KKR vs SRH match Highlights, IPL 2021 live updates: సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ప్లేఆఫ్స్ రేసులో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తమ ఆశలు సజీవం చేసుకోగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచుల్లో 10 మ్యాచ్‌లు ఓడిపోయి పాయింట్స్ పట్టికలో అట్టడుగున నిలిచింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ప్లే ఆఫ్స్‌లో తమ స్థానం పదిలం చేసుకున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు 115 పరుగులకే పరిమితం చేశారు. కోల్‌కతా బౌలర్లను ఎదుర్కోవడంతో తడబడిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (26) (Kane Williamson), ప్రియమ్ గార్గ్ (21), అబ్దుల్ సమద్ (25) కొంతయినా రాణించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఆమాత్రం గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో టిమ్ సౌథీ, శివమ్ మావీ, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు పడగొట్టగా, షకీబ్‌ ఒక వికెట్ తీశాడు. 


Also read : RR vs CSK: చెన్నైపై 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం..యశస్వీ, దూబే విధ్వంసం..రుతురాజ్‌ సెంచరీ వృథా!


116 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) తొలుత తడబడినప్పటికీ.. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (57),  నితీశ్ రాణా (25), దినేశ్ కార్తీక్ (18) రాణించడంతో విజయం కోల్‌కతా సొంతమైంది. 


హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్‌కు రెండు, రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్‌కు చెరో వికెట్ దక్కాయి. హాఫ్ సెంచరీతో రాణించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌కు (Shubman Gill) 'ప్లేయర్ ది ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.


Also read : RR Vs RCB: ముస్తాఫిజుర్ రెహ్మాన్ సూపర్ ఫీల్డింగ్...వైరల్ అవుతున్న వీడియో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook