KL Rahul Vice Captain: సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్ కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. అయితే గాయం కారణంగా ఈ సిరీస్ కు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాగా.. అతడి స్థానంలో యువ బ్యాటర్ కేఎల్ రాహుల్ ను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI News) ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సొంతగడ్డపై న్యూజిలాండ్​తో సిరీస్​ అనంతరం అజింక్య రహానెను టెస్టు జట్టు వైస్​ కెప్టెన్​గా తొలగించింది బీసీసీఐ. టెస్టు జట్టుకు వైస్​ కెప్టెన్​గా, వన్డే జట్టుకు కెప్టెన్​గా రోహిత్​ శర్మను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. హిట్​మ్యాన్​ టెస్టు సిరీస్​కు దూరమైన కారణంగా రాహుల్​ వైస్​ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. 


మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​కు రోహిత్ దూరమవుతున్నట్లు ప్రకటించిన బీసీసీఐ.. అతడి స్థానంలో ప్రియాంక్ పంచాల్​కు చోటు కల్పించింది. ప్రస్తుతం హిట్​మ్యాన్​ ఎన్​సీఏలో ఉండి ఫిట్​నెస్​పై దృష్టి పెట్టాడు. సఫారీలతో తొలి టెస్టు డిసెంబర్​ 26న ప్రారంభం కానుంది. ఈమేరకు భారత జట్టు రెండు రోజుల క్రితమే దక్షిణాఫ్రికాకు చేరుకుంది.  


Also Read: Gautam Gambhir: మళ్లీ ఐపీఎల్​లోకి గౌతమ్​ గంభీర్​- కొత్త టీమ్​కు మెంటార్​గా..


Also Read: Glenn Maxwell: భారత అల్లుడు కాబోతున్న మాక్స్‌వెల్-పెళ్లిపై గర్ల్‌ఫ్రెండ్‌ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook