. మార్క్‌రమ్ పుంజుకుంటే ఎస్‌ఆర్‌హెచ్ కష్టాలు తీరినట్లే. హెన్రిచ్ క్లాసెన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బౌలింగ్‌లో భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్ ధారళంగా పరుగులు ఇవ్వడం ఆందోళన కలిగించే అంశం. వాషింగ్టన్ సుందర్ పెద్దగా రాణించలేదు. ఆదిల్ రషీద్ ఒక్కడే పర్వాలేదనిపిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పుంజుకోకపోతే హైదరాబాద్‌కు గెలవడం కష్టమే.
మరోవైపు పంజాబ్ కింగ్స ఈ సీజన్‌ను ఉత్సాహంగా ఆరంభించింది. ముఖ్యంగా ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. భానుక రాజపక్స కూడా మొదటి మ్యాచ్‌లో బ్యాట్‌తో అదరగొట్టాడు. రెండో మ్యాచ్‌కు రిటైర్డ్‌హార్ట్‌గా వెనుదిరిగాడు. మిడిల్ ఆర్డర్‌లో కాస్త వీక్‌గా కనిపిస్తోంది. జీతేష్ శర్మకు తోడు సామ్ కర్రన్ బ్యాట్‌తో పరుగులు చేయాల్సి ఉంది. షారుఖ్ ఖాన్ బాగానే ఆడుతున్నా.. వేగంగా పరుగులు చేయడంలో ఇబ్బందిపడుతున్నాడు. బౌలింగ్‌లో నాథన్ ఎల్లిస్, అర్షదీప్ సింగ్ ఆకట్టుకుంటున్నారు.
రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా (అంచనా)..
సన్ రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్, మార్కో యాన్సిన్.
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), భానుక రాజపక్స, జితేష్ శర్మ, సికందర్ రజా, సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.
డ్రీమ్ 11 టీమ్ (SRH vs PBKS Dream11 Team): ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, సికందర్ రజా, ఐడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), సామ్ కర్రాన్, ఆదిల్ రషీద్, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, ఉమ్రాన్ మాలిక్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి