Jofra Archer Ruled Out Of ODI Series Against India; టీమిండియాతో త్వరలో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో పర్యాటక ఇంగ్లాండ్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా స్వదేశం ఇంగ్లాండ్ బాట పట్టాడు. ఫిజియో, కోచ్‌లకు గాయం గురించి చెప్పడంతో అతడికి వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జోఫ్రా ఆర్చర్ లాంటి కీలక పేసర్ లేకపోవడంతో వన్డే సిరీస్‌‌‌లో విరాట్ కోహ్లీ సేనకు కలిసిరానుంది. ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో మార్క్ వుడ్‌తో కలిసి పవర్ ప్లేలలో టీమిండియా(Team India)కు కళ్లెం వేశాడు జోఫ్రా ఆర్చర్. అయితే చివరి టీ20లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించడం తెలిసిందే. జోఫ్రా ఆర్చర్ గాయం గురించి ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ఆందోళన చెందుతోంది.


Also Read: 7th Pay Commission: హోలీకి ముందే స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ


వన్డే సిరీస్ ముగియడానికి, ఐపీఎల్ 2021(IPL 2021) ప్రారంభానికి కొంత వ్యవధి మాత్రమే ఉంది. ఏప్రిల్ 9 నుంచి టీ20 మెగా టోర్నీ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ లాంటి కీలక ఆటగాడి సేవలు కోల్పోతే రాజస్థాన్ రాయల్స్‌కు ఇబ్బంది అవుతుంది. ఇతర పేసర్లు, స్పిన్నర్లతో కలిసి ఐపీఎల్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగల సామర్థ్యం ఉన్న బౌలర్ ఆర్చర్.


Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధర, Silver Price


గత సీజన్‌లో పవర్ ప్లేలో, చివరి డెత్ ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ ప్రత్యర్థి జట్లను కట్టడి చేయడానికి కారణం జోఫ్రా ఆర్చర్ మెరుగైన బౌలింగ్. కాగా, ఐపీఎల్ 2021 తొలి నెలరోజులపాటు ఆర్చర్ సేవలు అందుబాటులో ఉండటం కష్టమేనని అతడి ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. లీగ్ దశలో రెండో దఫా మ్యాచ్‌లలో జోఫ్రా ఆర్చర్ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


Also Read: Asghar Afghan T20I Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలుకొట్టిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అస్ఘర్ అఫ్గాన్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook