India Vs Australia Final Updates: వరల్డ్ కప్ 2023 ఫైనల్ వరకు టీమిండియా తుది జట్టులో ఎక్కువగా మార్పులు చేయలేదు. ఆరంభంలో శుభ్‌మన్ గిల్ డెంగ్యూ బారిన పడగా.. ఇషాన్ కిషన్, స్పిన్ పిచ్ కోసం తొలి మ్యాచ్ కోసం అశ్విన్‌కు అవకాశం దక్కింది. గిల్ రాకతో ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అశ్విన్ స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను ఆడించారు. అయితే హార్థిక్ పాండ్యా గాయం తరువాత కూర్పు మొత్తం మారిపోయింది. ఎక్స్ ట్రా బౌలర్‌ను జట్టులోకి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో శార్దుల్‌ను పక్కనబెట్టి.. సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీలకు అవకాశం కల్పించారు. బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌కు పెద్దగా ఆడే అవకాశం రాకపోగా.. బౌలింగ్‌లో మాత్రం మహ్మద్ షమీ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇక ఆసీస్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు తుది జట్టులో ఏమైనా మార్పులు ఉంటాయా..? అహ్మదాబాద్ పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందనే వార్తల నేపథ్యంలో అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకువస్తారా..?
భారత్-ఆసీస్ మధ్య మ్యాచ్‌కు నల్లటి నేల పిచ్‌ను ఉపయోగించే అవకాశం కనిపిస్తోంది. ఈ పిచ్‌పై చాలా తక్కువ ఎత్తులో వస్తుంది. స్పిన్నర్లకు ఎక్కువ సహకారం లభిస్తుంది. అశ్విన్‌ను జట్టులోకి తీసుకుంటే.. ఒక బ్యాటర్ లేదా ఒక ఫాస్ట్ బౌలర్‌ను తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంటే సూర్యకుమార్ యాదవ్ లేదా మహ్మద్ సిరాజ్‌లలో ఒకరు త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇది పెద్ద రిస్క్ అవుతుంది. మూడో పేసర్ తగ్గిపోయినా.. బ్యాటింగ్‌లో అటు ఇటు అయినా మొదటికే మోసం వస్తుంది. హార్థిక్ పాండ్యా ఉంటే మూడోపేసర్ రోల్ ప్లే చేసేవాడు. అప్పుడు కచ్చితంగా మార్పులు జరిగేవి. కానీ ప్రస్తుతం టీమిండియా మేనేజ్‌మెంట్ తుది జట్టును మార్చాలని అనుకోదని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఉండడంతో అశ్విన్‌కు అవసరం పడకపోవచ్చని చెబుతున్నారు.
ఆసీస్‌కు మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉంది. మధ్య ఓవర్లలో జడ్డూ-కుల్దీప్ చెలరేగితే.. కట్టడి చేయొచ్చు. లబూషేన్, స్టీవ్ స్మిత్ స్పిన్‌ను చక్కగా ఆడతారు. ఆరంభంలో టాప్ ఆర్డర్‌ను పేసర్లు వెనక్కిపంపిస్తే.. మిడిల్ ఆర్డర్‌లో వీరిద్దరికి స్పిన్నర్లు చెక్ పెడేతి మ్యాచ్‌లో మనదే పైచేయిగా ఉంటుంది. అటు ఆస్ట్రేలియా కూడా ఈ మ్యాచ్‌కు పెద్దగా మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. కెప్టెన్ పాట్ కమిన్స్, మిచెట్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ త్రయం పటిష్టంగా ఉండగా.. ఆడం జంపా ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. వీరికితోడు ట్రావిస్ హెడ్, మ్యాక్స్‌వెల్ కూడా బౌలింగ్‌లో ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది.
Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే
Also Read: Ind vs Aus 2003 and 2023: 2003 ప్రపంచకప్, 2023 ప్రపంచకప్ మధ్య సామీప్యతలు, కప్ మనదేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి