KL Rahul First Child: ప్రస్తుత సీనియర్‌ ఆటగాళ్లలో ఒకడైన కేఎల్‌ రాహుల్‌ గతేడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి కోసం కొన్ని రోజులు క్రికెట్‌కు దూరంగా ఉన్న ఈ కర్ణాటక ఆటగాడు ఐపీఎల్‌ ముగిశాక కొన్నాళ్లు మళ్లీ క్రికెట్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతడు త్వరలో తండ్రి కాబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కేఎల్‌ రాహుల్‌ తండ్రిగా పదోన్నతి పొందనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు కేఎల్‌ రాహుల్‌ మామ, సినీ నటుడు సునీల్‌ శెట్టి చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: RCB vs KKR Live Score: విరాట్‌ కోహ్లీ శ్రమ వృథా.. కేకేఆర్‌ చేతిలో బెంగళూరు బోల్తా


బాలీవుడ్‌ నటుడైన సునీల్‌ శెట్టి ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ పరోక్షంగా రాహుల్‌ విషయాన్ని ప్రస్తావించారు. 'డ్యాన్స్‌ దివానే' అనే టీవీ షోలో సునీల్‌ శెట్టి ఇటీవల పాల్గొన్నారు. హోస్ట్‌ భారతీ సింగ్‌ శెట్టి 'మీరు తాత అయితే ఎలా ప్రవర్తిస్తారు' అని సునీల్‌ శెట్టిని ప్రశ్నించారు. దీనికి ఆసక్తికర సమాధానం చెబుతూనే కొన్ని హావభావాలు, సంజ్ఞలు చేశారు. 'అవును. వచ్చే సీజన్‌లో నేను తాతలాగా వేదికపై నడుస్తా' అని కీలక వ్యాఖ్య చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్య ఆసక్తకరంగా మారింది. ఆ వ్యాఖ్యలను పరిశీలిస్తే వచ్చే ఏడాది సునీల్‌ శెట్టి తాత కాబోతున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన తన అల్లుడు, క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ తండ్రి కాబోతున్నాడు అని భావించవచ్చు.

Also Read: RR vs DC Live: పరాగ్‌ విధ్వంసంతో రాజస్థాన్ అ'ద్వితీయ' విజయం.. ఢిల్లీకి తప్పని నిరాశ


బాలీవుడ్‌ నటుడైన సునీల్‌ శెట్టి కుమార్తె ఆతియా శెట్టి. కుమార్తె కూడా బాలీవుడ్‌లో సినిమాలు చేసింది. హీరోయిన్‌ అతియాతో కేఎల్‌ రాహుల్‌ కొన్నేళ్లు ప్రేమ వ్యవహారం నడిపించాడు. అనంతరం ఖండాలా మాన్షన్‌లో 23 జనవరి 2023న అతియా, రాహుల్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సునీల్‌ శెట్టి దగ్గరుండి పెళ్లి పనులు చూసుకున్నారు. 'డ్యాన్స్‌ దివానే'లో చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే తన కుమార్తె ప్రస్తుతం గర్భం దాల్చిందని చెప్పవచ్చు. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనిస్తుందనే ఉద్దేశంతో 'వచ్చే ఏడాది నేను తాతగా వస్తాను' అని సునీల్‌ శెట్టి చేశాడు.





సునీల్‌ చేసిన ప్రకటనతో కేఎల్‌ రాహుల్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. తమ అభిమాన ఆటగాడు తండ్రి కాబోతున్నాడని సంబరపడుతున్నారు. బుల్లి రాహుల్ వస్తాడని వారు భావిస్తున్నారు. కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ)కు సారథ్యం వహిస్తున్న రాహుల్‌ ధీటుగా ఆడుతున్నాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి మరోటి ఓడింది. టీ20 ప్రపంచకప్‌లో కూడా భారత జట్టుకు రాహుల్‌ ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook