IPL 2021 Final, CSK vs KKR: ఫైనల్లో చెలరేగిన చెన్నై బ్యాట్స్‌మెన్స్.. KKR ముందు 193 పరుగుల భారీ టార్గెట్!
IPL 2021 Final: ఐపీఎల్ తుదిపోరులో చెన్నై బ్యాటర్లు దుమ్మురేపారు. సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ (86 పరుగులు: 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ ముందు 193 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.
IPL 2021 Final: ఐపీఎల్ 2021 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం ముందు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
చెలరేగిన ఓపెనర్లు..
తొలి ఓవర్ నుంచి చెన్నై ఆటగాళ్లు ధాటిగా ఆడారు. చెన్నై ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. రుతురాజ్ గైక్వాడ్ (32 పరుగులు, 27 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్), ఫాప్ డుప్లెసిస్ 61 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ టీం కెప్టెన్ కేఎల్ రాహుల్ (626) పరుగులతో ఆరెంజ్ క్యాప్ లిస్టులో అగ్రస్థానంలో నిలిచాడు. నేటి మ్యాచులో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ 3.4 ఓవర్లో సింగిల్ తీసి 635 పరుగులు చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ రేసులో రుతురాజ్ నిలిచాడు. కీలక సమయంలో రుతురాజ్ భారీ షాట్‌కు ప్రయత్నించి సునీల్ నరైన్ బౌలింగ్‌లో లాంగ్ ఆన్‌లో శివం మావికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
Also Read: IPL 2021 Final: చెన్నై జెర్సీతో డేవిడ్ వార్నర్..ఫోటో వైరల్!
ఊతప్ప ఊపేశాడు...
ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రాబిన్ ఊతప్ప(31 పరుగులు, 15 బంతులు, 3 సిక్స్‌లు)తో కలిసి డుప్లెసిస్(86 పరుగులు, 59 బంతులు, 7 ఫోర్లు, 3 సిక్సులు) భారీ షాట్లు ఆడుతూ, ఈజీగా బౌండరీలు సాధిస్తూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ఈ ఇద్దరూ కలిసి మరో అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని చెన్నైకి అందించారు. మంచి ఊపులో ఆడుతోన్న రాబిన్ ఊతప్ప 206 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్న టైంలో రివర్స్ షాట్‌కు ప్రయత్నించి నరైన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
రెండు వికెట్లు పడినా ఫైనల్ మ్యాచ్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం పరుగులు సాధించడంలో ఏమాత్రం తగ్గలేదు. క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ(37 పరగులు, 20 పరుగులు, 2 ఫోర్లు, 3 సిక్సులు) కూడా సిక్సులతో చెలరేగాడు. అయితే మూడో వికెట్‌కు కూడా చెన్నై బ్యాట్స్‌మెన్స్ మూడో అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని అందించడం విశేషం. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో డుప్లెసిస్.. శివం మావీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ టీం బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికట్లు, శివం మావీ ఒక వికెట్ సాధించాడు. మిగతా బౌలర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి