Koneru Humpai World Rapid Champion: ఆదివారం వాల్ స్ట్రీట్‌లో జరిగిన ఫిడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్ 2024లో భారత్‌కు చెందిన కోనేరు హంపీ విజేతగా నిలిచారు. ఆమె 11వ రౌండ్‌లో ఐరీన్ సుకందర్‌ను ఓడించి ఈ టైటిల్‌ను గెలుచుకుంది. 2019లో మాస్కోలో కూడా హంపీ ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఇది ఆమెకు రెండో ప్రపంచ ర్యాపిడ్ టైటిల్. వ్యక్తిగత కారణాల వల్ల, హంపీ బుడాపెస్ట్ ఒలింపియాడ్‌లో పాల్గొనలేకపోయారు. ఇక్కడ భారతదేశం చారిత్రాత్మక డబుల్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. కానీ ఆమె  2024 చివరిలో ర్యాపిడ్ టైటిల్‌తో అద్భుతమైన పునరాగమనం చేసారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చివరి రౌండ్‌కు ముందు, ఆరుగురు క్రీడాకారులు – జు వెన్‌జున్, కాటెరినా లగ్నో, హరికా ద్రోణవల్లి, అఫ్రూజా ఖమ్‌దమోవా, టాన్ ఝోంగీ,  ఐరీన్ 7.5 పాయింట్లతో హంపితో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. అన్ని టాప్ బోర్డ్‌లలోని మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. అయితే టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి హంపీ చివరి రౌండ్‌లో ఐరీన్‌పై గెలిచింది. ఈ విజయం ఆమెకు అద్భుతమైన క్రీడాస్పూర్తికి ఫలితం.


2019లోనూ హంపి ఛాంపియన్ అయ్యింది. చైనా గ్రాండ్ మాస్టర్ జు వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్ హంపి ఈ ఘనత సాధించింది. మరో తెలుగు గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచారు. 


Also Read: Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర.. నేడు తులం రేటు ఎంత ఉందంటే?  


9 రౌండ్లు ముగిసేసరికి అగ్రస్థానంలో ఉన్న భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశి చివరిలో వెనకబడిపోయారు. పురుషుల ర్యాపిడ్ ఈవెంట్లో 18ఏళ్ల వోలాదర్ ముర్జిన్ విజేతగా  నిలిచారు. రష్యాకు చెందిన ఈ యువ గ్రాండ్ మాస్టర్ 10 పాయింట్లు సాధించి ఛాంపియన్ గా అవతరించారు. అర్జున్ 9 పాయింట్లతో ఐదో స్ధానంతో సరిపెట్టుకున్నారు. 


Also Read: Maha Kumbh Mela 2025: మహాకుంభమేళాకు ముస్తాబవుతున్న అయోధ్య..హోటళ్లు ఫుల్..పువ్వులకు ఫుల్ డిమాండ్  


మహిళల ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్ 2024  తుది ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి


1. GM హంపీ కోనేరు - 8.5/11


2. GM జు వెన్‌జున్ - 8.0/11


3. GM కాటెరినా లాగ్నో - 8.0/11


4. GM టాన్ జోంగ్యి -


18. . GM హారిక ద్రోణవల్లి - 8.0/11


6. WIM అఫ్రూజా ఖమ్‌దమోవా – 8.0/11


7. GM అలెగ్జాండ్రా కోస్టెనియుక్ – 8.0/11


8. IM బిబిసర అస్సౌబేవా – 7.5/11


9. IM ఐరీన్ ఖరిష్మా సుకందర్ – 7.5/11


10. IM స్టావ్‌రూలా త్సోలాకిడౌ/15.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook