Legends League Cricket 2022 recorded 16 million-plus unique viewers in India: ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు కలసి ఆడుతున్న 'లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్'కు విశేష ఆదరణ లభిస్తోంది. భారత్‌లో జరుగుతున్న రెండో ఎడిషన్‌ భారీ సక్సెస్ దిశగా దూసుకెళుతోంది. మాజీల ఆటను చూసేందుకు క్రికెట్ ప్రేమికులు ఆసక్తి కనబరుస్తున్నారు. దాంతో లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్ వ్యూవర్‌షిప్‌లో దూసుకుపోతోంది. భారత దేశంలోని డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో 1.6 కోట్ల మందికి పైగా పైగా వీక్షించారు.  ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ల దాటినట్లు బార్క్ వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ లీగ్‌లో భారత జట్టు 'ఇండియా మహారాజాస్' పేరుతో ఆడుతున్న విషయం తెలిసిందే. ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌కి అత్యధిక వ్యూవర్‌షిప్‌ వచ్చినట్టు బార్క్‌ తెలిపింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినహా దేశంలో జరిగే ఇతర క్రికెట్ లీగ్‌ల కంటే ఎక్కువ రేటింగ్‌లను సంపాదించిందని బార్క్ తెలిపింది. దాంతో లెజెండ్స్‌ లీగ్‌ సహవ్యవస్థాపకుడు, సీఈఓ హర్షం రామన్ రహేజా వ్యక్తం చేశారు. లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ను ప్రపంచానికి దగ్గర చేసిన స్టార్‌ స్పోర్ట్స్‌ అలానే ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. 


లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో భారత్‌ నుంచి సచిన్‌ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, మొహ్మద్ కైఫ్‌, గౌతమ్‌ గంభీర్‌, యూసఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఎస్ శ్రీశాంత్‌ సహా పలువురు పాల్గొంటున్నారు. క్రిస్‌ గేల్‌, జాక్వెస్‌ కల్లిస్‌, షేన్‌ వాట్సన్‌, బ్రెట్‌ లీ, మిచెల్‌ జాన్సన్‌, తిలకరత్నే దిల్షాన్‌, ముత్తయ్య మురళీధరన్‌ సహా అనేక మంది విదేశీ క్రికెటర్లు ఆడుతున్నారు. ఇక లెజెండ్స్ లీగ్‌ క్రికెట్ ఫైనల్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 5న కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనుంది.


లెజెండ్స్ లీగ్ క్రికెట్ మొదటిసారిగా భారతదేశంలో నిర్వహించబడుతోంది.  యూఎస్, ఆస్ట్రేలియా మరియు భారత ఉపఖండం అంతటా ఈ మ్యాచులు ప్రసారం అవుతున్నాయి. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్.. భారతదేశం మరియు ఉపఖండంలో అధికారిక ప్రసారం మరియు స్ట్రీమింగ్ భాగస్వాములుగా ఉన్నాయి. విల్లో టీవీ మరియు కయో స్పోర్ట్స్, ఫాక్స్ క్రికెట్ కూడా యూఎస్ మరియు ఆస్ట్రేలియాలో లీగ్ ప్రత్యేక ప్రసార మరియు స్ట్రీమింగ్ భాగస్వాములుగా ఉన్నాయి.


Also Read: Pooja Hegde Hot Photos: ఎద అందాలు ఆరబోస్తున్న బుట్టబొమ్మ.. క్లీవీజ్ కనిపించేలా ట్రీట్!


Also Read: Ashu Reddy - Ariana Glory Hot Photos: ముద్దులు పెట్టుకుంటున్న అరియానా గ్లోరీ-అషు రెడ్డి.. హాట్ ఫోటోలు చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook