Bumrah T20 Record: టీమ్‌ఇండియా పేసర్ బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డు
Bumrah T20 Record: టీమ్ ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah Wickets Record) అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
Bumrah T20 Record: టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah Wickets Record).. మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు (Jasprit Bumrah Stats) నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) భాగంగా స్కాట్లాండ్ జరిగిన మ్యాచ్ లో 2 వికెట్లు తీసిన బుమ్రా.. టీ20 ఫార్మాట్ లో మొత్తంగా 64 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను (63 వికెట్లు) అధిగమించాడు బుమ్రా. ఈ జాబితాలో అశ్విన్ (55) మూడో స్థానంలో, భువనేశ్వర్ (50) నాలుగు, జడేజా (43) ఐదో స్థానంలో ఉన్నారు.
స్కాట్లాండ్ పై ఘన విజయం
ఇదిలా ఉంటే టీ20 ప్రపంచకప్ లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. అన్ని విభాగాల్లో రాణించిన భారత్.. స్కాట్లాండ్‌పై సునాయాస విజయం సాధించింది. దీంతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 85 పరుగులకే కుప్పకూలగా.. భారత్ రెండు వికెట్ల నష్టానికి 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. టీమ్‌ఇండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్ (50), రోహిత్ శర్మ (30) ధాటిగా ఆడారు. తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. అయితే విజయానికి ఇంకో పదహారు పరుగులు అవసరమైన సమయంలో రోహిత్‌ను స్కాట్లాండ్ బౌలర్ వీల్ వికెట్లు ముందు దొరకబుచ్చుకున్నాడు. నాలుగు పరుగులు చేయాల్సిన తరుణంలో కేఎల్ రాహుల్ భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (2*), సూర్యకుమార్ యాదవ్ (6*) మిగిలిన పనిని పూర్తి చేసేశారు. దీంతో పాయింట్ల పట్టికలో భారత్ (4 పాయింట్లు) మూడో స్థానానికి చేరుకుంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ను.. టీమ్‌ఇండియా బౌలర్ మహమ్మద్ షమీ (3/14), జడేజా (3/15) దెబ్బ తీశారు. భారత బౌలర్ల ధాటికి స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని స్కాట్లాండ్ నిర్దేశించింది. జార్జ్ మున్సీ (24), లీస్క్ (21) కాస్త ఫర్వాలేదనిపించినా.. మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. స్కాట్లాండ్ బ్యాటర్లలో ముగ్గురు డకౌట్‌గా వెనుదిరిగారు. రిచీ బెరింగ్‌టన్, షరిఫ్, ఈవన్స్ పరుగులేమీ చేయకుండా ఔట్ అయ్యారు. కెప్టెన్ కోట్జర్ (1), క్రాస్ (2), గ్రీవ్స్ (1) సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యారు. మెక్‌లాయిడ్ 16, వాట్ 24 పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ 3, జడేజా 3.. బుమ్రా 2, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు.
Also Read: T20 WC 2021 India vs Scotland: టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన...స్కాట్లాండ్‌పై భారత్ గెలుపు
Also Read: New Zealand Tour Of India: ఇండియాతో సిరీస్ కు జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook