Kolkata Knight Riders Vs Sunrisers Hyderabad Dream 11: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక సమరానికి సిద్ధమైంది. పటిష్ట కోల్‌కతా నైట్ రైడర్స్‌ను నేడు ఢీకొట్టబోతుంది. సొంతగడ్డపై పంజాబ్‌ కింగ్సపై విజయం సాధించి హైదరాబాద్‌ జోరు మీద ఉండగా.. వరుస విజయలతో కేకేఆర్ హోరెత్తిస్తోంది. ముఖ్యంగా చివరి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై చివరి ఓవర్‌లో రింకూ సింగ్ బాదిన ఐదు సిక్సర్లు ఐపీఎల్ టోర్నీకే హైలెట్. రెండు జట్లు మంచి ఫామ్‌లో ఉండడంతో హోరాహోరీగా పోరు జరిగే అవకాశం ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్లు ప్లేయింగ్‌ 11లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిచ్ రిపోర్ట్ ఇలా..


కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానం పూర్తిగా బ్యాటింగ్ పిచ్. బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించే అవకాశం ఉంది. ఇక్కడ ఎక్కువసార్లు ఛేజింగ్ చేసిన జట్టే గెలుపొందింది. ఇప్పటివరకు 79 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగ్గా.. బౌలింగ్ జట్టు 47 సార్లు గెలిచింది. మొదటి ఇన్నింగ్స్ సగటు 162 రన్స్‌గా ఉంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు జరిగాయి. కేకేఆర్ 15, సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. చివరి ఐదు మ్యాచ్‌ల్లో కోల్‌కతా ఐదింటిలో గెలిస్తే.. ఎస్‌ఆర్‌హెచ్ ఒక్క మ్యాచ్‌లోనే గెలుపొందింది. 


పంజాబ్‌పై విజయం సాధించి జోరు మీద ఉన్నా.. ఎస్ఆర్‌హెచ్ టీమ్ బ్యాటింగ్‌లో లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓపెనర్లు విఫలమవుతున్నారు. మయాంక్ అగర్వాల్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడు. కోట్లు వెచ్చించి తీసుకున్న హ్యారీ బ్రూక్ ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈ హార్డ్ హిట్టర్‌ను గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దింపినా ఫ్లాప్ అయ్యాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ మార్క్‌రమ్‌పైనే ఆ జట్టు ఆశలన్నీ ఉన్నాయి. వికెట్ కీపర్‌ హెన్రిచ్ క్లాసెన్‌కు గత మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో సన్‌రైజర్స్ జోరు కొనసాగించే అవకాశం ఉంది. భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్, మార్కో జాన్సన్, నటరాజన్, మయాంక్ మార్కండేతో పటిష్టంగా ఉంది. 


అటు కోల్‌కతా బ్యాటింగ్ విభాగం కూడా ఇబ్బందులు పడుతోంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో కూడా అదృష్టవశాత్తూ విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఒకరు ఆడితే మరో మ్యాచ్‌లో విఫలమవుతున్నారు. రహ్మానుల్లా గుర్బాజ్, వెంటటేష్ అయ్యర్, కెప్టెన్ నితీష్‌ రాణా, రింకూ సింగ్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆండ్రీ రస్సెల్ వరుసగా విఫలమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బౌలింగ్‌లో శార్దుల్ ఠాకూర్‌, సునీల్ నరైన్, లాకీ ఫెర్గ్యూసన్, ఉమేష్ యాదవ్, సుయాష్‌ శర్మలతో పటిష్టంగా ఉంది.


Also ReadL Shubman Gill Sister: శుభ్‌మన్ గిల్ సోదరిని చూశారా..? బోల్డ్ పోజులతో మైండ్ బ్లాక్


రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా)


హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ 


కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఎన్.జగదీషన్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గ్యూసన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
 
డ్రీమ్ 11 టీమ్ (KKR vs SRH Dream11): 
వికెట్ కీపర్: రహ్మానుల్లా గుర్బాజ్
బ్యాటర్లు: రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్
ఆల్ రౌండర్లు: మార్క్‌క్రమ్, సునీల్ నరైన్ (వైస్ కెప్టెన్)
బౌలర్లు: ఉమ్రాన్ మాలిక్, లాకీ ఫెర్గ్యూసన్, భువనేశ్వర్ కుమార్


Also Read: IPL 2023 Updates: చెన్నైపై గెలిచిన రాజస్థాన్‌కు షాక్.. సంజూ శాంసన్‌కు ఫైన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.