Rashid Khan Six: ఇదేందయ్యో ఇది.. నేనెక్కడా చూడలే! బంతిని చూడకుండానే భారీ సిక్సర్ బాదిన స్టార్ క్రికెటర్!!
తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 20 ఓవర్ మూడో బంతిని ముల్తాన్ జట్టు పేసర్ దహానీ లో ఫుల్ టాస్ వేయగా.. బంతిని చూడకుండానే రషీద్ భారీ షాట్ ఆడాడు.
Rashid Khan hits No Look six in PSL 2022: క్రికెట్ ఆటలో అప్పుడప్పుడు కొన్ని అనుకోని, ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. బౌలర్ ఊహించని రీతిలో వికెట్ తీస్తే.. ఫీల్డర్ ఆశ్చర్యకర రీతిలో క్యాచులు పడుతుంటారు. బ్యాటర్ కూడా ఎవరూ ఊహించని విధంగా షాట్లు ఆడుతారు. ఒక్కోసారి ఆ షాట్లకు చూస్తే.. ఇలా కూడా ఆడుతారా? అని ఆశ్చర్యపోక మానదు. అలాంటి ఘటనే తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే...
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా ముల్తాన్ సుల్తాన్, లాహోర్ ఖలందర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. లాహోర్ ఖలందర్స్ తరఫున ఆడుతోన్న ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బంతిని చూడకుండానే భారీ సిక్సర్ బాదాడు. ఇన్నింగ్స్ 20 ఓవర్ మూడో బంతిని ముల్తాన్ జట్టు పేసర్ దహానీ లో ఫుల్ టాస్ వేయగా.. బంతిని చూడకుండానే రషీద్ భారీ షాట్ ఆడాడు. బంతి కాస్త భారీ ఎత్తున వెళ్లి స్టాండ్స్ లో పడింది. రషీద్ కొట్టిన షాట్‌కు కామెంటేటర్లు సైతం ఆశ్చర్యపోయారు.
రషీద్ ఖాన్ షాట్ కొట్టిన షాట్ నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన అందరూ నవ్వులు పూయిస్తున్నారు. ఈ వీడియోకి లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'రషీద్ భాయ్.. వాట్ ఏ షాట్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'సూపర్ షాట్ పో' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'ఇదేందయ్యో ఇది.. నేనెక్కడా చూడలే', 'ఇలాంటి షాట్లు కూడా ఆడతారా?', 'ఇది రషీద్ బయ్యాకే సాధ్యం' అంటూ నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇన్నింగ్స్ అఖరి ఓవర్‌లో రషీద్ ఖాన్ రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 16 పరుగులు రాబాట్టాడు. ఆపై బౌలింగ్‌లో కూడా చెలరేగాడు. తన కోటా నాలుగు ఓవర్ల రషీద్ 28 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ 20 ఓవర్లలో 206 పరుగల భారీ స్కోరు చేసింది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ జట్టు 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
Also Read: ఐటమ్ సాంగ్ కోసం 5 కోట్లు తీసుకున్న సమంత.. సన్నీ లియోన్, కత్రినా కైఫ్ ఎంత వసూలు చేసారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook