ముంబై: విరాట్ కోహ్లీకి న్యూజిలాండ్ పర్యటన మరపురానిదని భారత మాజీ దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. కోహ్లీ మూడు ఫార్మాట్లలో విఫలమయ్యాడని, కాగా 11 ఇన్నింగ్స్‌లలో కేవలం ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేయడం, గత టెస్ట్ సిరీస్‌లో పరుగులు చేయలేకలేకపోవడం జట్టు పతనానికి గల ప్రధాన కారణం అని ఆయన పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరాట్ కోహ్లీలో ఇంతకుముందున్న ఫిట్ నెస్ కనబడటం లేదని, స్ట్రెయిట్ డెలివరీలకు బిన్నంగా ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. టెస్టు క్రికెట్ గణాంకాలే బాట్స్ మెన్ పరిణతిని తెలియజేస్తాయని ఆయన అన్నారు.  


ముప్పై సంత్సరాలు దాటినా తరవాత కంటి చూపు మందగిస్తుందని, ఈ సమయంలో  మరింత ఏకాగ్రతగా పని చేయవల్సిన అవసరముందని అన్నారు. కాగా, న్యూజిలాండ్ పర్యటనపై కెప్టెన్ కోహ్లీ స్పందిస్తూ నిరంతర పర్యటనల దృష్ట్యా విశ్రాంతి సమయం దొరకడంలేదన్నారు. కాగా దీనిపై కపిల్ దేవ్ స్పందిస్తూ ఒక వేళ విశ్రాంతి సమయమే కావాలనుకుంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుండి తప్పుకొని తీసుకోవాలని చురకలంటించారు.  


మరోవైపు కపిల్ దేవ్ మాట్లాడుతూ.. త్వరలో ఐపీఎల్ రానున్న నేపథ్యంలో కోహ్లీ తన ఆటను తిరిగి ట్రాక్ లోకి తీసుకురావడానికి దృష్టి పెట్టాలని అన్నారు. దీనికి గాను ఐపీఎల్ ఎంతగానో సహాయపడుతుందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. కాగా కోహ్లీకి త్వరగా పుంజుకునే శక్తి సామర్ద్యాలున్నాయని ఆయన పేర్కొన్నారు.  


గతంలో సెహ్వాగ్, ద్రవిడ్, వివ్ రిచర్డ్స్, లాటి దిగ్గజ ఆటగాళ్లు వారి కెరీర్‌లో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నవారేనని, కాబట్టి కోహ్లీ ఇటువంటి ఇబ్బందులను అధిగమించాలంటే మరింత ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..