Siraj-Shami: షమీని ఎందుకు జట్టులోకి తీసుకోలేదు.. సిరాజ్ అంత తోపా! బీసీసీఐ ఫాన్స్ ఫైర్
Fans trolls BCCI over Mohammed Siraj replaced Jasprit Bumrah. మొహ్మద్ షమీని కాదని దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేయడం కొందరు భారత అభిమానులకు నచ్చడం లేదు.
Is Mohammed Siraj better bowler than Mohammad Shami, Fans trolls BCCI: గాయంతో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్ 2022కి దూరమైన విషయం తెలిసిందే. స్వదేశంలో ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు బుమ్రా స్థానంలో హైదరాబాదీ పేసర్, గల్లీ బాయ్ మహమ్మద్ సిరాజ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. బుమ్రా స్థానంలో సిరాజ్‌ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. దాంతో దక్షిణాఫ్రికాతో చివరి రెండు మ్యాచ్‌లకు హైదరాబాదీ పేసర్ అందుబాటులో ఉండనున్నాడు.
ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న సీనియర్ పేసర్ మొహ్మద్ షమీని కాదని దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేయడం కొందరు భారత అభిమానులకు నచ్చడం లేదు. ఇన్నింగ్స్ ఆరంభంలో, డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేసే షమీని బీసీసీఐ పక్కనపెట్టడంతో ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షమీ టీ20 ప్రపంచకప్ 2022 స్టాండ్‌బై లిస్ట్‌లో ఉన్నాడు కాబట్టి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు అతడిని ఎంపిక చేస్తే బాగుండేదని అబిప్రాయపడుతున్నారు.
జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేసిన అనంతరం ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై మండిపడుతున్నారు. షమీని ఎందుకు జట్టులోకి తీసుకోలేదు అని ఒకరు ప్రశ్నించగా.. షమీ కంటే సిరాజ్ అంత తోపా అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 'షమీని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?, సిరాజ్ కూడా మంచి ఎంపిక', 'సిరాజ్ ఎంపిక అర్ధరహితం. కోవిడ్‌తో బాధపడుతున్న షమీకి నెగెటివ్ అని తేలింది. ఎందుకు అతడిని తిరిగి జట్టులోకి తీసుకోలేదు. షమీ అనర్హుడా. టీ20 ప్రపంచకప్ 2022ప్రణాళికల్లో అతడు లేడా' అని ఫాన్స్ బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు.
Also Read: AP TET Results 2022: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండి ఇలా...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook