Jacques Kallis: Legendary All-rounder Can't Coach National Team: ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ జాకస్ కలిస్ ఒకరు. అతడు క్రికెట్ ఆడినంత కాలం టాప్ 5 ఆల్ రౌండర్‌గా వెలుగొందాడు. అటు బ్యాటింగ్‌లోనూ పరుగుల వరద పారించాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రధాన కోచ్‌గా సేవలందించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


2015 నుంచి 2019 వరకు ఐదు సీజన్లపాటు కోల్‌కతా జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన జాకస్ కలిస్‌కు దక్షిణాఫ్రికా(South Africa) జాతీయ జట్టుకు సేవలు అందించే అవకాశం లేదట. జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాలని ప్రతి మాజీ ఆటగాడు ఉవ్విళ్లూరుతుంటాడు. కానీ తనకు ఆ అవకాశం ఇకనుంచి లేదని కలిస్ ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకు గల కారణాన్ని వెల్లడించాడు.


Also Read: Steve Smith నిజంగానే తప్పిదం చేశాడా.. తేల్చేసిన Full Video 



దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్, అసిస్టెంట్ కోచ్, బ్యాటింగ్ లేక బౌలింగ్ విభాగాలలో సలహాదారుడిగా పనిచేయడానికి తెల్లజాతీయులు అనర్హులు. ఈ నిబంధన కారణంగా జాతీయ జట్టుకు తాను ఎన్నటికీ కోచ్‌గా వ్యవహరించలేనని, తనకు ఆ అవకాశం లేదని జాకస్ కలిస్(Jacques Kallis) పేర్కొన్నాడు. దీంతో తాను ఇంగ్లాండ్ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుడిగా వెళ్లినట్లు తెలిపాడు.


Also Read: Saina Nehwal: స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, ప్రణయ్‌లకు కరోనా.. థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి ఔట్



జాతీయ జట్టుకు కేవలం నల్లజాతివారే సేవలు అందించడానికి అర్హులు. ఈ నిబంధన కారణంగా దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు తాను ఏ విధంగానూ సేవలు అందించలేకపోతున్నాని, అందుకు చాలా బాధగా ఉందన్నాడు. ఆధునిక కాలంలోనూ ఇలాంటి కీలక నిర్ణయాలు కొందరు వ్యక్తులకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటాయని అభిప్రాయపడ్డాడు. 


Also Read: India vs Australia 3rd Test Highlights: ఇండియా Vs ఆస్ట్రేలియా 3వ టెస్ట్ రికార్డులు 



అదే సమయంలో ఇంగ్లాండ్ లాంటి పటిష్ట జట్టుకు సేవలు అందించే అవకాశం లభించడంతో బ్యాటింగ్ సలహాదారుడిగా వెళ్లినట్లు తెలిపాడు జాకస్ కలిస్. అయితే శ్రీలంక పర్యటన తర్వాత ఇంగ్లాండ్(England)‌ జట్టుకు తన సేవలు ముగించుకుని దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్తాడు. తన 10 నెలల బాబు జాషువాను సమయం గడపాల్సి వస్తుందని వివరించాడు కలిస్.


Also Read:  Virat Kohli Blessed With A Baby Girl: తండ్రయిన విరాట్ కోహ్లీ.. పాపకు జన్మనిచ్చిన అనుష్క శర్మ  


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook