India vs Australia 3rd Test Highlights: ఇండియా Vs ఆస్ట్రేలియా 3వ టెస్ట్ రికార్డులు

India vs Australia 3rd Test Highlights: హనుమ విహారి ఇన్నింగ్స్.. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 163 బంతులు ఎదుర్కొన్న విహారి 23 పరుగులు చేసి నౌటౌట్‌గా నిలిచాడు. అయితే టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత నెమ్మదిగా సాగిన తొమ్మిదో ఇన్నింగ్స్ ఇది.

Last Updated : Jan 11, 2021, 06:24 PM IST
  • టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత నెమ్మదిగా సాగిన తొమ్మిదో ఇన్నింగ్స్
  • 163 బంతులు ఎదుర్కొన్న విహారి 23 పరుగులు చేసి నౌటౌట్‌
  • రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి భాగస్వామ్యం కేవలం 62 పరుగులు
India vs Australia 3rd Test Highlights: ఇండియా Vs ఆస్ట్రేలియా 3వ టెస్ట్ రికార్డులు

India vs Australia 3rd Test Highlights: హనుమ విహారి ఇన్నింగ్స్.. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 163 బంతులు ఎదుర్కొన్న విహారి 23 పరుగులు చేసి నౌటౌట్‌గా నిలిచాడు. అయితే టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత నెమ్మదిగా సాగిన తొమ్మిదో ఇన్నింగ్స్ ఇది. 2015లో ఢిల్లీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు హషీం ఆమ్లా 244 బంతులు ఆడి కేవలం 25 పరుగులు చేయడం గమనార్హం.

ఓ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్‌కు వికెట్లు పడకపోవడం ఇది రెండోసారి. 22 ఓవర్లు వేసిన స్టార్క్‌ భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. గతంలో చెన్నైలో 2013లో జరిగిన టెస్టులో స్కార్క్‌కు వికెట్ దక్కలేదు. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది.

Also Read: Ind VS Aus: అశ్విన్, విహారి హీరోచిత పోరాటం.. నైతిక విజయం టీమిండియాదే

టీమిండియా(Team India) ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి భాగస్వామ్యం కేవలం 62 పరుగులు కానీ, ఆ రన్స్ చేసేందుకు వారు ఏకంగా 256 బంతుల్ని ఎదుర్కొన్నారు. ఇంత తక్కువ రన్‌రేట్‌తో ఎక్కువ బంతుల్ని ఎవరూ ఎదుర్కోలేదు.

ఆస్ట్రేలియా గడ్డమీద డ్రా అయిన టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక ఓవర్లు ఆడిన జట్టుగా టీమిండియా నిలిచింది. నేడు డ్రా అయిన సిడ్నీ టెస్టులో భారత్ రికార్డు స్థాయిలో 131 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది.

Also Read: Steve Smith: టెస్టుల్లో తొలి క్రికెటర్‌గా స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత 

టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో సెంచరీ, మరో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ అత్యధిక పర్యాయాలు సాధించిన క్రికెటర్‌గా ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) నిలిచాడు. టెస్టుల్లో అతడు 10 పర్యాయాలు ఈ ఫీట్ నమోదు చేయగా, గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు జాకస్ కలిస్(9) పేరిట ఉన్నది.

 

భారత టపార్డర్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో 6000 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన 11వ భారత ఆటగాడుగా పుజారా నిలిచాడు.

ఆస్ట్రేలియా గడ్డమీద ఆ జట్టుపై నాలుగో ఇన్నింగ్స్ ఆడుతూ అత్యధిక ఓవర్లు ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌లలో మూడు పర్యాయాలు ప్రత్యర్థి భారత్ కావడం గమనార్హం. 131 ఓవర్లు, 89.5 ఓవర్లు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, 75 ఓవర్లు అడిలైడ్‌లో ఆడి డ్రా చేసుకుంది టీమిండియా. శ్రీలంక జట్టు 2004లో 85 ఓవర్లు ఆడి డ్రా చేసుకోవడం తెలిసిందే.

Also Read: India vs Australia: చటేశ్వర్ పుజారా అరుదైన ఘనత 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News