IPL 2024 Trading Window Live Updates: ఐపీఎల్‌ పూర్తి జట్ల వివరాలు ఇవే.. ఏ జట్టులో ఏ ప్లేయర్ అంటే..?

Sun, 26 Nov 2023-6:34 pm,

IPL 2024 Trading Window Live Blog: ఐపీఎల్ 2024 మినీ వేలం మరో నెల రోజుల్లో జరగనుండగా.. ఆటగాళ్ల రిటెన్షన్‌కు నేటితో గడవు ముగియనుంది. ఏ ప్లేయర్ వేలంలోకి రానున్నాడు..? ఏ ఆటగాడిని ఏ ఫ్రాంచైజీ ట్రేడింగ్ చేయనుంది..? ఐపీఎల్ ట్రేడింగ్ విండో లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024 Trading Window Live Blog: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రిటెన్షన్, ట్రేడింగ్‌కు నేడే ఆఖరి రోజు. అన్ని ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల ఎంపికలో బిజీగా ఉన్నాయి. ఐపీఎల్ 2024కు వేలానికి ముందు తమ వద్ద ఉంచుకునే ఆటగాళ్లను.. ఇతర ఫ్రాంఛైజీల నుంచి ఆటగాళ్లను మార్చుకునేందుకు రెడీ అయ్యాయి. ఈ సీజన్‌లో అందరినీ ఆకర్షిస్తున్న వార్త మాత్రం హర్థిక్ పాండ్యాదే. గుజరాత్ టైటాన్స్‌కు గుడ్‌బై చెప్పి.. తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరుకుంటాడనే ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. పాండ్యా ముంబైకు వెళ్లిపోతే.. శుభ్‌మన్ గిల్ లేదా కేన్ విలియమ్సన్ గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 19న దుబాయ్‌లో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. ఈ వేలానికి 590 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు రిటెన్షన్‌ షో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..
 

Latest Updates

  • IPL 2024 Retention Latest Updates: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాప్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ డాగర్ (ట్రెడింగ్), వైషాక్ విజయ్‌కుమార్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్

    విడుదలైన ఆటగాళ్లు: వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోను యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్.

  • IPL 2024 Retention Latest Updates: సన్‌రైజర్స్ హైదరాబాద్: అబ్దుల్ సమద్, ఐడెన్ మార్క్‌క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ (ఆర్‌బీసీ నుంచి ట్రేడింగ్), అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి.నటరాజన్, ఫజహక్ ఫరూఖీ

    విడుదలైన ఆటగాళ్లు: హ్యారీ బ్రూక్, సమర్థ్ వ్యాస్, కార్తీక్ త్యాగి, వివ్రాంత్ శర్మ, అకేల్ హోసేన్, ఆదిల్ రషీద్

  • IPL 2024 Retention Latest Updates: కోల్‌కతా నైట్ రైడర్స్: నితీష్ రాణా, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, రహ్మానుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, జాసన్ రాయ్, సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.

    విడుదలైన ఆటగాళ్లు: షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, డేవిడ్ వీస్, ఆర్య దేశాయ్, ఎన్ జగదీసన్, మన్‌దీప్ సింగ్, కుల్వంత్ ఖేజ్రోలియా, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, జాన్సన్ చార్లెస్.

  • IPL 2024 Retention Latest Updates: లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మనన్ వోహ్రా, ప్రేరక్ మన్కడ్, దీపక్ హుడా, కరణ్ శర్మ, కృనాల్ పాండ్యా, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, డేనియల్ సామ్స్, కరుణ్ నాయర్, సూర్యాంష్ షెడ్జ్, ఆయుష్ బడోని, స్వప్నిల్ సింగ్, క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్ పడిక్కల్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, జయదేవ్ ఉనద్కత్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, నవీన్-ఉల్-హక్, యుధ్వీర్ సింగ్ చరక్, మొహసిన్ ఖాన్, అర్పిత్ గులేరియా.

    విడుదలైన ప్లేయర్లు: డేనియల్ సామ్స్, కరుణ్ నాయర్, జయదేవ్ ఉనద్కత్, మనన్ వోహ్రా, కరణ్ శర్మ, సూర్యాంశ్ షెడ్గే, స్వప్నిల్ సింగ్, అర్పిత్ గులేరియా.

  • IPL 2024 Retention Latest Updates:  చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరకానా రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ.

    రిలీజ్ అయిన ఆటగాళ్లు: బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, డ్వైన్ ప్రిటోరియస్, భగత్ వర్మ, సుభ్రాంశు సేనాపతి, సిసంద మగల, కైల్ జేమీసన్, ఆకాష్ సింగ్.

  • IPL 2024 Retention Latest Updates: రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్‌మయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చౌల్, ఆడమ్ జాంపా.

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ట్రెడింగ్: అవేష్ ఖాన్.

    విడుదలైన ఆటగాళ్లు: జో రూట్, జాసన్ హోల్డర్, ఆకాష్ వశిష్ట్, కుల్దీప్ యాదవ్, ఒబెద్ మెక్‌కాయ్, మురుగన్ అశ్విన్, KC కరియప్ప, KM ఆసిఫ్, అబ్దుల్ బాసిత్.

  • గుజరాత్ టైటాన్స్: డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, బి.సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహ్మద్ షమీ, ఆర్ అహ్మద్, ఆర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జోష్ లిటిల్, మోహిత్ శర్మ

    విడుదలైన ప్లేయర్లు: యష్ దయాల్, KS భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, ప్రదీప్ సాంగ్వాన్, ఒడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, దసున్ షనక.

  • IPL 2024 Retention Latest Updates: రోహిత్ శర్మ (కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, క్యామ్ గ్రీన్, షామ్స్ ములానీ, నెహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, జాసన్ బెహ్రెండోర్ఫ్, రొమారియో షెపర్డ్ 

    రిలీజ్ అయిన ప్లేయర్లు: అర్షద్ ఖాన్, రమణదీప్ సింగ్, హృతిక్ షోకీన్, రాఘవ్ గోయల్, జోఫ్రా ఆర్చర్, ట్రిస్టన్ స్టబ్స్, డువాన్ జాన్సెన్.

  • IPL 2024 Retention Latest Updates: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్ వంటి స్టార్ ప్లేయర్లను వదులుకుంది. ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోను యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్‌లను కూడా రిలీజ్ చేసింది.

  • IPL 2024 Retention Latest Updates: యాష్‌ ధయాల్, కేఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, ప్రదీప్ శాంగ్వన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ధసూన్ షనకలను గుజరాత్ టైటాన్స్ రిలీజ్ చేసింది. కెప్టెన్ హార్థిక్ పాండ్యాను రిటైన్ చేసుకుంది.

     

  • IPL 2024 Retention Latest Updates: రూమర్లకు చెక్ పడింది. స్టార్ ఆల్‌రౌండర్ గుజరాత్ టైటాన్స్‌ జట్టుతోనే కొనసాగనున్నాడు. ముంబై ఇండియన్స్‌కు మారుతున్నాడని ప్రచారం జరిగినా.. అదేమి జరగలేదు. ముంబై ఇండియన్స్ పూర్తి జట్టును రిలీజ్ చేసింది.

     

  • IPL 2024 Retention Latest Updates: జయదేవ్ ఉనద్కట్, డానియోల్ సామ్స్, మనన్ వోహ్ర, స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, అర్పిత్ గులారియా, సుయాన్ష్‌ హెగ్డే, కరుణ్‌ నాయర్‌లను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నుంచి విడుదల చేసింది.

     

  • IPL 2024 Retention Latest Updates: భానుక రాజపక్స, మోహిత్ రాథీ, బల్టేజ్ ధాండ, రాజ్ అంగడ్, షారూక్ ఖాన్‌లను పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసింది.

     

  • IPL 2024 Retention Latest Updates: హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసింది. సామర్థ్ వ్యాస్, కార్తీక్ త్యాగి, విక్రాంత్ శర్మ, అకిల్ హుస్సేన్, ఆదిల్ రషీద్ వంటి ప్లేయర్లను వదులుకుంది.

     

  • IPL 2024 Retention Latest Updates: షకీబుల్ హాసన్, లిట్టన్ దాస్, ఆర్య దేశాయ్, డేవిడ్ వైజ్, నారాయణ్‌ జగదీశన్, మన్దీప్ సింగ్, శార్దుల్ ఠాకూర్, ఫెర్గ్యూసన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, జాన్సన్ ఛార్లెస్‌లను కోల్‌కతా నైట్ రైడర్స్ రిలీజ్ చేసింది. 

     

  • IPL 2024 Retention Latest Updates: జో రూట్, జేసన్ హోల్డర్, మురుగన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, కేఎమ్ ఆసిఫ్, ఒబెడ్ మెక్‌కాయ్, అబ్దుల్ బషీత్, ఆకాశ్ వశిస్ట్‌, కేసీ కరియప్పలను రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేసింది. 

     

  • IPL 2024 Retention Latest Updates: ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం 11 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ జట్టు పర్స్‌లో రూ.28.95 కోట్లు ఉన్నాయి. 

  • IPL 2024 Retention Latest Updates: ఢిల్లీ క్యాపిటల్స్ రోసో, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, సర్ఫారాజ్ ఖాన్, సాల్ట్, ముస్తఫీజుర్ రెహ్మన్, కమలేష్ నాగర్‌కోటి, రిపాల్ పటేల్, అమన్ ఖాన్, ప్రియామ్ గార్గ్, చేతన్ సకారియాలను జట్టు నుంచి విడుదల చేసింది.

  • IPL 2024 Trading Window Live Blog: చెన్నై సూపర్ కింగ్స్ బెన్‌ స్టోక్స్, అంబటి రాయుడు, జెమీసన్, ప్రీటోరిస్, భగత్ వర్మ, సుభాన్ష్ సేతుపతి, సిసింద మగల, ఆకాశ్ సింగ్‌లను జట్టు నుంచి విడుదల చేసింది. బెన్ స్టోక్స్‌ను ముందే రిలీజ్ చేయగా.. అంబటి రాయుడు ఇప్పటికే రిటైర్ మెంట్ ప్రకటించాడు. మొత్తం 8 మంది ప్లేయర్లను రిలీజ్ చేసింది. చెన్నైకు వేలంలోకి రూ.32.1 కోట్లతో వెళ్లనుంది.
     

  • ఢిల్లీ క్యాపిటల్స్ ముస్తాఫిజుర్ రెహమాన్, రిలీ రౌసో, రోవ్‌మాన్ పావెల్, ఫిల్ సాల్ట్, సర్ఫరాజ్ ఖాన్, అమన్ ఖాన్‌లను విడుదల చేసింది.
     

  • రాబోయే సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్‌లను తమ వద్దే ఉంచుకుంది.
     

  • లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆర్‌సీబీకి మారుతున్నాడని పుకార్లు రాగా.. తాజాగా వాటికి చెక్ పడింది. కేఎల్ రాహుల్‌ తమతోనే ఉంటాడని లక్నో ప్రకటించింది. 

     

  • చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీకి 2024 సీజన్ చివరిది కావచ్చు. ప్రస్తుతం ధోనీ వయసు 42 ఏళ్లు.  ఫిట్‌నెస్‌తో ఇబ్బంది పడుతున్న ధోనీ.. ఈ సీజన్‌ కూడా పూర్తిస్థాయిలో ఆడడం కష్టంగా ఉంది. 2022 సీజన్‌లోనే ధోనీ వారసుడిగా రవీంద్ర జడేజాకు అవకాశం ఇవ్వగా.. జట్టు పేలవ ప్రదర్శన చేసింది. దీంతో కెప్టెన్సీ పగ్గాలు మళ్లీ ధోనీనే తీసుకున్నాడు. ఐపీఎల్ 2023 ఛాంపియన్స్‌గా నిలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

     

  • ఆటగాళ్ల రిటెన్షన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టు ఫోటోలను షేర్ చేసింది. 

     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link