KKR vs RCB match highlights: బెంగళూరును ఓడించిన కోల్‌కతా.. కోహ్లీ సేన నడ్డి విరిచిన Sunil Narine
KKR vs RCB match highlights, DC vs KKR updates: నాలుగు ఓవర్లలో కేవలం 21 పరుగులే ఇచ్చి 4 కీలకమైన వికెట్లు తీయడమే కాకుండా, 15 బంతుల్లో 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి బ్యాట్‌తోనూ రెచ్చిపోయిన సునీల్ నరైన్ (Sunil Narine) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కైవసం చేసుకున్నాడు.
KKR vs RCB match highlights, DC vs KKR updates: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆశలు మళ్లీ అడియాసలే అయ్యాయి. గెలిచి తీరాల్సిన కీలకమైన పోరులో విరాట్ కోహ్లీ సేన విఫలమై ఫైనల్‌కి చేరే అవకాశాలను చేతులారా చేజార్చుకుంది. ఇకపై బెంగళూరు జట్టు కెప్టేన్‌గా ఉండబోనని ప్రకటించిన విరాట్ కోహ్లీ.. జట్టు రథసారథిగా తన చివరి సీజన్ అయిన ఐపిఎల్ 2021 (IPL 2021) ట్రోఫీ కొట్టాలని భావించాడు. కానీ కోహ్లీ విజయానికి కోల్‌కతా నైట్ రైడర్స్ బ్రేకులేసింది. సమిష్టి కృషితో ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చిన కోల్‌కతా నైట్ రైడర్స్ తమ ప్రత్యర్థి బెంగళూరు జట్టుపై విజయం సాధించింది. దీంతో క్వాలిఫయర్ -2లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR vs Delhi qualifier 2 match) అర్హత సాధించినట్టయింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 138 పరుగులకే సరిపెట్టుకుంది. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ వరుసగా విరాట్ కోహ్లీ (Virat Kohli 39), శ్రీకర్ భరత్ (9), మ్యాక్స్‌వెల్ (15), డివిలియర్స్ (11) వంటి కీలకమైన ఆటగాళ్ల వికెట్లు తీసుకుంటూ కోహ్లీ సేన నడ్డి విరిచాడు. దేవదత్ పడిక్కల్ సైతం 21 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో అతి తక్కువ స్కోర్‌కే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టు చాప చుట్టేయాల్సి వచ్చింది.
Also read : ICC Player Of Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నేపాల్ క్రికెటర్
అనంతరం స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR vs RCB match) జట్టు ఆఖరి వరకు సస్పెన్స్‌కి గురిచేసి.. చివరి ఓవర్‌లో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు నష్టపోయి విజయం సొంతం చేసుకుంది. కోల్‌కతా జట్టులో శుభమన్ గిల్ 29, వెంకటేష్ అయ్యర్ 26, నితీశ్ రాణా 23, సునీల్ నరైన్ 26 పరుగులతో రాణించారు.
నాలుగు ఓవర్లలో కేవలం 21 పరుగులే ఇచ్చి 4 కీలకమైన వికెట్లు తీయడమే కాకుండా, 15 బంతుల్లో 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి బ్యాట్‌తోనూ రెచ్చిపోయిన సునీల్ నరైన్ (Sunil Narine) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కైవసం చేసుకున్నాడు. మొత్తానికి క్వాలిఫయర్ 2 మ్యాచ్‌కి అర్హత సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు (Kolkata Knight Riders live updates) ఊపిరి పీల్చుకుంది.
Also read : T20 World Cup 2021: టీ20 వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ...విజేతలకు ఎంతంటే..
Also read : Piyush Chawla: పీయుష్ చావ్లా సరికొత్త రికార్డు..టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఘనత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook