Little kid wanna take Virat Kohli daughter Vamika on date: ఐపీఎల్ 2023లో భాగంగా సోమవారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరిగిన విషయం. బౌండరీలు, సిక్సులు వర్షం కురిసిన ఈ మ్యాచ్‌ అభిమానులకు అసలైన ఐపీఎల్ మజాను అందించింది. విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడినా.. చివరకు చెన్నైనే వరించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ను 'జియో సినిమా'లో దాదాపుగా 2.3 కోట్ల మంది వీక్షించారు. దాంతో ఐపీఎల్ రికార్డ్స్ బద్దలయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కంటే.. చిన్నస్వామి స్టేడియంలో ఓ బుడ్డోడు పట్టుకున్న ప్లకార్డు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా ఐదేళ్లు ఉండే ఓ పిల్లాడు.. బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్లకార్డు ద్వారా ఓ రిక్వెస్ట్ పంపాడు. వామికాను (Vamika Kohli) డేట్‌కి తీసుకెళ్లవచ్చా అని కోరాడు. 'హాయ్ విరాట్ అంకుల్. నేను వామికాను డేట్‌కు తీసుకెళ్లొచ్చా?' అని ప్లకార్డులో రాశాడు. బెంగళూరు జెర్సీ వేసుకున్న ఆ బుడ్డోడికి సంబందించిన ఫొటోను '𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧' అనే ట్విట్టర్ యూసర్ పోస్ట్ చేశాడు. 


బుడ్డోడు పట్టుకున్న ప్లకార్డు ఫొటో (Vamika Dating) సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటో చూసిన అభిమానులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 'అరె బుడ్డోడా.. అప్పుడే డేటింగ్ ఏంది రా' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'విరాట్ కోహ్లీ కూతురికే లైన్ ఏస్తున్నావా?' అని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు బుడ్డోడిపై ఫైర్ అవుతున్నారు. 'నీ వయసు ఏంటి.. నువ్ డేటింగ్ గురించి మాట్లాడడమా' , 'మీ పేరెంట్స్ ఎక్కడున్నారు', 'ఇక నీ పని అయిందిరా' అని మండిపడుతున్నారు. జస్ట్ ఫేమ్ కోసమే వారి తలిదండ్రులు ఇలా చేసుంటారని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. 



టీమిండియా స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌లో కలుసుకుని స్నేహితులు అయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో 2017 డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2021 జనవరి 11న కోహ్లీ-అనుష్కకు వామికా జన్మించింది. అయితే ఇప్పటివరకు వామికా ఫొటోను అధికారికంగా విడుదల చేయలేదు. తన కూతురికి ప్రైవసీ ఇవ్వాలని, ఎవరూ ఫొటోస్ తీయొద్దని విరుష్క జంట మీడియాను కోరింది. 


Also Read: Pooja Hegde Hot Pics: రెడ్ డ్రెస్‌లో పూజా హెగ్డే అందాలు.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న బుట్టబొమ్మ తాజా ఫొటోలు!  


Also Read: SRH vs MI Head to Head Records: ఉప్పల్‌ స్టేడియంలో సూపర్ మ్యాచ్.. సన్‌రైజర్స్, ముంబై ముఖాముఖి రికార్డ్స్, పిచ్ రిపోర్ట్‌ ఇదే!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.