ఇరాన్ ప్రభుత్వం ఓ క్రీడాకారుడికి మరణశిక్షను అమలు చేసింది. దేశ ప్రభుత్వానికి వ్యతిరేక కార్యకలాపాలలో పొల్గొన్నాడని నవీద్ అఫ్కారీ(27) అనే రెజ్లర్‌ (Navid Afkari Executed)పై ఆరోపణలున్నాయి. కేసు విచారించగా అతడు ఓ సెక్యూరిటీ గార్డును హత్య చేశాడని తేల్చారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది. కానీ ఇరాన్ ప్రభుత్వం అతడికి మరణశిక్షను ఖరారు చేసింది. Twins Died: పాము ఎంగిలి చేసిన పాలు తాగి కవల చిన్నారులు మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ వ్యాప్తంగా 90 వేల మంది అథ్లెట్లు, క్రీడాకారులు విన్నవించుకున్నా ఇరాన్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. తాజాగా రెజ్లర్ నవీద్ అఫ్కారీకి మరణశిక్షను అమలు (Iran executes wrestler Navid Afkari) చేసింది. మరణశిక్ష అమలుకు ముందు నవీద్ మాట్లాడిన ఓ ఆడియో టేపు లీకైంది. స్వశక్తితో పోరాటం చేయాలనుకున్న ఓ యోధుడి ప్రాణాలు తీస్తున్నారంటూ నవీద్ మాట్లాడినట్లు ఆడియోటేపులో ఉండటం గమనార్హం. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం రెజ్లర్‌కు క్షమాభిక్ష పెట్టాలని కోరిన వారిలో ఉన్నారు. Kotamreddy Sridhar Reddy: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR