Punjab Kings Vs Gujarat Titans Dream11: ఐపీఎల్‌ 2023లో భాగంగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య గురువారం పోరు జరగనుంది. రెండు జట్లు కూడా ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి.. చెరో రెండు మ్యాచ్‌లు గెలిచి ఒక దాంటో ఓడిపోయాయి. కేకేఆర్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో గుజరాత్ ఓడిపోగా.. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన పోరులో పంజాబ్‌ ఓడిపోయింది. నేడు జరిగే మ్యాచ్‌లో గెలుపొంది.. మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కాలని రెండు జట్లు భావిస్తున్నాయి. గత మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ హార్థిక్ పాండ్యా జట్టులోకి తిరిగి వస్తుండడం గుజరాత్‌కు శుభపరిణామం కాగా.. స్టార్‌ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ అందుబాటులోకి రావడం పంజాబ్‌కు సూపర్‌ న్యూస్. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. 
 
పిచ్ రిపోర్ట్ ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొహాలీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. పిచ్‌పై మంచి బౌన్స్ ఉండడంతో బంతి బ్యాట్‌పైకి వస్తుంది. మరోసారి పరుగుల వరదపారే అవకాశం ఉంది. అయితే ప్రారంభంలో స్వింగ్, బౌన్స్‌తో ఫాస్ట్ బౌలర్లు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మ్యాచ్‌సాగే కొద్దీ పరుగులు చేయడం సులభం అవుతుంది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది.  ఈ రోజు వర్షం కురిసే అవకాశం లేదు. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరిగితే చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో మరోసారి రెండు జట్ల మధ్య ఆసక్తికరమైన ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది.  


ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన పోరులో శిఖర్ ధావన్ పంజాబ్ బ్యాట్స్‌మెన్ మొత్తం చేతులెత్తేశారు. ధావన్ మినహా ఎవరు కూడా పెద్దగా రాణించట్లేదు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్,  మాథ్యూ షార్ట్, జితేష్ శర్మ ఈ మ్యాచ్‌లో చెలరేగితే పెద్దగా ఇబ్బంది ఉండదు. లివింగ్‌స్టోన్ రాకతో పంజాబ్ బ్యాటింగ్ మరింత బలోపేతం కానుంది. కోట్లు పెట్టిన తీసుకున్న సామ్ కర్రన్ ఏమాత్రం ప్రభావం చూపించకపోవడం కలవరపరుస్తోంది. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బార్, రాహుల్ చాహర్ మంచి టచ్‌లోనే ఉన్నారు. 


Also Read: Sara Tendulkar: హీరోయిన్స్‌ను తలదన్నేలా.. సారా టెండూల్కర్ గోవా ట్రిప్ పిక్స్ చూశారా..!


గుజరాత్ విషయానికి వస్తే.. చివరి మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. రింకూ సింగ్ చివరి ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదడంతో గుజరాత్‌కు సీజన్‌లో తొలి ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్‌కు హార్థిక్ పాండ్యా అందుబాటులో ఉండనున్నాడు. రషీద్‌ఖాన్‌ను పంజాబ్ బ్యాటింగ్ దళం ఎదుర్కొందనేది ఆసక్తికరంగా మారింది. అల్జారీ జోసెఫ్ సూపర్‌గా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టుదే పైచేయిగా కనిపిస్తోంది. 


రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా)


పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్),  మాథ్యూ షార్ట్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.


గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మాన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ, సాయి కిషోర్, జోస్ లిటిల్.


డ్రీమ్ 11 టీమ్ (PBKS vs GT Dream11): 
వికెట్ కీపర్: వృద్ధిమాన్ సాహా
బ్యాటర్లు: శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, డేవిడ్ మిల్లర్  
ఆల్ రౌండర్లు: హార్దిక్ పాండ్యా, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్ 
బౌలర్లు: రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, అర్ష్‌దీప్ సింగ్


Also Read: Surya Kumar Yadav IPL: సూర్యకుమార్ యాదవ్ నువ్వో తోపు ప్లేయర్.. బ్యాట్‌తోనే సమాధానం చెప్పు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.