WTC Final Points Table: భారత్ డబ్యుటీసీ ఫైనల్ బెర్త్ పదిలం.. దక్షిణాఫ్రికా నుంచి పొంచి ఉన్న ముప్పు! సమీకరణాలు ఇవే
India Latest world test championship 2023 points table. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 అవకాశాలను భారత్ మరింత మెరుగు పర్చుకుంది. అయితే ఫైనల్ చేరే క్రమంలో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు పెను ముప్పు పొంచి ఉంది.
India Test Championship Final 2023 scenario after win test series against Bangladesh: బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. చివరివరకు ఉత్కంఠ రేపిన రెండో టెస్టులో టీమిండియా మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023 అవకాశాలను మరింత మెరుగు పర్చుకుంది. ప్రస్తుతం భారత్ 58.93 విజయాల శాతంతో.. 99 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. అయితే ఫైనల్ చేరే క్రమంలో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు పెను ముప్పు పొంచి ఉంది.
ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 4-0తో గెలిస్తే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ 2023కు చేరుకుంటుంది. ఆస్ట్రేలియాపై నాలుగు టెస్టులు గెలిస్తే. భారత్ విజయాల శాతం 68.05గా ఉంటుంది. అప్పుడు దక్షిణాఫ్రికా తనకు మిగిలిన 4 టెస్టులను గెలిచినా ఫైనల్ చేరదు. ఒకవేళ ఆస్ట్రేలియాపై భారత్ 3-0తో సిరీస్ గెలిచి, దక్షిణాఫ్రికా తమకు మిగిలున్న టెస్టులను గెలిస్తే.. రోహిత్ సేనకు ఫైనల్ వెళ్లే ఛాన్స్ ఉండదు. ఇక దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు టెస్టులను కనుక గెలిస్తే.. ఆసీస్ డబ్ల్యుటీసీ ఫైనల్ 2023లో అడుగుపెడుతుంది. దక్షిణాఫ్రికా సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే.. భారత్‌తో జరగనున్న 4 టెస్ట్‌ల సిరీస్‌తో సంబంధం లేకుండా ఆసీస్ ఫైనల్ చేరుతుంది.
తొలి టెస్ట్‌లో ఒదిన దక్షిణాఫ్రికా.. రెండో టెస్ట్‌లోనూ తడబడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో టెస్టులో కూడా ప్రొటీస్ ఓడితే.. దాదాపుగా ఫైనల్ అవకాశాలు గల్లంతవుతాయి. ఇక సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ గెలిచినా.. భారత్ విజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో శ్రీలంక నాలుగో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ గడ్డపై శ్రీలంక 2 టెస్ట్‌ల సిరీస్ గెలిచినా ఫైనల్ చేరడం కష్టం. దాంతో ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా జట్లలో రెండు వెళ్లడం ఖాయం.
డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో ఉన్న పాకిస్థాన్.. ఇప్పటికే ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 0-3తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక డబ్ల్యూటీసీ 2022-23లో భాగంగా చివరగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిచినా పాక్ ఫైనల్ చేరదు.
Also Read: Nirmala Sitharaman Health Update: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.