టీమిండియా - ఇంగ్లాండ్ (Indida- England Tour) పర్యటనలో ఉన్న సంగంతి తెలిసిందే... 5  టెస్టుల్ సిరీస్‌లో భాగంగా ఇప్పటికే 2 మ్యాచ్ లు పుర్తవగా ఈ రోజు 3వ టెస్ట్ ప్రారంభమైంది. గడచిన రెండు టెస్టుల్లో వర్షం కారణంగా ఒకటి డ్రా అవ్వగా, మరో మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిదిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ  సందర్భంగా ఒక సంచలన విజయం బయటకి వచ్చింది. ఆటిట్యూడ్ తో, దూకుడు స్వభావం ఉన్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ (Captain Kohli) మరియు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌‌ల (Captain joe root) మధ్య తీవ్ర ఘర్షణ జరిగినట్లు సమాచారం. రెండో మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన అనంతరం.. ఇరు జట్లు ఒకదగ్గరకి చేరి తిట్టుకున్నట్టు సమాచారం. వివరాలు పూర్తిగా తెలియనప్పటికీ, ఇపుడు ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనం శృష్టిస్తుంది. 


Also Read: ఈ కోతి మన కన్నా స్మార్ట్: మాస్క్ ధరించి మరీ రోడ్లపై సంచారం.. వీడియో వైరల్!


మొదట గొడవ లార్డ్స్‌ టెస్టు (Lords Stadium)మూడో రోజు నుంచి షురువైందని సమచారం. ఈ మ్యాచ్ లో జో రూట్‌ (Joe Root) 180 పరుగులు సాధించగా.. చివరగా వచ్చిన జేమ్స్ అండర్సన్‌కు (James Anderson) టీమిండియా బౌలర్ బుమ్రా (Bowler Jasprit Bumrah) షార్ట్‌పిచ్‌ బాల్స్ (Shotpitch Ball) తో ఇబ్బంది పడటమే కాకుండా కొన్ని బంతులు శరీరానికి తగిలాయి. చివరగా ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ అవ్వగానే జేమ్స్ అండర్సన్‌ భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై బూతులు తిడుతూ, చెలరేగాడు. దీని కారణంగా ఇరు జట్ల మధ్య గొడవ చెలరేగిందని సమాచారం. టీమిండియా (Team India), ఇంగ్లాండ్ (England) రెండు జట్లు గుంపులుగా లాంగ్ రూమ్ లో తిట్టుకున్నారని,  డైలీ టెలిగ్రాఫ్‌లో (Daily Telegraph)ఓ కథనం ప్రచురించారు. ఈ సమయంలోనే ఇరు జట్ల నాయకులు మాటల దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. 


Also Read: ఒకప్పుడు దేశానికి ఐటీ మంత్రి...ఇప్పుడు పిజ్జా డెలివరీ బాయ్..ఎవరనుకుంటున్నారా?


మ్యాచ్ చూడటానికి వచ్చే మాజీ క్రికెటర్లకు లార్డ్స్‌ లాంగ్‌రూమ్‌ను (Lords Longroom) కేటాయిస్తారు.. కాగా  లాంగ్‌రూమ్‌ ప్రత్యేకమైనదిగా, పవిత్రమైనదిగా భావించే క్రికెటర్లు కరోనా నిబంధనల కారణంగా ఈ రూమ్ లోకి అనుమతి నిషేధించబడింది. ఇలాంటి లాంగ్‌రూమ్‌లో రెండు జట్ల ఆటగాళ్లు తిట్టుకోవడం చర్చనీయాంశమయింది. రాత్రి భోజన సమయంలో ఈ గొడవ జరిగిందని సంచారం.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook