IND vs BAN Updates: చివరి బంతి వరకు ఉత్కంఠ.. బంగ్లాపై భారత్ విజయం!

Wed, 02 Nov 2022-6:04 pm,

ICC T20 World Cup 2022 India vs Bangladesh Cricket Match updates. చివరి బంతి వరకు ఉత్కంఠ సాగిన మ్యాచులో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించింది.

IND vs BAN Live Cricket Score Updates: చివరి బంతి వరకు ఉత్కంఠ సాగిన మ్యాచులో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించింది. వర్షం కారణంగా బంగ్లా లక్ష్యం 16 ఓవర్లకు 151 పరుగులుగా మారింది. ఛేదనలో బంగ్లా 6 వికెట్స్ కోల్పోయి 145 రన్స్ చేసి.. 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

Latest Updates

  • చివరి బంతి వరకు ఉత్కంఠ సాగిన మ్యాచులో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించింది. వర్షం కారణంగా బంగ్లా లక్ష్యం 16 ఓవర్లకు 151 పరుగులుగా మారింది. ఛేదనలో బంగ్లా 6 వికెట్స్ కోల్పోయి 145 రన్స్ చేసి 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్‌లో బంగ్లా విజయానికి 20 పరుగులు అవసరం కాగా.. అర్ష్‌దీప్‌ సింగ్ 14 పరుగులు ఇచ్చాడు. లిటన్‌ దాస్‌ (60) హాఫ్ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ హార్దిక్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు. 
     

  • 15 ఓవర్లు పూర్తి: బంగ్లాదేశ్‌ స్కోర్ 131/6. తస్కిన్ అహ్మద్ (11), నురుల్ హసన్ (12) క్రీజులో ఉన్నారు. బంగ్లా విజయానికి 6 బంతుల్లో 20 రన్స్ అవసరం. 
     

  • 14వ ఓవర్ ముగిసేసరికి బంగ్లాదేశ్‌ ఆరు వికెట్ల నష్టానికి 120 రన్స్ చేసింది. తస్కిన్ అహ్మద్ (0), నురుల్ హసన్ (12) క్రీజులో ఉన్నారు. బంగ్లా విజయానికి 12 బంతుల్లో 31 రన్స్ అవసరం. 
     

  • 13 ఓవర్లు పూర్తి: బంగ్లాదేశ్‌ స్కోర్ 108/6. తస్కిన్ అహ్మద్ (0), నురుల్ హసన్ (2) క్రీజులో ఉన్నారు. హార్దిక్ పాండ్యా ఈ ఓవర్లో రెండు వికెట్స్ పడగొట్టాడు. బంగ్లా విజయానికి 18 బంతుల్లో 43 రన్స్ అవసరం. 
     

  • షకీబ్ ఔట్:
    బంగ్లాదేశ్‌ నాలుగో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ వేసిన 12వ ఓవర్ ఐదవ బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీపక్ హుడా అద్భుత క్యాచ్ అందుకున్నాడు. బంగ్లాదేశ్‌ స్కోర్ 101/4. 

  • 11వ ఓవర్ ముగిసేసరికి బంగ్లాదేశ్‌ రెండు వికెట్ల నష్టానికి 99 రన్స్ చేసింది. షకీబ్ (13), హుస్సేన్ (3) క్రీజులో ఉన్నారు. బంగ్లా విజయానికి 30 బంతుల్లో 52 రన్స్ అవసరం. 
     

  • 10 ఓవర్లు పూర్తి: బంగ్లాదేశ్‌ స్కోర్ 88-2. షకీబ్ (9), హుస్సేన్ (2) క్రీజులో ఉన్నారు. బంగ్లా విజయానికి 36 బంతుల్లో 63 రన్స్ అవసరం. 
     

  • షాంటో ఔట్:
    బంగ్లాదేశ్‌ రెండో వికెట్ కోల్పోయింది. షమీ వేసిన 10వ ఓవర్ మొదటి బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. రాహుల్ అద్భుత రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. 

  • 9వ ఓవర్ ముగిసేసరికి బంగ్లాదేశ్‌ రెండు వికెట్ల నష్టానికి 84 రన్స్ చేసింది. షకీబ్ (3), షాంటో (21) క్రీజులో ఉన్నారు.
     

  • 8 ఓవర్లు పూర్తి: బంగ్లాదేశ్‌ స్కోర్ 74-1. షకీబ్ (1), షాంటో (13) క్రీజులో ఉన్నారు.
     

  • హమ్మయ్య దాస్ ఔట్:
    హాఫ్ సెంచరీ హీరో లిటన్‌ దాస్‌ రనౌట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ డైరెక్ట్ హిట్ కారణంగా దాస్ పెవిలియన్ చేరాడు. 

  • ఆరంభమయిన మ్యాచ్.. 8వ ఓవర్ వేస్తున్న అశ్విన్. 
     

  • 54 బంతుల్లో 85 రన్స్:
    బంగ్లా విజయం సాధించాలంటే.. ఇంకా 54 బంతుల్లో 85 రన్స్ కొట్టాలి. 

  • మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. బంగ్లా లక్ష్యం 16 ఓవర్లకు 151. 
     

  • ఓవర్ల పరంగా బంగ్లాదేశ్‌ టార్గెట్‌:
    19 ఓవర్లు: 177
    17 ఓవర్లు: 160
    15 ఓవర్లు: 142
    12 ఓవర్లు: 112
    10 ఓవర్లు: 89

  • భారత అభిమానులకు శుభవార్త. అడిలైడ్‌లో వర్షం తగ్గింది. మైదాన సిబ్బంది తమ పనులతో బిజీగా ఉన్నారు. 
     

  • ప్రస్తుతం వర్షం తగ్గుముఖం పట్టింది. అయితే అడిలైడ్‌లో దట్టంగా మేఘాలు అలుకున్నాయి. అడిలైడ్‌ పరిస్థితుల నేపథ్యంలో భారత డగౌట్‌లో ప్లేయర్స్ ఆందోళన చెందుతున్నారు. 
     

  • 17 పరుగులు ముందు:
    బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లు పూర్తయిన నేపథ్యంలో డక్ వర్త్ లూయిస్ పద్ధతి వర్తిస్తుంది. ప్రస్తుతం భారత్ స్కోర్ కంటే బంగ్లా 17 పరుగులు ముందు ఉంది. మ్యాచ్ జరగకుంటే.. బంగ్లా విజయం సాధిస్తుంది. 
     

  • వర్షం అంతరాయం:
    భారత్, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. బంగ్లా ఇన్నింగ్స్ 7వ ఓవర్ పూర్తవ్వగానే చిరు జల్లు కురిసింది. దాంతో మైదాన సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. 

  • 7 ఓవర్లు పూర్తి: బంగ్లాదేశ్‌ స్కోర్ 66/0. లిటన్‌ దాస్‌ (59), షాంటో (7) క్రీజులో ఉన్నారు.
     

  • పవర్ ప్లే పూర్తి: 
    6 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్‌ వికెట్ కోల్పోకుండా 60 పరుగులు చేసింది. క్రీజ్‌లో లిటన్‌ దాస్‌ (56), షాంటో (4) ఉన్నారు. 
     

  • మెరుపు హాఫ్ సెంచరీ:
    బంగ్లాదేశ్‌ ఓపెనర్ లిటన్‌ దాస్‌ మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. 21 బంతుల్లో 50 రన్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. 
     

  • లిటన్‌ సిక్స్:
    భువనేశ్వర్ కుమార్ వేసిన 5వ ఓవర్ ఐదో బంతికి లిటన్‌ దాస్‌ సిక్స్ బాదాడు. బంగ్లాదేశ్‌ స్కోర్ 44/0. లిటన్‌ దాస్‌ (41), షాంటో (3) క్రీజులో ఉన్నారు.

  • 4 ఓవర్లు పూర్తి: బంగ్లాదేశ్‌ స్కోర్ 35/0. లిటన్‌ దాస్‌ (33), షాంటో (2) క్రీజులో ఉన్నారు.
     

  • భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్‌లో లిటన్ దాస్ మరింత రెచ్చిపోయాడు. సిక్స్‌తో పాటు రెండు కొట్టడంతో మొత్తం ఈ ఓవర్‌లో 16 రన్స్ వచ్చాయి. స్కోరు: 3 ఓవర్లలో 30/3.

  • రెండో ఓవర్‌లో ఓపెనర్ లిటన్ దాస్ బ్యాట్ ఝులిపించాడు. మూడు ఫోర్లు బాదడంతో 12 పరుగులు వచ్చాయి.
     

  • 185 పరుగుల లక్ష్యంతో బంగ్లాదేశ్ బరిలోకి దిగింది. భువనేశ్వర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మొదటి ఓవర్‌లో రెండు పరుగులు వచ్చాయి.
     

  • బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో బీహార్ 6 వికెట్లు కోల్పోయి 184 రన్స్ చేసి.. దక్షిణాఫ్రికా ముందు 185 పరుగుల లక్ష్యంను ఉంచింది. విరాట్ కోహ్లీ (64 నాటౌట్; 44 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (50; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీలు బాదారు. సూర్యకుమార్ యాదవ్ (30) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ 3 వికెట్స్ పడగొట్టాడు. 
     

  • 19వ ఓవర్ ముగిసేసరికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 170 రన్స్ చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (61), ఆర్ అశ్విన్ (2) ఉన్నాడు . 
     

  • అక్షర్ పటేల్ ఔట్:
    అక్షర్ పటేల్ (7) ఔట్ అయ్యాడు. హసన్ మహమూద్ వేసిన 19వ ఓవర్ మొదటి బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. 

  • 18 ఓవర్లు పూర్తి: భారత్ స్కోర్ 157/5. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (50), అక్షర్ పటేల్ (7) ఉన్నారు. 
     

  • దినేష్ కార్తీక్ ఔట్:
    దినేష్ కార్తీక్ (7) ఔట్ అయ్యాడు. షారిఫుల్ ఇస్లాం వేసిన 17వ ఓవర్ చివరి బంతికి రనౌట్ అయ్యాడు. 

  • 17వ ఓవర్ ముగిసేసరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 150 రన్స్ చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (50) ఉన్నాడు . 
     

  • 16 ఓవర్లు పూర్తి: భారత్ స్కోర్ 140/4. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (46), దినేష్ కార్తీక్ (2) ఉన్నారు. 
     

  • 15వ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. విరాట్ కోహ్లీ (40), హర్ధిక్ పాండ్యా (5) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు.
     

  • టీమిండియాకు బంగ్లా కెప్టెన్ షకీబ్ మరోసారి షాక్ ఇచ్చాడు. కుదురుకున్న సూర్య కుమార్ యాదవ్ (30) క్లీన్ బౌల్డ్ చేశాడు. 14 ఓవర్లకు 119-3. 

  • విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్ నిలకడగా ఆడుతున్నారు. 13వ ఓవర్ సూర్య మూడు ఫోర్లు బాదడంతో 14 పరుగులు వచ్చాయి. స్కోరు: 13 ఓవర్లకు 115-2. 

  • 12వ ఓవర్‌లో టీమిండియా స్కోరు బోర్డు వంద దాటింది. ఈ ఓవర్‌లో మొత్తం 9 పరుగులు వచ్చాయి.

  • టీమిండియా జోరు కాస్త తగ్గింది. 11వ ఓవర్‌లో కేవలం ఆరు పరుగులు మాత్రమే వచ్చాయి.
     

  • 10 ఓవర్లు పూర్తి: భారత్ స్కోర్ 86-2. క్రీజ్‌లో సూర్యకుమార్ యాదవ్ (7), విరాట్ కోహ్లీ (24) ఉన్నారు. 
     

  • కోహ్లీ ఫోర్, రాహుల్ సిక్సులు:
    షారిఫుల్ ఇస్లాం వేసిన 9 ఓవర్ మొదటి బంతికి విరాట్ కోహ్లీ బౌండరీ బాదాడు. నాలుగో బంతికి రాహుల్ సిక్సులు బాదాడు. భారత్ స్కోర్ 76-1. క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (48), విరాట్ కోహ్లీ (23) ఉన్నారు. 
     

  • ఎనిమిదవ ఓవర్ ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 52 రన్స్ చేసింది. క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (31), విరాట్ కోహ్లీ (18) ఉన్నారు. ఈ ఓవర్లో షకీబ్ 10 రన్స్ ఇచ్చాడు. 
     

  • 7 ఓవర్లు పూర్తి: భారత్ స్కోర్ 42-1. క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (23), విరాట్ కోహ్లీ (16) ఉన్నారు. 
     

  • పవర్ ప్లే పూర్తి: 
    6 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (21), విరాట్ కోహ్లీ (13) ఉన్నారు. ఈ ఓవర్లో ముస్తాఫిజుర్ రెహమాన్ 7 రన్స్ ఇచ్చాడు.

  • కోహ్లీ బౌండరీల మోత:
    తస్కిన్ అహ్మద్ వేసిన 5వ ఓవర్ మొదటి రెండు బంతులకు కోహ్లీ బౌండరీలు బాదాడు. 5 ఓవర్లకు భారత్ స్కోర్ 30-1. క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (18), విరాట్ కోహ్లీ (9) ఉన్నారు. 

  • రాహుల్ ఫోర్, సిక్స్:
    హసన్ మహమూద్ వేసిన నాలుగో ఓవర్లో కేఎల్ రాహుల్ 4, 6 బాదాడు. నాలుగో ఓవర్ పూర్తయ్యేసరికి భారత్ స్కోర్ 22-1. 

  • రోహిత్ శర్మ ఔట్:
    కెప్టెన్ రోహిత్ శర్మ (2) ఔట్ అయ్యాడు. హసన్ మహమూద్ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. 

  • మూడో ఓవర్ ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 11 రన్స్ మాత్రమే చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (8), కేఎల్ రాహుల్ (2) ఉన్నారు. తస్కిన్ అహ్మద్ 1 రన్ మాత్రమే ఇచ్చాడు. 
     

  • క్యాచ్ మిస్:
    కెప్టెన్ రోహిత్ శర్మకు లైఫ్ లభించింది. తస్కిన్ అహ్మద్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతికి రోహిత్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ వద్ద ఫీల్డర్ క్యాచ్ మిస్ చేశాడు. 

  • రాహుల్ సిక్స్:
    2 ఓవర్లు పూర్తి: భారత్ వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. రాహుల్ సిక్స్ బాదాడు. క్రీజ్‌లో రోహిత్ శర్మ (1), కేఎల్ రాహుల్ (8) ఉన్నారు. ఈ ఓవర్లో షోరిఫుల్ ఇస్లాం 9 రన్స్ ఇచ్చాడు.

  • మొదటి ఓవర్ ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా ఒక రన్ మాత్రమే చేసింది. 
     

  • భారత్ ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఆరంభించారు. మొదటి ఓవర్ తస్కిన్ అహ్మద్ వేస్తున్నాడు. 

  • టీ20ల్లో భారత్‌, బంగ్లాదేశ్ 11 మ్యాచుల్లో తలపడ్డాయి. భారత్ పది మ్యాచులు గెలవగా.. బంగ్లాదేశ్‌ ఒక మ్యాచ్ గెలిచింది.

  • తుది జట్లు:
    భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్. 
    బంగ్లాదేశ్‌: నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), అఫీఫ్ హుస్సేన్, యాసిర్ అలీ, మొసద్దెక్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, నూరుల్ హసన్ (కీపర్), ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్. 

  • భారత తుది జట్టులోకి అక్షర్ పటేల్ వచ్చాడు. దీపక్ హుడా స్థానంలో అక్షర్ బరిలోకి దిగనున్నాడు. దక్షిణాఫ్రికాపై గాయపడిన వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. దాంతో రిషబ్ పంత్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. 

  • బంగ్లాదేశ్‌ కెప్టెన్ షకీబ్ ఉల్ హాసన్ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. దాంతో ముందుగా భారత్ బ్యాటింగ్ చేయనుంది. 
     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link