ఈ కోతి మన కన్నా స్మార్ట్: మాస్క్ ధరించి మరీ రోడ్లపై సంచారం.. వీడియో వైరల్!

కోతి మాస్క్ ధరించి రోడ్ల పై తిరుగుతుంది. మనుషుల కన్నా ఈ కోతి తెలివైనది అంటున్న నెటిజన్లు.. ఆ వీడియో ఏంటో మీరే చూడండి

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2021, 04:20 PM IST
  • మనుషులకు పాఠాలు నేర్పుతున్న కోతి
  • మాస్క్ ధరించి రోడ్లపై సంచారం
  • "లెజెండ్ ఎనిమల్" అని పిలుస్తున్న నెటిజన్లు
ఈ కోతి మన కన్నా స్మార్ట్: మాస్క్ ధరించి మరీ రోడ్లపై సంచారం.. వీడియో వైరల్!

కరోనా కోరల్లో సాధరణ జీవితం గడపటానికి ప్రపంచం పోరాడుతుంది. మాస్క్ చరించటం, సానిటైజర్ల వాడకం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. చివరకి జంతువులు కూడా మాస్క్ ధరించటం ప్రారంభించాయి.. జంతువులు మాస్క్ ధరించటం ఏంటి అనుకుంటున్నారా...?? అయితే పదండి అదేంటో చూద్దాం!

రెక్స్ చాప్‌మన్ అనే యువకుడు ఇంటర్నెట్‌లో అప్ లోడ్ చేసిన ఒక వీడియో దీనికి మంచి ఉదాహరణగా చెప్పాలి. 27 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో (Viral Video) ఒక కోతి మాస్క్ ధరించి రోడ్లపై నడిచి అందరిని ఆశ్చర్యపరచింది. దీనిలో కోతి మాస్క్ ధరించటం.. ముందుకు నడవటం.. మళ్లీ మాస్క్ కింద పడటం.. వెంటనే అలర్ట్ అయి, మళ్లీ మోహం నిండా మాస్క్ కప్పుకొని వెళ్ళటం.... కాసేపు నవ్వు తెప్పించిన... మనలో కొంత మంది చేస్తున్న తప్పు గురించి ఎత్తి చూపిందనే చెప్పాలి. 

Also Read: Corona update: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు... 600లకు పైగా మరణాలు

ఈ ఒక్క వీడియోనే కాదు చాలా జంతువులు అవి చేసే పనుల నుండి మానవాళి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వీడియో తీసిన వ్యక్తి మాత్రం ఈ కోతిని "లెజెండ్"  (Legend) అని పిలుస్తూ హృదయపూర్వకంగా నవ్వటం మనం గమనించవచ్చు. 

వీడియో అప్ లోడ్ చేసిన కాసేపట్లోనే వైరల్ అవ్వటం వేలల్లో కామెంట్,లు ఎమోజీలు పోస్ట్ చేయటంతో వైరల్ అయింది. కొంత మంది మాత్రం " మనుషుల కన్నా ఈ కోతికి మాస్క్ ఎలా ధరించాలో బాగా తెలుసు" అని కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: AP Corona Update: ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా వైరస్ సంక్రమణ

జంతువులకు మాస్క్ ఎలా ధరించాలో తెలియక పోయిన మాస్క్ ధరించాలనే ఆలోచన వాటిలో రావటం, మనలో కొంత మంది మాస్క్ ధరించకుండా బయట తిరిగే వాళ్లు ఇలాంటి జంతువులను చూసి నేర్చుకోవాలి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News