Mumbai Indians full squad for IPL 2024: మరో మూడు రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ మెుదలుకానుంది. జట్లన్నీ ఈ మెగా పోరుకు కావాల్సిన అస్త్రాలన్నింటినీ సిద్దం చేసుకుంటున్నాయి. ఈలోపే ముంబై జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఇప్ప‌టికే దిల్షాన్ మ‌దుష‌న‌క‌, నువాన్ తుషార‌లు గాయంతో కొన్ని మ్యాచ్‌ల‌కు దూరం కాగా.. తాజాగా ఉంద‌న‌గా స్టార్ పేస‌ర్ జేస‌న్ బెహ్రెన్‌డార్ఫ్ గాయ‌ప‌డ్డాడు. దీంతో అతడి స్థానంలో ఇంగ్లండ్ బౌల‌ర్ ల్యూక్ వుడ్‌(Luke Wood)ను తీసుకుంది. అతడిని రూ.50 లక్షల కనీస ధరకు దక్కించుకుంది ముంబై జట్టు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత సీజన్ లో  ముంబై తరపున 12 మ్యాచులలో 14 వికెట్లు తీసి ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు బెహ్రెన్‌డార్ఫ్. ఇతడు జట్టుకు దూరమవ్వడం హార్దిక్ సేనకు పెద్ద దెబ్బనే చెప్పాలి. ఇన్‌స్వింగర్‌లు వేయడంలో ల్యూక్ వుడ్‌ దిట్టనే చెప్పాలి. ఈ లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేస‌ర్ మంగ‌ళ‌వారం ముంబై  జ‌ట్టుతో క‌లిశాడు. ల్యూక్ ఇప్ప‌టివ‌ర‌కూ 5 టీ20లు మాత్రమే ఆడి 8 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. 


ముంబై ప్లేయింగ్ 11:
రోహిత్ శర్మ
ఇషాన్ కిషన్
సూర్యకుమార్ యాదవ్
తిలక్ వర్మ
హార్దిక్ పాండ్యా (సి)
టిమ్ డేవిడ్
మహమ్మద్ నబీ
గెరాల్డ్ కోయెట్జీ
పీయూష్ చావ్లా
జస్ప్రీత్ బుమ్రా
జాసన్ బెహ్రెండోర్ఫ్ 


ముంబై షెడ్యూల్
మార్చి 24 - గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్, అహ్మదాబాద్ - 7:30 PM
మార్చి 27 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్, హైదరాబాద్ - 7:30 PM
ఏప్రిల్ 01 - ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్, ముంబై - 7:30 PM
ఏప్రిల్ 07 - ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై - 3:30 PM


Also Read: Smriti Mandhana: ట్రోఫీ నెగ్గిన వేళ బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ఆర్సీబీ కెప్టెన్‌ స్మృతి మందాన్న


ముంబై జట్టు:
రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రీవిస్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, అర్జున్ టెండూల్కర్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రెండార్ఫ్, ఆకాష్ మధ్వల్, విష్ణు వినోద్, రొమారియో షెపర్డ్, షామ్స్ ములానీ, నెహాల్ వాద్ , పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, దిల్షన్ మధుశంక, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మహ్మద్ నబీ


Also Read: IPL 2024, CSK vs RCB: 'ప్లీజ్.. నా పిల్ల‌లకు ఐపీఎల్ టికెట్లు ఇప్పించండి'.. సీఎస్కేను కోరిన టీమిండియా స్టార్ బౌలర్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook