Jasprit Bumrah: ఏ రా బుడ్డోడా.. నా బౌలింగ్‌లోనే సిక్స్ కొడతావా.. బుమ్రా దెబ్బకు ఆసీస్ యంగ్ ప్లేయర్ అబ్బా
India Vs Australia 4th Test Latest Updates: ఆసీస్ యంగ్ ఓపెనర్ కొన్స్టాప్పై బుమ్రా స్వీట్ రీవేంజ్ తీర్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో తన బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టిన ఈ బ్యాట్స్‌మెన్‌ను అద్బుతమైన బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. అనంతరం తనదైన స్టైల్‌లో సంబరాలు చేసుకుని.. పెవిలియన్‌కు దారి చూపించాడు.
India Vs Australia 4th Test Latest Updates: తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి పోరాటంతో ఆసీస్‌తో నాలుగో టెస్ట్ ఆసక్తికరంగా మారింది. భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించిన ఈ యంగ్ ప్లేయర్.. అద్భుత శతకంతో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ తొలి ఇన్సింగ్స్‌లో 369 పరుగులు చేయగలిగింది. నితీశ్ రెడ్డి వీరోచిత ఇన్నింగ్స్ లేకపోయి ఉంటే.. ఈపాటికే కంగారులు విజయం ముంగిట నిలిచేవారు. 358 పరుగులతో నాలుగో రోజు ఆట ఆరంభించిన భారత్.. మరో 11 రన్స్ జోడించి ఆలౌట్ అయింది. నితీశ్ కుమార్ రెడ్డి (114) చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. సిరాజ్(4) నాటౌట్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 105 పరుగుల ఆధిక్యం లభించింది. కంగారూ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లియోన్ తలో మూడు వికెట్లు తీశారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే బుమ్రా షాక్ ఇచ్చాడు. అరంగేట్ర ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టిన కొన్‌స్టాస్ (8)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌లో కొన్‌స్టాప్ రెండు సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఇన్నింగ్స్‌లో కొన్‌స్టాప్‌ను ఔట్ చేసిన వెంటనే బుమ్రా డిఫరెంట్‌గా సంబరాలు చేసుకున్నాడు. ప్రేక్షకులు అందరూ గట్టిగా అరవాలంటూ సైగ చేశాడు. కోహ్లీ ఔట్ అయిన కొన్‌స్టాప్ కూడా ఇలానే చేశాడు. అందుకే బుమ్రా కూడా తనదైన స్టైల్‌లో స్వీట్ రీవేంజ్ తీర్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌లో పలుమార్లు ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కొన్‌స్టాప్.. చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
ఇక సెంచరీతో దుమ్ములేపిన నితీశ్ కుమార్ రెడ్డిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. స్టార్ బ్యాట్స్‌మెన్ అంతా తడబడిన పిచ్‌పై ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ భారత్‌ను మ్యాచ్‌లో నిలబెట్టాడు. మరో ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్ గొప్ప సంయమనం పాటించాడు. ఎంతో ఓపిగ్గా ఆడుతూ.. ఒక్కో రన్ సాధించాడు. ఆసీస్ బౌలర్లను విసుగిస్తూ.. దుర్బేధ్యమైన డిఫెన్స్ ఆడాడు. 146 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. ఇందులో కేవలం ఒక బౌండరీ మాత్రమే ఉంది. నితీశ్-సుందర్ జోడి 47.1 ఓవర్లు వికెట్ కాపాడుకున్నారు. నాలుగో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు చెలరేగితే.. భారత్ రేసులో నిలుస్తుంది. ప్రస్తుతం ఆసీస్ రెండో ఇన్సింగ్స్‌లో 39 రన్స్ చేయగా.. క్రీజ్‌లో ఉస్మాన్ ఖవాజా (19), లబుషేన్ (19) ఉన్నారు. మొత్తం 144 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Also Read: Financial Planning: ఎందుకు గురు టెన్షన్.. ఇలా బడ్జెట్ ప్లాన్‌తో ఎంచక్కా డబ్బులు సేవింగ్ చేసుకోండి
Also Read: Heavy Snowfall: మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీరం..ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తోన్న పర్యాటకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.