Kane Williamson Injury: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (Kane Williamson News) రానున్న రెండు నెలల కాలం పాటు క్రికెట్ కు దూరం కానున్నాడు. మోచేయి గాయం కారణంగా కనీసం 2 నెలలు క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గాయం కారణంగా ముంబయి వేదికగా టీమ్ఇండియాతో జరిగిన రెండో టెస్టులోనూ (IND vs NZ 2nd Test 2021) కేన్ విలియమ్సన్ అందుబాటులో లేడు. మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్ ఆడే అవకాశం ఉందని న్యూజిలాండ్ క్రికెట్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపారు.


"ప్రస్తుతం కేన్‌ బాగానే ఉన్నాడు. శస్త్ర చికిత్స లేకుండానే విలియమ్సన్ కోలుకుంటాడని ఆశిస్తున్నా. రీహాబిటేషన్ తర్వాత అతడికి శస్త్ర చికిత్స అవసరమా లేదా అనేది తేలుతుంది. అయితే కోలుకోవడానికి కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది వారాలు పట్టొచ్చు" అని కోచ్ గ్యారీ స్టెడ్‌ చెప్పారు.


యూఏఈ వేదికగా ఇటీవలే జరిగిన ఐపీఎల్-2021 రెండో దశ చివర్లో కేన్ విలియమ్సన్ మోచేతికి గాయమైంది. గాయం కారణంగా వాంఖడే వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్టులో కేన్‌ విలియమ్సన్ దూరంగా ఉన్నాడు.


అలాగే త్వరలో బంగ్లాదేశ్​తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్​తో పాటు ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్​కు అతడు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఫిబ్రవరి 17న స్వదేశంలో జరగబోయే దక్షిణాఫ్రికా సిరీస్ వరకు కేన్ (Kane Williamson News)​ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.


ALso Read: SA vs IND: టెస్ట్ జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. కెప్టెన్‌గా ఎల్గర్! మూడేళ్ల తర్వాత జట్టులోకి ఓలివియర్!!


Also Read: IND vs SA: కోహ్లీ ఆలోచనా విధానాన్ని అంచనా వేయడం కష్టం.. అశ్విన్‌ను తీసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు!!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook