KKR buy Aaron Finch in Alex Hales place for IPL 2022: ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌కు బంపర్ ఆఫర్ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2022లో ఫించ్‌ రీఎంట్రీ ఇచ్చాడు. అతడిని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) కొనుగోలు చేసింది. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ స్థానంలో ఆసీస్ సారథి కేకేఆర్ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లలో ఆరోన్‌ ఫించ్‌ ఒకడు అన్న విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు అలెక్స్‌ హేల్స్‌ ఐపీఎల్ 2022 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీర్ఘకాలం బయోబుల్‌లో ఉండాల్సి రావడంతో కుటుంబంతో సమయం వెచ్చించేందుకు ఐపీఎల్ 15వ సీజన్ ఆడడం లేదని కేకేఆర్ యాజమాన్యంకు తెలిపాడు. దీంతో అతడి స్థానంలో ఆరోన్ ఫించ్‌ను కొనుగోలు చేసినట్లు కోల్‌కతా ప్రాంచైజీ తాజాగా వెల్లడించింది. ఫించ్‌ను కనీస ధర రూ.1.5 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది.


ఐపీఎల్‌ 2020లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడిన ఆరోన్‌ ఫించ్‌.. మొత్తం 12 మ్యాచ్‌ల్లో 268 పరుగులు మాత్రమే చేశాడు. ఇక టీ20 ప్రపంచకప్‌ 2021లో ఆస్ట్రేలియాకు తొలి పొట్టి కప్పును అందించాడు. అయినా ఫించ్‌ను కొనుగోలు చేసేందుకు 2022 వేలంలో జఏ ప్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దీంతో ఐపీఎల్‌లో అతడు మళ్లీ కనపడే అవకాశాలు లేవనుకున్నారు అందరూ. అయితే అతడికి అనూహ్యంగా కోల్‌కతా జట్టులో చోటు దక్కింది.



ఐపీఎల్ టోర్నీలో ఆరోన్‌ ఫించ్‌ తొమ్మిదవ ప్రాంచైజీజ్ తరఫున ఆడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్, పూణే వారియర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు ఆడాడు. ఫించ్‌ ఐపీఎల్‌లో మొత్తం 87 మ్యాచ్‌లు ఆడాడు. 14 హాఫ్ సెంచరీలతో 2005 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 88 నాటౌట్. ఇక ఈనెల 26 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 15వ సీజన్‌లో కోల్‌కతా తొలి మ్యాచ్‌లో చెన్నైని ఢీ కొట్టనుంది. 


Also Read: Pig Heart Surgery: పంది గుండెను మనిషికి అమర్చిన అమెరికా వైద్యులు.. ఆపరేషన్ తర్వాత పేషెంట్ మృతి!


Also Read: PF Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు ఊహించని షాక్.. వడ్డీ రేట్లను తగ్గించిన ఈపీఎఫ్ఓ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook