IPL 2024 Champion KKR: ఐపీఎల్ చాంపియన్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్.. రన్నరప్‌గా సన్‌రైజర్స్
IPL 2024 Champion Kolkata Knight Riders Runnerup Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ట్రోఫీని కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ముద్దాడింది. అన్నింట్లో ఘోర వైఫల్యం చెందిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్నరప్‌గా నిలిచింది.
IPL Champion KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీని మూడోసారి కోల్‌కత్తా నైట్‌రైడర్స్ చేజిక్కించుకుంది. ఐపీఎల్ ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుతం చేసిన కోల్‌కత్తా చాంపియన్‌గా అవతరించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లోనూ దూకుడు కనబర్చిన కేకేఆర్ అద్భుత విజయం సాధించింది. చెపాక్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌లో సన్‌రైజర్స్‌ను 57 బంతులు మిగిలుండగానే 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఓడించింది.
Also Read: IPL 2024 KKR vs SRH Live: సన్‌రైజర్స్ బ్యాటర్లు ఘోర విఫలం.. కోల్‌కత్తాదేనా ఐపీఎల్ ట్రోఫీ?
అయ్యర్ల అదుర్స్
సన్‌రైజర్స్ విధించిన అతి స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కత్తా నైట్‌రైడర్స్ అత్యంత సునాయాసంగా ఛేదించింది. 13.4 ఓవర్‌లలో 159 పరుగులు చేసి 38 బంతులు మిగిలుండగానే విజయం సాధించి ట్రోఫీని అందుకుంది. శ్రేయర్ అయ్యర్ తన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును చాంపియన్‌గా నిలిపాడు. 24 బంతుల్లో 58 పరుగులు చేయగా.. 4 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలిరేగి ఆడాడు. అదే స్థాయిలో వెంకటేశ్ అయ్యర్ ఆడి జట్టుకు విజయం అందించాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 పరుగులు చేసి సత్తా చాటాడు. వీరిద్దరూ కలిసి దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. అంతకుముందు ఓపెనర్లుగా వచ్చిన రహ్మనుల్లా గుర్బాజ్ 14 బంతుల్లో 23 పరుగులు చేశాడు. సునీల్ నరైన్ 16 బంతుల్లో 21 స్కోర్ నమోదు చేశాడు.
Also Read: IPL 2024 KKR vs SRH Live: ట్రావిస్ హెడ్ 'రాత' మారలేదు.. ఈ ఐపీఎల్‌లో అత్యధిక డకౌట్లు
సమష్టి వైఫల్యంతో చేజారిన ట్రోఫీ
బ్యాటర్లు విఫలమైన వేళ సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ప్రతాపం చూపించాల్సి ఉండగా మరోసారి తమ ఫెయిల్యూర్‌ను నిరూపించారు. జట్టుకు ప్రధాన లోపం బౌలింగ్ అని ఫైనల్‌లో బౌలర్ల ప్రదర్శన చూస్తే తెలుస్తోంది. తక్కువ పరుగుల లక్ష్యాన్ని ఏమాత్రం కాపాడే ప్రయత్నం చేయలేదు. ఆరుగురు బౌలర్లు వేసినా కూడా ఇద్దరు మినహా ఒక్కరూ కూడా వికెట్ తీయలేదు. నటరాజన్ తొలి వికెట్ తీయగా.. కెప్టెన్ పాట్ కమిన్స్ మరో వికెట్ పడగొట్టాడు. ఈ సీజన్‌లో తన బౌలింగ్‌తో ససత్తా చాటుతున్న భువనేశ్వర్ కుమార్ ఆఖరి మ్యాచ్‌లో ఏమాత్రం తన ప్రభావం చూపలేకపోయాడు. నటరాజన్ నుంచి మరింత కట్టుదిట్టమైన బౌలింగ్ రావాల్సి ఉంది. ఫలితంగా బౌలర్లు, బ్యాటర్ల వైఫల్యంతో రెండోసారి వచ్చిన ట్రోఫీ అవకాశాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ చేజార్చుకుంది.
పవర్ ప్లేలోనే పతనం
టాస్ నెగ్గి సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ట్రోఫీ కోసం జరుగుతున్న పోరులో భారీ పరుగులు సాధించాలనే పట్టుదలతో ఉన్న సన్‌రైజర్స్ బ్యాటర్లను కోల్‌కత్తా నైట్ రైడర్ బౌలర్లు అడ్డుకట్ట వేశారు. ఫలితంగా 18.3 ఓవర్‌లలో 113 పరుగులు చేసి సన్‌రైజర్స్ చాప చుట్టేసింది. ఏ ఒక్క బ్యాటర్ కూడా పాతిక పరుగులు కూడా చేయలేకపోయారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో పాట్ కమిన్స్ రంగంలోకి దిగి పరుగుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాడు. 19 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతి ఎక్కువ పరుగులు ఇవే కావడం గమనార్హం. ట్రావిస్ హెడ్ గోల్డెన్ డకౌట్‌తో మొదలైన పతనం ఉనద్కట్ వరకు కొనసాగి జట్టు కుప్పకూలింది. అభిషేక్ శర్మ (2), రాహుల్ త్రిపాఠి (9), ఐడెన్ మర్‌క్రమ్ (20), నితీశ్ కుమార్ రెడ్డి (13), హెన్రిచ్ క్లాసెన్ (16), షాబాద్ అహ్మద్ (8), అబ్దుల్ సమద్ (8), ఉనద్కట్ (4) పరుగులు చేసి జట్టును ప్రమాదంలోకి నెట్టారు. కప్ అవకాశాలను బ్యాటర్లు సంక్లిష్టం చేశారు.
అద్భుతం..
క్వాలిఫయర్ 1లో సన్‌రైజర్స్‌ను అతి తక్కువ పరుగులకే పరిమితం చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బౌలర్లు ఐపీఎల్ ఫైనల్‌లో అంతకుమించి ప్రదర్శన చేశారు. ఏ ఒక్క బ్యాటర్‌ను కూడా మైదానంలో ఎక్కువ సేపు నిలపలేదు. హెడ్‌ను డకౌట్‌తో మొదలుకుని ఆఖరి బ్యాటర్ ఉనద్కట్ వరకు అందరినీ వరుసగా పెవిలియన్ పంపించారు. బౌలర్ల దెబ్బకు సన్‌రైజర్స్ ఈ సీజన్‌లోనే అత్యల్ప పరుగులు చేయడం గమనార్హం. బౌలింగ్ వేసిన ప్రతి బౌలర్ వికెట్ తీయడం విశేషం. ఆండ్రె రస్సెల్ 2.3 ఓవర్లు మాత్రమే వేసి ౩ వికెట్లు పడగొట్టి హైదరాబాద్‌ను చావుదెబ్బ తీశాడు. పవర్ ప్లేను మిచెల్ స్టార్క్ ప్రమాదకరంగా మార్చాడు. ఒక్క బ్యాటర్ కూడా పవర్ ప్లేను సద్వినియోగం చేసుకోనివ్వలేదు. 3 ఓవర్లు వేసిన స్టార్క్ 2 కీలక వికెట్లు తీసి పవర్ ప్లేలోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ నడ్డి విరిచాడు. అతడి స్ఫూర్తితో మిగతా బౌలర్లు రెచ్చిపోయారు. బర్త్ డే బాయ్ హర్షిత్ రాణా కూడా 2 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. మిగతా వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీసి హైదరాబాద్‌ను ముప్పుతిప్పలు పెట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter