ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీలో భాగంగా బుధవారం అబుధాబిలో జరిగిన 21వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్‌ ( KKR beats CSK ) 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders  ) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కేకేఆర్ నిర్దేశించిన 168 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులే చేసింది. దీంతో కోల్‌కతా జట్టు చేతిలో చెన్నైకి 10 పరుగుల తేడాతో ఓటమితప్పలేదు. Also read : Prithvi Raj Yarra: సన్‌రైజర్స్ టీమ్‌లోకి పృథ్వీరాజ్.. ఎవరీ తెలుగు తేజం ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోల్‌కతా బ్యాట్స్‌మెన్లలో రాహుల్ త్రిపాఠి ( Rahul Tripathi ) చెలరేగిపోయాడు. 51 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81 పరుగులు చేసి జట్టు స్కోర్ పెరగడంలోనే కాకుండా జట్టు విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఇక మిగిలిన బ్యాట్స్‌మెన్లలో సునీల్ నరైన్, ప్యాట్ కమ్మిన్స్ మాత్రమే చెరో 17 పరుగుల చొప్పున రాబట్టారు. మిగతా వాళ్లంతా ఆలోపే ఔటయ్యారు. చెన్నై బౌలర్లలో బ్రావో 3 వికెట్లు తీయగా, శామ్ కుర్రాన్‌, శార్దూల్ ఠాకూర్‌, శర్మ చెరో 2 వికెట్లు తీశారు. Also read : Steve Smith: రాజస్థాన్ రాయల్స్‌ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు భారీ షాక్! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe