యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) ఘనంగా ప్రారంభం కానుంది. ఆటగాళ్లు ఒక్కొక్కరుగా దుబాయ్ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కొత్త క్రికెటర్ అలీ ఖాన్ తన ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుతో ఆదివారం జత కలిశాడు. అయితే ఈ ఐపీఎల్‌లో అలీ ఖాన్ (Cricketer Ali Khan) ఓ ప్రత్యేకమైన ఆటగాడు కానున్నాడు. US Open 2020 Winner: యూఎస్ ఓపెన్ 2020 విజేతగా డొమినిక్ థీమ్.. 71 ఏళ్ల తర్వాత సంచలనం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్‌లో ఆడుతున్న తొలి అమెరికా క్రికెటర్ అలీ ఖాన్ (US Cricketer Ali Khan) నిలవనున్నాడు. ఈ విషయాన్ని కేకేఆర్ తమ ట్విట్టర్‌లో వెల్లడించింది. కేకేఆర్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ సైతం అలీ ఖాన్‌కు స్వాగతం పలికాడు. ‘వెల్‌కమ్ అలీ ఖాన్.. ట్రింబాగో నైడ్ రైడర్స్ తరఫున టైటిల్స్ సాధించావు. కేకేఆర్ జట్టులో చోటుకు నువ్వు అర్హుడివేనంటూ’ మెకల్లమ్ ట్వీట్ చేశాడు. Surya Kiran Eliminated: బిగ్ బాస్ 4 తొలి ఎలిమినేషన్ ముందే ఊహించారు! 



కాగా, ఈ సెప్టెంబర్ 10న కరీబియన్ ప్రీమియర్ లీగ్ టీ20 ట్రోఫీ నెగ్గిన జట్టు సభ్యుడు అలీ ఖాన్. అదే ఉత్సాహంతో ఐపీఎల్‌లో ఆడేందుకు యూఏఈకి వచ్చాడు. దినేష్ కార్తీక్ సారథ్యంలోని కేకేఆర్.. సెప్టెంబర్ 23న అబుదాబి వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. Sreesanth Ban Ends: శ్రీశాంత్‌పై ముగిసిన నిషేధం.. ఐపీఎల్ ఛాన్స్ వస్తుందా? 



ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR