KKR vs SRH match: మళ్లీ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్
KKR vs SRH match updates: ఐపిఎల్ 2020లో భాగంగా 8వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ( Sunrisers Hyderabad ) కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ( Kolkata Knight Riders ) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) 70 పరుగులు, అయాన్ మోర్గాన్ ( Eoin Morgan ) (42) పరుగులతో రెచ్చిపోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ పెద్దగా కష్టపడకుండా సునాయసంగానే లక్ష్యాన్ని ఛేదించి ప్రస్తుత ఐపిఎల్ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.
KKR vs SRH match updates: ఐపిఎల్ 2020లో భాగంగా 8వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ( Sunrisers Hyderabad ) కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ( Kolkata Knight Riders ) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్ శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) 70 పరుగులు, అయాన్ మోర్గాన్ ( Eoin Morgan ) (42) పరుగులతో రెచ్చిపోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ పెద్దగా కష్టపడకుండా సునాయసంగానే లక్ష్యాన్ని ఛేదించి ప్రస్తుత ఐపిఎల్ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టేన్ డేవిడ్ వార్నర్ ( David Warner ) ముందుగా బ్యాటింగ్ చేయడానికే ఎంచుకున్నాడు. Also read : KKR vs SRH match:సన్‌రైజర్స్ vs కోల్‌కతా నైట్‌రైడర్స్.. ఎవరి బలం ఎంత ? ఎవరు వీక్ ?
ఐతే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ని ఎక్కువ స్కోర్ చేయకుండా కట్టడి చేయడంలో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు సక్సెస్ అయ్యారు. ఫలితంగా సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కేవలం 142 పరుగులే చేయగలిగింది. సన్ రైజర్స్ ఆటగాళ్లలో మనీష్ పాండే ( Manish Pandey ) 38 బంతుల్లో 51 పరుగులు రాబట్టగా, డేవిడ్ వార్నర్ (36), వృద్ధిమాన్ సాహా ( 30) మినహా మిగతా వాళ్లు ఎవరూ రాణించలేదు.
అతి స్వల్ప స్కోర్ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ 3 వికెట్ల నష్టానికే మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే 145 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ( Royal Challengers Banglore ) చేతిలో తొలి మ్యాచ్‌లో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్‌కి రెండో మ్యాచ్‌లోనూ ఓటమి తప్పలేదు. Also read : MS Dhoni, CSK vs DC match: చెన్నై బ్యాట్స్‌మెన్, బౌలర్లపై కన్నెర్ర చేసిన ధోనీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe