IND Vs AUS Live Updates: వరల్డ్ ఛాంపియన్‌గా ఆసీస్.. ఫైనల్‌లో భారత్ ఓటమి

Sun, 19 Nov 2023-9:59 pm,

India Vs Australia Live Score Updates: అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. కోట్లాది క్రికెట్ ప్రేమికులు టీవీలకు అతుక్కుపోనుండగా.. ప్రేక్షకులతో నరేంద్ర మోదీ స్టేడియం కిక్కిరిసిపోనుంది. ఫైనల్ మ్యాచ్ లైవ్ స్కోరు అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

India Vs Australia Live Score Updates: భారత్, ఆసీస్ మధ్య వరల్డ్ కప్ 2023 ఫైనల్ పోరుకు యావత్ క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి ఫైనల్‌కు చేరిన భారత్.. సొంతగడ్డపై ఆసీస్‌ను చిత్తు చేస్తుందా..? టీమిండియాను ఓడించి మరోసారి కంగారూలు ఛాంపియన్స్‌గా నిలుస్తారా..? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. గత రికార్డులు ఆసీస్‌కు అనుకూలంగా ఉన్నా.. ప్రస్తుత బలబలాలను బట్టి చూస్తే టీమిండియాదే కాస్త పైచేయిగా ఉంది. అయితే ఫైనల్‌ పోరులో ఒత్తిడిని జయించిన జట్టుకే విజయం దక్కుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ బిగ్‌ ఫైట్ జరుగుతోంది. టీమిండియాకు ఇది వరల్డ్ కప్ నాలుగో ఫైనల్‌ కాగా.. ఆసీస్ ఎనిమిదో ఫైనల్‌లో ఆడుతుంది. భారత్ రెండుసార్లు వరల్డ్ గెలుపొందగా.. ఆస్ట్రేలియా ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ లైవ్ స్కోర్, అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి..

Latest Updates

  • IND Vs AUS Live Score: 2003, 2023 రెండు వరల్డ్ కప్‌ ఫైనల్స్‌లోనూ భారత్‌ను ఆసీస్ ఓడించింది. సొంతగడ్డపై భారత్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా ఆటతీరు మాత్రం అమోఘం. స్టేడియంలో ఉన్న లక్షా 30 వేల మంది గొంతులు మూగపోయేలా చేశారు. యావత్ భారత క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేశారు.

  • IND Vs AUS Live Score: ట్రావిస్ హెడ్ (137) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అతనికి తోడు లబూషేన్ (58 నాటౌట్) జీవితాంతం గుర్తిండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. మాక్స్‌వెల్ (2 నాటౌట్) విన్నింగ్ షాట్ కొట్టాడు. 241 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 43 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

  • IND Vs AUS Live Score: టీమిండియాకు సొంతగడ్డపై ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి.. రికార్డుస్థాయిలో ఆరోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. భారత్ ఓటమితో కోట్లాది మంది భారతీయులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

  • IND Vs AUS Live Score: లబూషన్‌ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ట్రావిస్ హెడ్ (128)తో కలిసి లబూషేన్ (53) 47 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నారు. ప్రస్తుతం స్కోరు: 225/3 (40)
     

  • IND Vs AUS Live Score: టీమిండియా అభిమానులకు వరల్డ్ కప్‌ ఆశలు సన్నగిల్లుతున్నాయి. 37 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 37 రన్స్ కావాలి. 
     

  • IND Vs AUS Live Score: ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీ బాదాడు. తీవ్ర ఒత్తిడిలో 95 బంతుల్లో 100 పరుగులు పూర్తిచేశాడు. ఈ ప్రపంచకప్‌లో హెడ్‌కు ఇది రెండో సెంచరీ. ప్రస్తుతం స్కోరు 185/3 (34). మరో 54 పరుగులు చేస్తే వరల్డ్ కప్ ఆసీస్ సొంతం అవుతుంది.

  • IND Vs AUS Live Score: 30 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. క్రీజ్‌లో ట్రావిస్ హెడ్ (86), లబూషేన్ (37) నాటౌట్‌గా ఉన్నారు. విజయానికి ఇంకా 74 రన్స్ అవసరం.

  • IND Vs AUS Live Score: టీమిండియా అభిమానుల్లో పూర్తిగా నిరాశ కనిపిస్తోంది. ఆసీస్ విజయానికి మరో 79 పరుగులు కావాలి. ప్రస్తుతం స్కోరు: 162/3 (28)
     

  • IND Vs AUS Live Score: 26 ఓవర్‌లో రెండు బౌండరీలతో కలిపి 9 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం స్కోరు: 144/3 (26)

  • IND Vs AUS Live Score: లక్ష్యానికి ఆసీస్ చేరువగా వస్తోంది. 25 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 135 రన్స్ చేసింది. ట్రావిస్ హెడ్ (65), లబూషేన్ (27) క్రీజ్‌లో పాతుకుపోయారు.
     

  • IND Vs AUS Live Score: ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 58 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. లబూషేన్ (23 నాటౌట్) చక్కటి సహకారం అందిస్తున్నాడు. స్కోరు: 117-3 (22).

  • IND Vs AUS Live Score: 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్‌ను ట్రావిస్ హెడ్, లబూషేన్ ఆదుకున్నారు. 20 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు: 104/3 

  • IND Vs AUS Live Score: ట్రావిస్ హెడ్ (43), లబూషేన్ (13) నాలుగో వికెట్‌కు 71 బంతుల్లో 50 పరుగులు జోడించారు. 19వ ఓవర్‌లో 4 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం స్కోరు: 99/3 (19).
     

  • IND Vs AUS Live Score: 18వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ కేవలం రెండు పరుగులే ఇచ్చారు. ప్రస్తుతం ట్రావిస్ హెడ్ (41), లబూషేన్ (11) క్రీజ్‌లో కుదురుకున్నారు. స్కోరు 95/3 (18).

  • IND Vs AUS Live Score: ఆసీస్ కుదురుకుంటోంది. 17వ ఓవర్‌లో ఒక బౌండరీతో కలిపి 6 పరుగులు రాబట్టింది. స్కోరు: 93/3 (17). విజయానికి ఇంకా 148 పరుగులు కావాలి. చేతిలో ఏడు వికెట్లు, ఇంకా 33 ఓవర్లు ఉన్నాయి.
     

  • IND Vs AUS Live Score: 16వ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. ఆసీస్ స్కోరు 16 ఓవర్లు పూర్తయ్యే సమయానికి మూడు వికెట్ నష్టానికి 87 పరుగులుగా ఉంది.

  • IND Vs AUS Live Score: ఆసీస్ పోరాడుతోంది. 14 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (24), లబూషేన్ (7) క్రీజ్‌లో ఉన్నారు. 
     

  • IND Vs AUS Live Score: 12వ ఓవర్‌లో కేవలం మూడు పరుగులు వచ్చాయి. స్కోరు: 68/3 (12).
     

  • IND Vs AUS Live Score: ఆసీస్ మెల్లగా కుదురుకుంటోంది. 11వ ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. స్కోరు: 11 ఓవర్లలో 65/3.

  • IND Vs AUS Live Score: పది ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (19), లబూషేన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. 
     

  • IND Vs AUS Live Score: ఆసీస్ బ్యాట్స్‌మెన్స్ పరుగులు చేయడం కష్టంగా మారింది. 9వ ఓవర్‌లో కేవలం 4 పరుగులు వచ్చాయి. అది కూడా బైస్ రూపంలో వచ్చాయి. ప్రస్తుతం స్కోరు: 51/3 (9)

  • IND Vs AUS Live Score: ప్రస్తుతం ఆసీస్ కష్టాల్లో పడిపోయింది. 8వ ఓవర్‌ను మహ్మద్ షమీ మిడిన్ వేశాడు. స్కోరు: 47/3 (8).

  • IND Vs AUS Live Score: టీమిండియా బౌలర్లు చెలరేగుతున్నారు. స్టీవ్ స్మిత్‌ (4)ను బుమ్రా ఔట్ చేశాడు. స్కోరు: 47/3 

  • IND Vs AUS Live Score: ఆరో ఓవర్‌లో షమీ కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. దీంతో ఆరు ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది.

  • IND Vs AUS Live Score: టీమిండియాకు రెండో బ్రేక్ లభించింది. మిచెల్ మార్ష్‌ (15)ను బుమ్రా ఔట్ చేశాడు. దీంతో 41 రన్స్ వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. ఐదో ఓవర్‌ను బుమ్రా మిడిన్ వేశాడు.

  • IND Vs AUS Live Score: ఆసీస్ దూకుడే లక్ష్యంగా ఆడుతోంది. నాలుగో ఓవర్‌లో ఒక సిక్స్‌తో కలిపి మొత్తం 12 పరుగులు వచ్చాయి. దీంతో నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది.

  • IND Vs AUS Live Score: మూడో ఓవర్‌లో బుమ్రా అదిరిపోయే బౌలింగ్ వేశాడు. కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. స్కోరు: 29/1 (3)

  • IND Vs AUS Live Score: మహ్మద్ షమీ మరోసారి బ్రేక్ ఇచ్చాడు. డేవిడ్ వార్నర్ (7) పెవిలియన్‌కు పంపించాడు. అయితే పరుగుల వేగం మాత్రం ఆగడం లేదు. స్కోరు: 28/1 (2)
     

  • IND Vs AUS Live Score: ఫస్ట్‌ బాల్‌కే డేవిడ్ వార్నర్‌కు లైఫ్ లభించింది. బంతి ఎడ్జ్‌ తీసుకోగా.. స్లిప్‌లో విరాట్ కోహ్లీ, గిల్ స్పందించకపోవడంతో బాల్ మధ్యలో బౌండరీకి వెళ్లిపోయింది. తొలి ఓవర్‌లో మూడు బౌండరీలు రావడంతో మొత్తం 15 పరుగులతో ఆసీస్‌కు మంచి ఆరంభం లభించింది. 
     

  • IND Vs AUS Live Score: అభిమానుల ఆశలన్నీ బౌలర్లపైనే ఉన్నాయి. పిచ్ స్లోగా ఉండడంతో భారత బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడం చాలా కష్టంగా మారింది. పేసర్ల త్రయం బుమ్రా, షమీ, సిరాజ్ స్లో బౌన్సర్లతో చెలరేగితే వికెట్లు దక్కే అవకాశం ఉంది. దీనికి తోడు ఫీల్డింగ్ మెరుగ్గా ఉంటే.. 240 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవచ్చు.

  • IND Vs AUS Live Score: ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. జోష్ హేజిల్‌వుడ్, కమిన్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మ్యాక్స్‌వెల్, జంపాకు తలో వికెట్ దక్కింది. 241 పరుగుల లక్ష్యంతో ఆసీస్ బరిలోకి దిగనుంది.

  • IND Vs AUS Live Score: టీమిండియా 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తక్కువ లక్ష్యం విధించింది.

  • IND Vs AUS Live Score: 49 ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి. కుల్దీప్ యాదవ్ (8), సిరాజ్ (3) క్రీజ్‌లో ఉన్నారు. స్కోరు: 232/9 (49) 

  • IND Vs AUS Live Score: సూర్యకుమార్ యాదవ్ (18) కూడా ఔట్ అయిపోయాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. స్కోరు: 227/9 (48)

  • IND Vs AUS Live Score: 47 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 223 పరుగులుగా ఉంది. చివరి మూడు ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ ఎంత దూకుడుగా ఆడితే అంత స్కోరు వస్తుంది.

  • IND Vs AUS Live Score: 46 ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ (15), కుల్దీప్ యాదవ్ (5) ఆడుతున్నారు. స్కోరు: 221/8 (46).

  • IND Vs AUS Live Score: టీమిండియా 8వ వికెట్ కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా ఒక పరుగు చేసి ఔట్ అయ్యాడు. బుమ్రాను ఆడమ్ జంపా ఎల్‌బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్‌కు పంపించాడు. స్కోరు: 215/8 (45).
     

  • IND Vs AUS Live Score: భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. మహ్మద్ షమీ (6) స్టార్క్ ఔట్ చేశాడు. 211 పరుగుల వద్ద టీమిండియా 7వ వికెట్ కోల్పోయింది. స్కోరు: 213/7 (44)

  • IND Vs AUS Live Score: 43 ఓలర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్రీజ్‌లో సూర్యకుమార్ యాదవ్ (12), మహ్మద్ షమీ (6) ఉన్నారు.

  • IND Vs AUS Live Score: టీమిండియా భారీ స్కోరు ఆశలకు బ్రేక్ పడింది. 203 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (66) స్టార్క్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. స్కోరు: 207-6 (42)

  • IND Vs AUS Live Score: 40 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. కేఎల్ రాహల్‌ (64)కి తోడు సూర్యకుమార్ (8) ఆడుతున్నారు. చివరి 10 ఓవర్లు వీరిద్దరు ఎలా ఆడతారనే దానిపై భారత్ విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

  • IND Vs AUS Live Score: 38 ఓవర్‌లో కేవలం 3 పరుగులు వచ్చాయి. కేఎల్ రాహల్‌ (58)కి తోడు సూర్యకుమార్ క్రీజ్‌లో ఉన్నాడు. స్కోరు 182/5 (38).
     

  • IND Vs AUS Live Score: భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా (9)ను హేజిల్‌వుడ్ పెవిలియన్‌కు పంపించాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లోకి వచ్చాడు. స్కోరు: 178/5 (36)
     

  • IND Vs AUS Live Score: కష్టాల్లో టీమిండియాను కేఎల్ రాహుల్ ఆదుకుంటున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. రాహుల్‌ (50)కు తోడు జడేజా (9) క్రీజ్‌లో ఉన్నాడు. స్కోరు: 173/4 (35).
     

  • IND Vs AUS Live Updates: 34వ ఓవర్‌లో కేవలం 4 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం స్కోరు 34 ఓవర్లలో 169/4.

  • IND Vs AUS Live Score: ఫైనల్ ఫైట్‌లో భారత్ ఎదురీదుతోంది. ప్రస్తుతం స్కోరు 32 ఓవర్లలో 162-4.

  • ఈ వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ పరుగులు ఇలా..

     

  • IND Vs AUS Live Score: 30 ఓవర్లు ముగిసేసరికి  నాలుగు వికెట్ నష్టానికి 152 టీమిండియా పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (39), రవీంద్ర జడేజా (1) క్రీజ్‌లో ఉన్నారు.

  • IND Vs AUS Live Score: టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది. క్రీజ్‌కు పాతుకుపోయిన విరాట్ కోహ్లీ (54) పాట్ కమిన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. థర్డ్ మ్యాన్ దిశగా ఆడేందుకు ప్రయత్నించగా.. ఇన్‌సైడ్ ఎడ్జ్‌ తీసుకోని బంతి వికెట్లను తాకింది. 148 పరుగుల వద్ద భారత్ 4వ వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు.

  • IND Vs AUS Live Score: శుభ్‌మన్ గిల్ (4) తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో సారా టెండూల్కర్‌ తెగ ఫీలైనట్లు ఉంది. ట్విట్టర్‌లో హర్ట్ బ్రేక్ ఎమోజీతో గిల్ పిక్‌ను షేర్ చేసింది.
     

  • IND Vs AUS Live Score: 27 ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. విరాట్ కోహ్లీ (51), కేఎల్ రాహుల్ (34) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం స్కోరు: 142/3 (27).

  • IND Vs AUS Live Score: విరాట్ కోహ్లీ మరో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో కోహ్లీకి ఇది ఆరోది. స్కోరు: 135/3 (26)

  • IND Vs AUS Live Score: 25 ఓవర్లు ముగిసేసరికి 131 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (49), కేఎల్ రాహుల్ (25) జట్టును ఆదుకుంటున్నారు. 

  • IND Vs AUS Live Score: ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో బౌండరీలు రావడం కష్టమైపోయింది. 13 ఓవర్లు కిందట చివరి బౌండరీ వచ్చింది. ప్రస్తుతం స్కోరు: 125/3 (23)
     

  • IND Vs AUS Live Score: 21 ఓవర్‌లో`నాలుగు పరుగులు వచ్చాయి. ప్రస్తుతం స్కోరు 119-3 (21). విరాట్ కోహ్లీ (41), కేఎల్ రాహుల్ (21) క్రీజ్‌లో ఉన్నారు.

  • IND Vs AUS Live Score: టీమిండియా కోలుకుంటోంది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జట్టును ఆదుకునే పనిలో ఉన్నారు. స్కోరు 20 ఓవర్లలో 115/3.
     

  • IND Vs AUS Live Score: 18 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి భారత్ 107 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (35), కేఎల్ రాహుల్ (15) క్రీజ్‌లో ఉన్నారు.

  • IND Vs AUS Live Score: టీమిండియా నిలకడగా ఆడుతోంది. 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 101 పరుగుల చేసింది. 6.31 రన్‌రేట్‌తో పరుగులు చేస్తోంది.
     

  • IND Vs AUS Live Score: విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతున్నారు. మరో వికెట్ ఇవ్వకుండా ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్నారు. స్కోరు: 97/3 (15)

  • IND Vs AUS Live Score: 14 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 94 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ (30), కేఎల్ రాహుల్ (7) క్రీజ్‌లో ఉన్నారు. 

  • IND Vs AUS Live Score: ఓ ఎండ్‌లో విరాట్ కోహ్లీ (27) క్రీజ్‌లో పాతుకుపోయాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదితున్నాడు. 89/3 (13)

  • IND Vs AUS Live Score: అన్ని మ్యాచ్‌ల్లో అదరగొట్టిన బ్యాటింగ్ ఆర్డర్ ఫైనల్ పోరులో తడపడుతోంది. ప్రస్తుతం స్కోరు 82-3 (11).
     

  • IND Vs AUS Live Score: టీమిండియా కష్టాల్లో పడింది. శ్రేయాస్ అయ్యర్ (4)ను పాట్ కమిన్స్ ఔట్ చేశాడు. దీంతో 81 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 
     

  • IND Vs AUS Live Score: టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది. జోరుమీదున్న కెప్టెన్ రోహిత్ శర్మ (47) మాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో 76 పరుగల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 
     

  • IND Vs AUS Live Score: ఏడో ఓవర్‌లో విరాట్ కోహ్లీ 7 ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్‌లో మొత్త 14 పరుగులు వచ్చాయి. స్కోరు 54/1 (7).

  • IND Vs AUS Live Score: రోహిత్ శర్మ హిట్టింగ్ ఆపడం లేదు. 20 బంతుల్లోనే 31 పరుగులతో ఆడుతున్నాడు. ఇందులో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. స్కోరు 37-1 (5). 
     

  • IND Vs AUS Live Score: టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ (4)ను మిచెల్ స్టార్క్ ఔట్ చేశాడు. ఆడమ్ జంపా చక్కటి క్యాచ్ అందుకున్నాడు. దీంతో 30 పరుగుల వద్ద భారత్‌ తొలి వికెట్ పడింది.

  • IND Vs AUS Live Score: శుభ్‌మన్‌ గిల్‌కు లైఫ్ లభించింది. స్టార్క్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికే ఎడ్జ్ తీసుకుంది. అయితే ఫీల్డర్ వరకు క్యారీ కాకపోవడంతో బతికిపోయాడు. ఈ ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి. స్కోరు మూడు ఓవర్లు 18-0.

  • IND Vs AUS Live Score: రెండో ఓవర్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ హిట్టింగ్ మొదలుపెట్టాడు. హేజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాడు. మొత్తం 10 పరుగులు వచ్చాయి. స్కోరు: 13/0 (2)
     

  • IND Vs AUS Live Score: తొలి బంతికే ఎల్బీ మిస్ అయింది. బంతి స్వింగ్ అయి రోహిత్ శర్మ ప్యాడ్లకు తాకింది. అయితే అంపైర్ నాటౌట్ ఇచ్చారు. మొదటి ఓవర్‌లో 3 పరుగులు వచ్చాయి.
     

  • తుది జట్లు ఇలా..

    భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
    ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ 

  • IND Vs AUS Toss: ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. 

  • India Vs Australia Final Updates: ప్రపంచకప్ ఫైనల్ పోరుకు టీమిండియా తుది జట్టులో మార్పులు జరగనున్నాయా..? రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి తీసుకోవాలని నిపుణులు ఎందుకు సూచిస్తున్నారు..? ఎవరిస్థానంలో తీసుకోవాల్సి ఉంటుంది..? పూర్తి వివరాల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి.

  • అహ్మదాబాద్‌లో జరిగే ప్రపంచ కప్ ఫైనల్‌కు ప్రపంచ కప్ విజేత టీమ్ కెప్టెన్లు అందరూ హాజరుకానున్నారు. క్లైవ్ లాయిడ్, కపిల్ దేవ్, అలన్ బోర్డర్, అర్జున రణతుంగ, స్టీవ్ వా, రికీ పాంటింగ్, ఎంఎస్ ధోనీ, మైకేల్ క్లార్క్, ఇయాన్ మోర్గాన్ రానున్నారు. పాకిస్థాన్ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్నందున ఫైనల్‌ మ్యాచ్‌కు హాజరుకాలేకపోతున్నారు.

  • ఆడమ్ గిల్‌క్రిస్ట్, మాథ్యూ హేడెన్ వంటి దిగ్గజాలు ఆసీస్‌ ఆటగాళ్లకు సందేశం పంపించారు.

     

  • నేడు మధ్యాహ్నం 1.30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మ్యాచ్‌ ఆరంభంకానుంది. రెండు జట్లు కూడా తుది జట్లలో మార్పులు చేసే అవకాశం లేదు. అయితే పిచ్, వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది..? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? వంటి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • IND Vs AUS Final Updates: మరికొన్ని గంటల్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ పోరు ఆరంభంకానుంది. కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలకు ఆతుక్కుపోనున్నారు. టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే.. సంబరాలు చేసుకునేందుకు టపాసులు సిద్ధం చేసుకున్నారు.  చివరి పోరుకు భారత్ మాస్టర్ ప్లాన్ వేసింది..? గత మ్యాచ్‌లకు భిన్నంగా ఆడనుందా..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ఏ మ్యాచ్‌లో ఏ ప్లేయర్ ఎక్కువ స్కోరు చేశారు..? గత 10 మ్యాచ్‌ల్లో టీమిండియా టాప్ స్కోరర్లు వీళ్లే..!

     

  • వరల్డ్ కప్‌లో టీమిండియా విజయం కోసం అందరూ ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. గత 10 మ్యాచ్‌ల్లోనూ ప్రతీ ఆటగాడు తమవంతు రాణించారు. కానీ ముగ్గురు ప్లేయర్లు మాత్రం జట్టులో ఎక్కువ ఇంపాక్ట్ చూపించారు. నలుగురు ప్లేయర్లు ప్లేయర్ ఆఫ్ టోర్నీ రేసులో నిలిచారు. వాళ్లు ఎవరంటే..?  వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • తుది జట్లు ఇలా (అంచనా)

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

    ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబూషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోస్ ఇంగ్లిష్ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, హేజిల్‌వుడ్ 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link