T20 World Cup Live: ఆసీస్‌కు ఎదురుదెబ్బ.. తొలి మ్యాచ్‌లో భారీ ఓటమి

Sat, 22 Oct 2022-4:41 pm,

T20 World Cup Live Updates: క్రికెట్ పండుగ మొదలైంది. నేటి నుంచి అసలు సమరం ఆరంభమైంది. టీ20 వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి.

T20 World Cup Live Updates: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. టీ20 వరల్డ్ కప్ అసలు సమరం ఆరంభమైంది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య పోరుతో పొట్టి ప్రపంచ కప్ పోరు మొదలైంది.

Latest Updates

  • తొలి టీ20 మ్యాచ్‌లో ఆసీస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కివీస్‌ చేతి 89 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులు.. 17.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయ్యారు. 

  • 16వ ఓవర్‌ లో కమ్మిన్స్‌ దూకుడుగా ఆడాడు. 4, 6 బాదడంతో మొత్తం 12 పరుగులు వచ్చాయి. స్కోరు: 16 ఓవర్లకు 109-7.
     

  • డిఫెండింగ్‌  ఛాంపియన్‌కు సొంత గడ్డపై తొలి ఓటమి ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. 15 ఓవర్‌లో కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసింది. స్కోరు: 15 ఓవర్లకు 97-7.
     

  • కంగారుల ఓటమి దాదాపు ఖరారు అయిపోయింది. పోరాడుతున్న మ్యాక్స్‌ వెల్‌ (28) కూడా ఔట్ అయ్యాడు. ఇష్ సోధీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్కోరు: 14 ఓవర్లకు 91-7.
     

  • 13వ ఓవర్‌లో ఆసీస్ మరో వికెట్ కోల్పోయింది. వికెట్ కీపర్ మ్యాథ్యూ వేడ్‌ను ఫెర్గుసన్‌ పెవిలియన్ బాట పట్టించాడు. ఈ ఓవర్‌లో 5 పరుగులు మాత్రమే వచ్చాయి. స్కోరు: 13 ఓవర్లకు 87-6

  • ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో మ్యాక్స్ వెల్ (28) పోరాతున్నాడు. ఇష్ సోధీ బౌలింగ్‌లో ఓ సిక్సర్ బాదాడు. దీంతో 12వ ఓవర్‌లో మొత్తం 8 పరుగులు వచ్చాయి. స్కోరు: 12 ఓవర్లకు 82-5

  • 11వ ఓవర్‌ మొదటి బంతికే సిక్సర్ బాదిన టిమ్ డేవిడ్ రెండో బంతికే ఔట్ అయ్యాడు. శాంటర్న్ బౌలింగ్‌లో నీషమ్‌కు క్యాచ్ ఇచ్చి డౌగౌట్‌కు వెళ్లిపోయాడు. ఆ తరువాత ఈ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ ఓ ఫోర్ బాదడంతో ఈ ఓవర్‌లో మొత్తం 12 రన్స్‌ వచ్చాయి. స్కోరు: 11 ఓవర్లకు 74-5

  • భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆసీస్‌ ఎదురీదుతోంది. ఇష్‌ సోధీ 9 ఓవర్‌లో 8 పరుగులు ఇచ్చాడు. స్కోరు: 10 ఓవర్లకు 62-4

  • కుదురుకుంటున్న సమయంలో కంగారులకు మరో ఎదురుబెబ్బ తగిలింది. శాంటర్న్ బౌలింగ్‌లో ఫిలిప్స్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో స్టాయినిస్ 7 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ ఓవర్‌లో కేవలం 4 రన్స్‌ మాత్రమే వచ్చాయి. స్కోరు: 9 ఓవర్లకు 54-4.

  • 8వ ఓవర్‌లో ఆసీస్ 50 పరుగుల మార్క్‌ను దాటింది. ఈ ఓవర్‌లో ఇష్‌ సోధీ 9 పరుగులు ఇచ్చాడు. స్కోరు: 8 ఓవర్లకు 50-3.
     

  • మొదటి పవర్ ప్లే పూర్తయింది. స్టాయినిస్, మ్యాక్‌వెల్‌ ఆచితూచి ఆడుతున్నారు. దీంతో 7 ఓవర్లో 4 పరుగులు మాత్రమే వచ్చాయి. స్కోరు: 7 ఓవర్లకు 41-3.
     

  • ఆస్ట్రేలియా స్కోరు బోర్డు నెమ్మదిగా కదులుతోంది. ఐదో ఓవర్‌లో ఫెర్గూసన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. స్కోరు: 6 ఓవర్లకు 37-3.

  • టిమ్‌ సౌదీ ఆసీస్‌కు మరోసారి ఝలక్‌ ఇచ్చాడు. దూకుడు మీదున్న మిచెల్‌ మార్ష్‌ (16)ను ఔట్ చేశాడు. ఈ ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. స్కోరు: 5 ఓవర్లకు 34-3.

  • నాలుగో ఓవర్‌లో ఆసీస్‌కు మరో షాక్‌ తగిలింది. కెప్టెన్‌ ఫించ్‌ను శాంటర్న్‌ పెవిలియన్‌కు పంపించాడు. ఫించ్‌ కేవలం 13 రన్స్‌ మాత్రమే చేశాడు. అంతకు ముందు ఈ ఓవర్‌లో మిచెల్‌ మార్ష్ 4, 6 కొట్టడంతో  మొత్తం 11 రన్స్‌ వచ్చాయి. స్కోరు: 4 ఓవర్లకు 30-2

  • మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ మూడో ఓవర్‌లో బ్యాట్‌ ఝులిపించాడు. 6,4 బాదడంతో మూడో ఓవర్‌లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. స్కోరు: 3 ఓవర్లకు 19-1

  • రెండో ఓవర్ మొదటి బంతికే ఆస్ట్రేలియాకు షాక్‌ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను టీమ్‌ సౌధీ క్లీన్‌ బౌల్డ్ చేశాడు. అంతేకాకుండా ఈ ఓవర్‌లో కేవలం 2 రన్స్‌ మాత్రమే ఇచ్చాడు. స్కోరు: 2 ఓవర్లకు 7-1

  • 201 రన్స్ భారీ టార్గెట్‌తో కంగారులు ఛేజింగ్ మొదలుపెట్టారు. మొదటి ఓవర్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.  
     

  • న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ ముగిసింది. మొత్తం 20 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. కాన్వే 92 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో నీషమ్ (13 బంతుల్లో 26 పరుగులు నాటౌట్‌) దూకుడుగా ఆడాడు. 201 పరుగుల లక్ష్యంతో ఆసీస్‌ బరిలోకి దిగనుంది.
     

  • 19వ ఓవర్‌లో కివీస్‌ 10 పరుగులు చేసింది. ఈ ఓవర్ చివరి బంతికి ఫోర్ బాదిన కాన్వే 89 పరుగులకు చేరుకున్నాడు. స్కోరు: 19 ఓవర్లకు 186-3.

  • 18 ఓవర్‌ రెండో బంతికి నీషమ్ భారీ సిక్సర్ బాదాడు. ఈ ఓవర్‌లో ఓ సిక్సర్‌తో పాటు రెండు వైడ్లు, మూడు సింగిల్స్‌, రెండు డబుల్స్‌తో మొత్తం 15 పరుగులు సమర్పించుకున్నాడు కమ్మిన్స్‌. స్కోరు: 18 ఓవర్లకు 176-3.
     

  • ఫిలిప్స్ స్థానంలో నీషమ్ క్రీజ్‌లోకి వచ్చాడు. 17 ఓవర్‌లో స్టాయినిస్ 9 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్‌లో కాన్వే ఓ ఫోర్ బాదాడు. స్కోరు: 17 ఓవర్లకు 161-3
     

  • 16 ఓవర్లో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన ఫిలిప్స్.. హజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ ఓవర్‌లో కివీస్ 150 మార్కును దాటేసింది. స్కోరు: 16 ఓవర్లకు 152-3

  • భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్ పయనిస్తోంది. ఓపెనర్ కాన్వే సూపర్ ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. 45 బంతుల్లో 70 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. 15 ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. స్కోరు: 15 ఓవర్లకు 144-2.

  • విలియమ్సన్ స్థానంలో గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్‌కు వచ్చాడు. 14 ఓవర్‌లో 3 పరుగులు చేసిన కాన్వే (63).. టీ20లో అత్యంత వేగంగా 1000 రన్స్ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 26 ఇన్నింగ్స్‌లలో కాన్వే ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ క్రమంలోనే అతను కోహ్లి రికార్డును అధికమించాడు. 27 ఇన్సింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు చేయగా.. కాన్వే 26 ఇన్నింగ్స్‌ల్లో 1000 రన్స్ చేసి బాబర్ అజామ్ సరసన నిలిచాడు. ఈ ఓవర్లో కివీస్ 9 రన్స్‌ చేసింది. స్కోరు: 14 ఓవర్లకు 134-2

  • ఎట్టకేలకు ఆసీస్‌కు రెండో వికెట్ లభించింది. జంపా బౌలింగ్‌లో కెప్టెన్ విలియమ్సన్ (23) ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇదే ఓవర్‌లో మొదటి బంతికి సిక్సర్ బాది అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కాన్వే. స్కోరు: 13 ఓవర్లకు 125-2.
     

  • ఓపెనర్ కాన్వే హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. 12 ఓవర్‌లో స్టార్క్ కంట్రోల్‌గా బౌలింగ్ చేశాడు. కేవలం 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు. స్కోరు: 12 ఓవర్లకు 114-1
     

  • న్యూజిలాండ్ సెంచరీ మార్క్‌ను దాటేసింది. 11 ఓవర్ మొదటి బంతికే విలియమ్సన్ సిక్సర్ బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. స్కోరు: 11 ఓవర్లకు 109-1.

  • కివీస్ నెట్ రన్‌ రేట్ 9కి తగ్గకుండా బ్యాటింగ్ చేస్తోంది. విలియమ్సన్, కాన్వే మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. పదో ఓవర్‌లో మిచెల్ స్టార్క్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. స్కోరు: 10 ఓవర్లకు 97-1

  • కివీస్ ఓపెనర్ కాన్వే ఆచితూచి ఆడుతున్నాడు. వీలు చిక్కినప్పుడు బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డు తగ్గకుండా చూస్తున్నాడు. 9 ఓవర్లో ఓ సిక్సర్ బాదడంతో మొత్తం 9 పరుగులు వచ్చాయి. స్కోరు: 9 ఓవర్లకు 90-1

  • న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌  నెమ్మదిగా సాగుతోంది. 8వ ఓవర్‌లో స్టాయినిస్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. స్కోరు: 8 ఓవర్లకు 81-1
     

  • ఏడో ఓవర్‌లో స్పిన్నర్‌ జంపాను బౌలింగ్‌కు తీసుకువచ్చాడు కెప్టెన్ ఫించ్. మొదటి బంతికి కాన్వే ఫోర్ బాదగా.. మిగిలిన 5 బాల్స్‌కు ఐదు సింగిల్స్‌ వచ్చాయి. మొత్తం ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. స్కోరు: 7 ఓవర్లకు 74-1

  • పవర్ ప్లే ముగిసింది. మొదటి నాలుగు ఓవర్లపాటు వీరబాదుడు బాదిన కివీస్.. చివరి రెండు ఓవర్లలో దూకుడు తగ్గించింది. ఆరో ఓవర్‌లో కేవలం 5 రన్స్‌ మాత్రమే వచ్చాయి. స్కోరు: 6 ఓవర్లకు 65-1

  • ఐదో ఓవర్‌లో కివీస్ దూకుడు తగ్గిపోయింది. అలెన్ ఔట్ కావడంతో వన్‌డౌన్‌లో కెప్టెన్ విలియమ్స్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. స్కోరు: 5 ఓవర్లకు 60-1

  • ఎట్టకేలకు ఆసీస్‌కు ఊరట లభించింది. దూకుడు మీద ఉన్న ఫిల్ అలెన్‌ (42)ను హజిల్‌వుడ్‌ క్లీన్‌ బౌల్డ్ చేశాడు. స్కోరు: 4.1 ఓవర్లకు 56-1
     

  • న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా ఫిన్ అలెన్ బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. దీంతో కివీస్ 3.5 ఓవర్లోనే 50 మార్క్ దాటేసింది. స్కోరు: 4 ఓవర్లకు 56-0

  • మూడో ఓవర్లో అలెన్ రెండు ఫోర్లు, సిక్సర్ బాదడంతో మొత్తం 17 పరుగులు వచ్చాయి. స్కోరు: 3 ఓవర్లకు 46-0
     

  • రెండో ఓవర్లోనూ కివీస్ దూకుడు కొనసాగింది. ఇద్దరు వేగంగా ఆడడంతో రెండో ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి.

  • మొదట బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్.. ఓపెనర్ ఫిన్ అలెన్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. 4,6,4 బాదిన అలెన్.. మొదటి ఓవర్‌లోనే 14 పరుగులు రాబట్టాడు.

  • జట్లు ఇవే..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    న్యూజిలాండ్: కన్వే, ఫిన్ అలెన్, విలియమ్సన్ (C), ఫిలిప్స్, మార్క్ చాంపన్, నీషమ్, శాంటర్న్, సౌథీ, ఇష్ సోదీ, ఫెర్గ్యూసన్, ట్రెంట్ బౌల్ట్

    ఆసీస్: ఆరోన్ ఫించ్ (C), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మ్యాక్స్‌ వెల్, స్టాయినిస్, టిమ్ డేవిడ్, మ్యాథ్యూ వేడ్, కమ్మిన్స్, స్టార్క్, జంపా, హజిల్‌వుడ్

  • టాస్ గెలిచిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link