Steve Smith నిజంగానే తప్పిదం చేశాడా.. తేల్చేసిన Full Video

Did Steve Smith Remove Rishabh Pants Guard Marks: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తలెత్తిన బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఏం చేసినా తప్పులాగే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నో సిరీస్‌లలో స్టీవ్ స్మిత్‌ను చూసిన ప్రేక్షకులు స్టేడియంలోనే చీటర్ చీటర్ అంటూ అతడ్ని హేళన చేయడం తెలిసిందే.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 13, 2021, 09:00 PM IST
  • దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తలెత్తిన బాల్ ట్యాంపరింగ్ వివాదం
  • ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఏం చేసినా తప్పులాగే కనిపిస్తున్నాయి
  • భారత్‌తో జరిగిన మూడో టెస్టులో స్టీవ్ స్మిత్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు
Steve Smith నిజంగానే తప్పిదం చేశాడా.. తేల్చేసిన Full Video

Did Steve Smith Remove Rishabh Pants Guard Marks: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తలెత్తిన బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఏం చేసినా తప్పులాగే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నో సిరీస్‌లలో స్టీవ్ స్మిత్‌ను చూసిన ప్రేక్షకులు స్టేడియంలోనే చీటర్ చీటర్ అంటూ అతడ్ని హేళన చేయడం తెలిసిందే. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన మూడో టెస్టులో స్టీవ్ స్మిత్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. 

టీమిండియా యువ సంచలనం రిషభ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడి బ్యాటింగ్ గార్డ్ మార్క్‌ను వక్రబుద్ధితో చెరిపేశాడని విమర్శలు ఎదుర్కొంటున్నాడు స్టీవ్ స్మిత్. మూడో టెస్టు ముగియగానే కొందరు నెటిజన్లు స్టీవ్ స్మిత్‌కు సంబంధించిన వీడియో షేర్ చేశారు. అందులో రిషభ్ పంత్ గార్డ్ మార్క్‌ను స్టీవ్ స్మిత్(Steve Smith) చెరిపేస్తున్నట్లుగా కనిపించడంతో మరోసారి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

Also Read: India vs Australia 3rd Test Highlights: ఇండియా Vs ఆస్ట్రేలియా 3వ టెస్ట్ రికార్డులు

 

 

తాను తప్పుచేయలేదని మొత్తుకున్నా.. భారత(Team India) క్రికెట్ ప్రేమికులతో పాటు పలువురు తాజా, మాజీ క్రికెటర్లు సైతం స్టీవ్ స్మిత్ చర్యను తప్పుపట్టారు. వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించగా, దానిపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సైతం స్పందిస్తూ మద్దతు పలికాడు. అయితే స్టీవ్ స్మిత్ ఏం చూశాడో వీడియో మొత్తం చూసి మీరు ఓ అభిప్రాయానికి రావాలంటూ మరో కొత్త వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

Also Read: Virat Kohli Blessed With A Baby Girl: తండ్రయిన విరాట్ కోహ్లీ.. పాపకు జన్మనిచ్చిన అనుష్క శర్మ

డ్రింక్స్ విరామం సమయంలో మైదాన సిబ్బంది వచ్చి పిచ్‌ను శుభ్రం చేశారు. ఆ తర్వాత పెయింట్‌తో క్రీజు మార్క్ వేసి వెళ్లిపోయారు. అదే సమయంలో అక్కడ ఉన్న పంత్ గార్డ్ మార్క్ చెరిగిపోయింది. అనంతరం స్టీమ్ స్మిత్ కూడా అక్కడికి వెళ్లి గార్డ్ మార్క్‌ను గీకినట్లు కనిపించింది. దీంతో స్టీవ్ స్మిత్ ఉద్దేశపూర్వకంగా ఈ పనిచేయలేదని, అతడి తప్పిదం లేదని అర్థమవుతోంది.

Also Read: Saina Nehwal: స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, ప్రణయ్‌లకు కరోనా.. థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి ఔట్ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News