ప్రపంచ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు పంపడానికి జరిగిన దేశీయ పోటీల ఎంపికలో జమ్మూ, కాశ్మీర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు సెలక్టయ్యారు. రబియా రియాజ్, అబ్రూ బషీర్ అనే పేరుగల ఈ బాలికలు త్వరంలో అర్జెంటీనాలో జరిగే పోటీలలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ ఇద్దరు బాలికలు కూడా జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే పోటీల్లో జమ్మూ, కాశ్మీర్ టీమ్ మొత్తం 14 పతకాలు సాధించడం విశేషం. మూడు స్వర్ణ పతకాలు, నాలుగు రజత పతకాలతో పాటు ఆరు కాంస్య పతకాలను పొందిన తర్వాత అదే జట్టు, తమ ఆటగాళ్ళను ప్రపంచ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు కూడా పంపించడానికి సన్నాహాలు చేస్తోంది. 2018 నవంబరు నెలలో ప్రపంచ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు అర్జెంటీనాలో జరగనున్నాయి.